Posts

Showing posts from December, 2020

అల్పపీడనం.హరికేన్ అంటే ఏమిటి? ఎలా ఏర్పడుతుంది?

జవాబు: గాలులు ఎక్కువగా గుమిగూడి ఉండే చోట అధిక పీడనం ఉంటుందనీ, పల్చగా ఉంటే ఆ ప్రాంతంలో అల్పపీడనమనీ అనుకోవచ్చు. గాలులు నిరంతరం తిరుగుతుండడం వల్ల ఇలా పీడనాల్లో వ్యత్యాసాలు వాతావరణంలో నిరంతరం ఏర్పడుతూనే ఉంటాయి. వేడిగాలులు పైకి లేచిన చోట అల్పపీడనం ఏర్పడితే, ఆ ప్రదేశంలోకి చల్లని గాలులు వేగంగా వచ్చి చేరుతాయి. ఈ గాలుల ఒరవడిలో ఒకోసారి సుడులు ఏర్పడతాయి. ఈ సుడుల వల్ల గాలుల పరిభ్రమణ వేగం ఎక్కువై, పెద్ద పరిమాణంలో గాలులు పోగవడం, పైకి వెళ్లే గాలులు ఎక్కువగా చల్లబడి పెద్దపెద్ద మేఘాలుగా ఏర్పడడం జరుగుతుంది. అందువల్లనే అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తాయి.  అల్పపీడనం ఏర్పడ్డ ప్రాంతాల్లో గాలుల ప్రభావం ఎక్కువైతే, దాన్ని వాయుగుండం అంటారు. అది కూడా బలపడితే తుపాను ఏర్పడుతుంది. అల్పపీడనాలు భూమ్మీద కూడా ఏర్పడవచ్చు. కానీ తుపానులు మాత్రం సముద్రంలోనే ఏర్పడతాయి. ఎందుకంటే అక్కడ గాలులకు కొండలు, భవనాలు వంటి అవరోధాలు ఉండవు కదా! అడ్డూ అదుపు లేని గాలులు అక్కడ సుడులు తిరుగుతూ కేంద్రీకృతమైపోతూ పెద్దవిగా మారిపోతాయి. మామూలుగా సూర్యుని కాంతితో సముద్రపు ఉపరితలాలు వేడెక్కడం వల్ల అక్కడ దాదాపు పదికిలోమీటర్ల...

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం

Image
ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం                              క్రీ.పూ. 1500లోని రుగ్వేదంలో 164వ సూక్తంలోని కవితల్లో దివి, పృథ్వి ఎవరు ముందుపుట్టారు? ఎవరు తరువాత పుట్టారు? పృథ్వి నుంచి ప్రాణం ఎలాపుట్టింది? ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమికి అంతం ఎక్కడ? లోకాలు ఎక్కడ నుంచి వచ్చాయి? అన్న ప్రశ్నలు ప్రాచీన మానవుడు వేసుకున్చాడు. ఆనాటికి విజ్ఞానం వికసించని దశలో సమాధానంగా అంతా దేవుడే అన్న విశ్వాసంలోకి వెళ్ళిపోయినాడు.    భారతదేశంలో క్రీ.పూ. 1000-600 మధ్య కాలంలో వచ్చిన ఉపనిషత్తులలో బృహదారణ్య కోపనిషత్ లో సృష్టి ఎలా జరిగిందనే విషయంపై పెద్దగా చర్చ చేశారు. ఈ ఉపనిషత్తు (1-2-2)లో విశ్వమంతా శూన్యంగా ఉండేదని అందులో జీవరహితమైన ఆకలి మృత్యు రూపంలో ఉండేదని చెప్పారు. ఆకలి శరీరం కావాలనుకొంది. దాంతో బ్రహ్మ నీటిని సృష్టించాడు. దాని నుండి నేలను సృష్టించాడు. బ్రహ్మ తేజస్సు (వీర్యం)అగ్నిగా మారిపోయింది. ఇందులో మొదటి భౌతిక పదార్థం నీరుగా చెప్పినారు. వీరి ప్రకారం సృష్టికి మూలం నీరే.      ప్రకృతిలోని భౌతి...

