తాత్విక దృక్పథం
తాత్విక దృక్పథం @పిళ్లా కుమారస్వామి ,9490122229 ప్రతిమనిషికి తన అనుభవాల ద్వారా ఒక దృక్పథం అంటూ ఏర్పడుతుంది. ఏళ్లతరబడి పాతుకుపోయిన విశ్వాసాలు, శాస్త్ర విజ్ఞానం అందించిన జ్ఞానం ఆధారంగా ఒక తాత్విక దృక్పథం బాధ్యతలు తీరిపోయిన వారికి, ముసలివారికి మాత్రమే ఏర్పడేది కాదు. ఉదాహరణకు ఈ సమాజం మారదు. అదృష్టం ఎంతటిదైనా సాధించవచ్చు. తలరాతను తప్పించలేం! లాంటివన్ని ప్రతిమనిషికీ ఏదో ఒక సమయంలో ఏర్పడే భావాలే. అయితే అనుభవాల ద్వారా కొన్ని భావాలను మార్చుకుంటూ మరికొన్ని కొత్త భావాలను ఏర్పరచుకుంటూ తాత్విక దృక్పథాన్నిఅలవర్చుకుంటాడు. సమాజంలో వస్తున్న మార్పుల మీద పరిస్థితుల మీద ఇది ఆధారపడి ఉంటుంది. నేటి సమాజంలో రెండు దృక్పథాలు గల మానవులు ఉన్నారు. వీరిని పరిశీలిద్దాం. ఒక వ్యక్తి లాటరీ కొంటాడు. అదృష్టం బాగుంటే లాటరీ తగులుతుంది కదా అంటాడు. డబ్బు వచ్చే 'అదృష్టం' ఉంటే లాటరీ కొనకపోయినా డబ్బు ఆ వ్యక్తికి రావాలి కదా! లాటరీ టికెట్టు ఎందుకు కొనాల్సి వచ్చింది? అదృష్టం ఉంటే లాటరీ తగులుతుందని అనుకోవటం భావవాదం. అంటే కేవలం మానసికంగా భావించేది మాత్రమే. ఇది ఎక్కడా ఆచరణలో కనిపించని భావం. లాటరీ టికె...