సాహిత్యంలో శాస్త్రీయభావాలు

              “ఏది సత్యం ఏదసత్యం ఓ మహాత్మా ఓ మహర్షి" అని శ్రీశ్రీ ప్రశ్నించాడు. మరి ఆ సత్యాన్ని తెలియజేసేదేమిటి ? సైన్సు. సైన్సు  అంటే శాస్త్రం.       ప్రతి రోజు టీవీల్లో జ్యోతిష్యశాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రం ఇలా చెప్పింది, అలా చెప్పింది అని చెబుతుంటారు. చాలా మంది అవి కూడా సైన్సే అనే భావించే అవకాశం ఉంది.         సైన్సు ఆధునిక పరిణామం. పందొమ్మిదో శతాబ్దం వరకు సైన్సును తత్వశాస్త్రంలో భాగంగా చూశారు.           అంతకుముందు కనుగొన్న సత్యాలను పందొమ్మిది శతాబ్దంలో విడదీసి వాటిని ప్రకృతి నియమాలుగా సూత్రీకరించారు.తరువాత కాలంలో భౌతిక ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడమన్న భావనతో సైన్సును పరిగణించారు. అప్పటి నుంచి శాస్త్రవేత్త, శాస్త్రీయత, శాస్త్ర పరిశోధన భావనలు రూపుదిద్దుకొన్నాయి.         ప్రశ్నించడం శాస్త్ర విజ్ఞానంలోనూ శాస్త్రీయ భావనలోనూ ప్రథమ లక్షణం.      ఎందుకని? ఎందుకని ? ఎందుకనెందుకని ? ఎందుకనెందుకని ?పస్తులెందుకని ? పేదరికం ఎందుకని ? అజ్ఞానం ఎందుకని ? అంటూ దేవి ...

దేవుడు సరే, దెయ్యంతోనే సమస్య!

మతతత్వానికి, మతానికి మధ్య కార్యకారణ సంబంధమేమీ ఉండనక్కరలేదు. మతతత్వం లేకుండా మతం సుదీర్ఘకాలాలు మనుగడలో ఉన్నది. ఆధునిక యుగంలో మతతత్వానికి, తీవ్ర జాతీయవాదానికి మధ్య కుదిరిన లంకె, శాస్త్ర విజ్ఞాన అంశాలతో కంటె, సామాజిక రాజకీయ అంశాలతోనే తగాదా పెట్టుకుంటుంది. అధినాయకుడు ఆధునికంగా ఉంటే, అనుచరులు అజ్ఞానాలను ప్రదర్శించడంలో అసహజం ఏముంది అనుకోవచ్చు. ఇందులో ఒకరిది జ్ఞానం, మరొకరిది అజ్ఞానం అనేమీ లేదు. అంతా ఒకటే నిర్మితి. ఎవరికి కావలసింది వారు తీసుకుంటారు. సంస్కరణలు వేగంగా జరుగుతూ ఉంటే, వెంటవెంటనే ప్రభుత్వ సంస్థలు పరాధీనం అవుతుంటే, అధికాదాయ వర్గాలకు అన్నీ సమకూరుతూ ఉంటే ఇక దేశంలో ఏమి జరుగుతున్నా పట్టించుకోని లబ్ధి దారుల తరగతి ఒకటి తయారయింది. సంస్కరణలను, నిర్హేతుకమయిన సామాజిక అజ్ఞానాన్ని ప్రశ్నించడం వారి దృష్టిలో ఒక న్యూసెన్స్. విస్తృత ప్రజానీకం అనేక సందర్భాలలో సహజ విజ్ఞతను ప్రదర్శిస్తారు కానీ, వారు తట్టుకోలేనంత వేగంగా, తీవ్రంగా సమ్మతి తయారీ జరుగుతున్నది.  ఇస్రోఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు అందరూ తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు, శ్రీ హరికోటకు సమీపదేవత చెంగాలమ్మకు కూడా పూజలు చేసుకున...

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata

Image
A statue of Aryabhata.  Who was Aryabhata? Did he invent the zero? Or, did he discover gravity, or even the heliocentric system? All these and more are answered here. The Genius And The Myths He ranks with Archimedes, Euclid, Isaac Newton and Leonard Euler as one of the greatest mathematicians of the world. He began a new epoch in Indian astronomy and mathematics, that continued for more than a millennium. His book  Aryabhateeyam  is a masterpiece of brevity and eloquence. But what did Aryabhata actually do? Aryabhata did  not  invent zero; or gravity; or the heliocentric system. As I wrote in my first essay, even Indian mathematics and Sanskrit scholars are stunningly ignorant of Aryabhata’s actual accomplishments. Since we are equally ignorant of almost all of ancient India’s glories, this is not specifically galling; just generally abysmal. Only Bhaskara was, perhaps, as popular and admired, but unlike Newton’s apple or Watt’s tea kettle, or the a...

జీవపదార్ధం_పుట్టుక

మనకు కనబడుతున్న విశ్వం ఆవిర్భావం 1400 కోట్ల సంత్సరాల కిందట జరిగిందని శాస్త్రవేత్తల అంచనా. విశ్వం లోని "ఆదిమ" పదార్ధం ప్రధానం గా హైడ్రోజన్ వాయువు రూపంలో ఉండేది. గురుత్వాకర్షణ వల్ల అది పొగుబడిన చోట్లలో నక్షత్రాలు పుట్టుకొచ్చాయి. నక్షత్రాల్లో జరిగిన పరమనుసంయోగ ప్రక్రియల వల్ల హీలియం, కార్బన్ , నైట్రోజన్ , ఆక్సిజన్ అణువులు రూపొందాయి. వీటిలో హీలియం తప్ప తక్కినవి జీవరాశి ఆవిర్భావానికి అవసరమైన ములపదార్ధాలు . కొన్ని నక్షత్రాలు పేలిపోగా ఈ పదార్ధాలు అంతరిక్షంలోకి వెదజల్లబడ్డాయి.  ఇవి రసాయనికం గా పరస్పరం కలవడం వల్ల నీటి ఆవిరి, కార్బన్ డై ఆక్సయిడ్ , రకరకాల హైడ్రోకార్బన్ లు తయారయ్యాయి. కొత్త నక్షత్రాలు పుట్టుకొచ్చిన వాయుమేఘాల్లో ఈ పదార్ధాలుండడంతో మన సౌర కుటుంబం వంటి వాటిలో ఇవన్నీ గ్రహాలు , ఉపగ్రహాలు, గ్రహశకలాలు, తోక చుక్కలు, ఉల్కల రూపంలో కనబడతాయి.  భూమి వంటి గ్రహాలు సూర్యుడి నుండి తగుమాత్రం దూరాన ఉండటం వల్ల అక్కడ జీవరాశి పుట్టడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే భూమి రూపొందిన మొదటి వంద కోట్ల సంవత్సరాలలో జరిగిన మార్పులు అంచనా వేసుకోవాలి. అప్పట్లో అగ్ని ...

జీవ కణాన్ని మనిషి కృత్రిమంగా ఎప్పటికీ తయారు చేయలేడా?

మతాలు చెప్పే కాకమ్మ కథలు పక్కకు పెడితే, జీవం నిర్జీవ పదార్ధం నుంచి పరిణామం చెంది వచ్చిందని, ఆ తర్వాత క్రమక్రమంగా ఈ జీవరాశులన్నీఒకదానినుంచి మరొకటి పరిణామం చెంది విర్భవించాయని  సైన్సు చెబుతోంది. దానికి ఆధారాలు కూడా చూపింది. ఎన్నో వివరణలు కూడా ఇచ్చింది. ఒపారిన్, మిల్లర్ చేసిన ప్రయోగాల్లో ఆ పరిణామ క్రమాన్ని కొంతవరకు సాధించారు కూడా! క్లుప్తంగా చూస్తే- ఆర్ ఎన్ ఏ, డి ఎన్ ఏ, ఎమినో ఆసిడ్స్, ప్రోటీన్స్,... ఆ తర్వాత ఏక కణ జీవం ఇలా పరిణామ చెంది ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, జీవ కణాన్ని నేరుగా నిర్జీవ పదార్థాలతో తయారు చేయడం మాత్రం ఇంతవరకూ సాధ్యం కాలేదు. జీవకణంలో ఉండే భాగాలు, వాటి నిర్మాణం గురించి శాస్త్రవేత్తలకి క్షుణ్ణంగా తెలుసు. కానీ ప్రయత్నం చేసిన ప్రతీసారీ శాస్త్రవేత్తలు వైఫల్యాన్నే ఎదుర్కొంటున్నారు! జన్వువులను తయారు చేయగలిగారు, వాటిని మార్చగల్గుతున్నారు గానీ, పూర్తిగా ఏక కణ జీవిని మాత్రం తయారు చేయలేకపోతున్నారు. ప్రయత్నాలు చేసీ, చేసీ విసిగి పోయి, ఇక కృత్రిమంగా పూర్తి జీవ కణాన్ని తయారు చేయడం సాధ్యం కాదని లేదా దాదాపు అసాధ్యం అని తేల్చేసారట! అంతేకాక ఆ ప్రయత్నం కూడ...

విశ్వ పరిణామం హిందూ మత గ్రంథాలు

హిందువుల వేదాల ప్రకారం సృష్ఠి ఆరంభం హిరణ్యగర్బం (బంగారు గుడ్డు) నుండి మరియు ఉష్ణశక్తి బిందువు నుండి ఆరంభం జరిగింది.హిరణ్యగర్భం సిద్దాంతం (oval shape or elliptical shape of Universe) ను పోలి ఉంటుంది.ఉష్ణశక్తి సిద్దాంతం నేడు ఆమోదించిన మహా విస్ఫోట సిద్ధాంతం (Big Bang Theory) ని పోలివుంటుంది. మహా విస్ఫోటం ప్రకారం, విశ్వం, మహా ద్రవ్యరాశి మరియు ఉష్ణస్థాయి నుండి నేటి వరకు గల వ్యాప్తి చెందింది. జీవ పరిణామం జరిగిందని హిందూ ధర్మం విశ్వసిస్తుంది.ఈ వాదాన్ని డార్విన్ జీవపరిణామ సిద్ధాంతంబలపరుస్తుంది. పూర్ణావతారములు మరియు డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం పోలి ఉంటాయి. మత గ్రంథాలలో సృష్టి గురించి చెప్పిన వివరణకు విరుద్ధంగా ఏదైనా శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు వెలువడినప్పుడు, కఠోర సృష్టివాదులు ఆ ఫలితాలను తిరస్కరించటం గానీ, [1] వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సిద్ధాంతాలను, [2]మరియు/లేదా వాటి నిర్వహణా పద్ధతులను తప్పుపట్టడం కానీ చేస్తుంటారు[3] ఈ కారణాల వల్ల, సృష్టివాద విజ్ఞానాన్ని, ఇంటెలిజెంట్ డిజైన్ సిద్ధాంతాన్ని ప్రధానస్రవంతిలోని శాస్త్రీయ సముదాయం మిథ్యా విజ్ఞానముగా ముద్రవేస్తున్నది.[4] Big Bang (బిగ్ బ్యాంగ్) సిద్దాం...

మనిషి_పరిధి

పసి బిడ్డ గా  రూపం దాల్చిన నుండి మనిషి గా రూపం కనుమరుగు అయినంత వరకే మనిషి పరిధి........ 1.గర్భం లో "శుక్రకణం , అండం తో ఐక్యం చెంది  సంయుక్త బీజం(జైగొట్)/ ఏక కణ జీవి గా ఏర్పడి, బహుకణ జీవిగా "జీవ పరిణామం" చెంది  ఒక రూపం  దాల్చి  బాహ్య ప్రపంచం లోకి  ఒక బిడ్డ వస్తుంది.... 2.బిడ్డలు  ప్రకృతి లోని "పదార్ధం"తో శారీరకంగా , కాలంతో పాటు అనుభవం తో   "మానసికం"గా పెరిగి  మనుషులు గా అవుతారు.. 3.#మనసు - #జీవి - #ఆలోచన..... మనిషి శరీరం జీవ కణాలతో ఏర్పడిన, ఒక #జీవి . మనిషి శరీరం లో ప్రతి జీవ కణం ను  అనుభూతి చెందేటట్లుగా అనుసంధానం చేయబడి సమన్వయ పరచగల  ద్రవ రూప జీవ పదార్ధం ఉంటుంది. దీనికి అనుభూతి చెందే మరియు ప్రేరణ కలిగించే గుణం  ఉంటుంది..  ఈ జీవ పదార్ధం యొక్క అనుభూతి "#మనసు". ఈ జీవ పదార్ధం యొక్క ప్రేరణ "#ఆలోచన"... ఈ ఆలోచన మెదడు లో కలిగి మనిషి లో చైతన్యం మరియు కదలిక ఏర్పడుతుంది..  4.ఈ ఆలోచన ఆధారంగా మనిషి ప్రవర్తన ఉంటుంది....మనిషి ప్రవర్తన సమాజం ను      ప్రభావితం చేస్తుంది...సమాజం యొక్క పరిస్థితి మనిషి ని ప్రభావితం...

కోడి ముందా? లేక గుడ్డు ముందా? జీవ పరిణామ క్రమం ప్రకారం ఏది ముందని అర్థం చేసుకోవాలి?

 జీవ పరిణామం ప్రకారం గుడ్డే ముందు. చాలామంది సైన్సుకు కూడా పరిమితులు ఉన్నాయనీ, అన్నింటికీ సైన్సు సమాధానం చెప్పలేదని దాన్ని తృణీకరించడానికి, తమకున్న ఛాందస భావాల్ని సమర్థించుకునే క్రమంలో సైన్సును ఎద్దేవా చేయడానికి 'చెట్టు ముందా? విత్తు ముందా?', 'కోడి ముందా? గుడ్డు ముందా?' అంటూ మాటల గారడీ చేస్తారు. నీలాంటి జిజ్ఞాసాపూరిత అమాయక విద్యార్థులే నిజమైన అసక్తితో ప్రశ్నలు వేస్తారు. వారెందుకలా ప్రశ్న సంధిస్తారంటే, గుడ్డు ముందు అని మనం అంటే అది కోడి లేకుండా (లేదా గుడ్డును యిచ్చే అండ జనని) గుడ్డు ఎలా వచ్చింది అంటారు. 'లేదండీ కోడే ముందు' అంటే- గుడ్డు లేకుండా ఎలా వచ్చింది? అంటారు. ఇలా ప్రశ్నలకు సమాధానం సైన్సు ఇవ్వడంలేదు చూశారా అంటూ విద్వేషపూరితంగా చమత్కరిస్తారు. గుడ్డే ముందు అన్నది సైన్సు వాదనకు నిలుస్తుంది. గుడ్డే ఏకకణం, కోడి లేదా గుడ్డు నుంచి వచ్చిన జీవి మరో ఏకకణం (మరో గుడ్డు) అవుతుంది. లేదా కోడిలాగా బహుకణ జీవి అవుతుంది. విత్తు (విత్తనం) ఏకకణం, ఆ విత్తునుంచి జీవావిర్భావ తొలి దశలో మరో విత్తు వస్తుంది లేదా చెట్టులాంటి బహుకణ జీవి తర్వాత వచ్చింది. జీవి ఏకకణ జీవి అయినా బహుకణ జీవి అయ...

భూమ్మీద మొదట కోతి పుట్టిందని, దాన్నుంచే మానవుడు పుట్టాడని విన్నాను. ఈ కోతి శాస్త్రీయంగా పుట్టిందా?

Image
         pc bannedbook.org దేవుడే మానవజాతిని సృష్టించాడని 19వ శతాబ్దానికి ముందు నమ్మేవారు. ఒక పవిత్ర శక్తి నుంచి ప్రాణులన్నీ వచ్చాయని అనుకునేవారు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం వచ్చే వరకు ఇవే భావనలు ఉండేవి. జీవ పరిణామం వల్లే ఇదంతా జరుగుతోందని చార్లెస్ డార్విన్ ఎలా నిర్ధరణకు వచ్చారు?  ఈ భూమ్మీద మొదట, అంటే భూమి ఏర్పడ్డ సుమారు 550 కోట్ల సంవత్సరాల క్రితం ఏ విధమైన జీవీ లేదు. కోతులు, కొంగలు ఏమీ లేవు. కేవలం సూర్యుడిలాగా స్వతహాగా కాంతినిచ్చే బుల్లి నక్షత్రంలాగే వాయు ధూళి రూపంలోనే వుండేది. క్రమేపీ తనలో ఉన్న కేంద్రక ఇంధనాల (Nuclear Fuel) యిన హైడ్రోజన్‌, డ్యూటీరియం వంటి వాయువులు కేంద్రక సంలీన చర్యల (Nuclear Fusion reactions) ద్వారా పెద్ద పెద్ద పరమాణువులుగా మారాయి. ఆ క్రమంలో ద్రవరూప పదార్థం సలసల మరుగుతూ ఏర్పడింది. ఉష్ణం, శక్తి ఎక్కడ ఏర్పడ్డాయో అక్కడే ఉండిపోవు. అధిక శక్తి ప్రాంతం నుంచి అల్పశక్తి ప్రాంతం వైపు శక్తి ప్రసరించడం సహజ లక్షణం. దీన్నే శాస్త్రీయ పరిభాషలో ఉష్ణ గతిక శాస్త్ర శూన్య నియమం (Zero Law of Thermo dynamics) అంటారు. కాలక్రమేణా ఉష్ణాన్ని, కాంతి శ...

జీవకణం

350 కోట్ల సంవత్సరాల క్రితం నిర్జీవ పదార్ధ పరిణామంలో భాగంగా జీవకణం రూపొందింది. సముద్రపు నీటిలో ఇది జరిగింది. అది విభజన జరిగి ప్రత్యుత్పత్తి జరపడం ఆరంభించింది. ఏకకణ సూక్ష్మ జీవ దశలోనే ప్రకృతి ఎంపిక ద్వారా జరిగిన పరిణామ ఫలితంగా జన్యువుల్లో మార్పులు జరిగి అనేక జాతులు ఏర్పడ్డాయి. ఏకకణజీవులు పరిణామ క్రమంలో బహుకణ జీవులుగా పరిణామం చెందాయి. బహుకణ జీవుల్లో మొదట వెన్నెముక లేని చిన్న చిన్న జీవులు పరిణామంలో వచ్చాయి. బహుకణ జీవుల్లో అనేక అవయవాలు రూపొంది శ్రమవిభజన జరిగి ఒక్కో అవయవం ఒక్కో పనిని చేయడం ఆరంభమైంది. బహుణ జీవుల్లో పరిణామం వల్ల వెన్నెముకలు గల జీవులు వచ్చాయి. వెన్నెముకలతో అస్తి పంజరం రూపొందడంతో శరీర పరిమాణం పెరగడం మొదలైంది. చేపలు లాంటి వెన్నెముక గల జీవులనుండి కప్పల్లాంటి వెన్నెముక జీవులు నీటినుండి బయటకు వచ్చి జీవించటానికి అనుకూలనాలు సాధించాయి. ఉభయ చర జీవులు ఆహారం కోసం నేల మీదకు రావడం, ప్రత్యుత్పత్తి కోసం నీటిలోకి పోతూ ఉభయ ఆవాసాల్లో జీవించడానికి అనుకూలనాలు సాధించాయి. కప్పల్లాంటి జీవులనుండే బల్లుల వంటి సరీ సృపాలు పరిణామంలో ఆవిర్భవించాయి. బల్లులు నేలమీద పొడి వాతావరణంలో జీవించడానికి అనుకూలనాలను సా...

అయస్కాంతాలు ఇనుమును మాత్రమే ఆకర్షిస్తాయెందుకు?

🟢 అయస్కాంతాల పట్ల ప్రవర్తించే తీరును బట్టి పదార్థాలను మూడు తరగతులుగా విభిజిస్తారు. అవి  1. డయాస్కాంత(dia-magnetic), 2. పరాయాస్కాంత (paramagnetic), 3. ఫెర్రో అయస్కాంత పదార్థాలు.  డయాస్కాంత పదార్థాలను బాహ్య అయస్కాంతం వికర్షిస్తుంది. అయితే ఈ వికర్షణ బలం చాలా స్వల్పం కాబట్టి మనం గుర్తించలేక ఆకర్షించడం లేదనే భావిస్తాము. నీరు, రబ్బరు, చక్కెర, ఉప్పు వంటివి ఇందుకు ఉదాహరణలు. ఇక పరాయాస్కాంత పదార్థాలను బాహ్య అయస్కాంతం స్వల్పంగా ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆకర్షణ బలం కూడా అతి స్వల్పంగా ఉండడంతో మనం వాటిని కూడా అయస్కాంతం ఆకర్షించదనే అనుకుంటాము. ఇందుకు ఉదాహరణ రక్తం, మైలతుత్తం, కొబాల్టు క్లోరైడు, ఆక్సిజన్‌, మాంగనీస్‌ సల్ఫేటు మొదలైనవి. ఇక మూడో రకమైన ఫెర్రో అయస్కాంత పదార్థాలను మాత్రమే అయస్కాంతం బలీయంగా ఆకర్షిస్తుంది. వీటిలో కేవలం ఇనుమే కాదు, క్రోమియం ఆక్సైడు, క్రోమియం, నికెల్‌ లోహాలు కూడా ఉన్నాయి. పదార్థాలలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఏమాత్రం లేకుండా అన్నీ జతలుగా ఉంటే అవి డయాస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. అణువుకో, పరమాణువుకో ఒకటో, రెండో జతకూడని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్న పదార్థాలు పరాయాస్కాంత ధర్మాలను ప్రదర...