నాగరికతలు వికసిస్తున్న దశలోనే ఏర్పడిన అనేక నమ్మకాలు, మూఢనమ్మకాలు.
నాగరికతలు వికసిస్తున్న దశలోనే ఏర్పడిన అనేక నమ్మకాలు, మూఢనమ్మకాలు. __ పిళ్లా కుమారస్వామి,9490122229 ఆత్మ భావన ఎలా వచ్చింది? ఆదిమ సమాజంలో సహజ మరణాలు దాదాపు లేవు.శత్రువుల చేతిలో నో జంతువుల బారినో పడి మనిషి మరణించేవాడు. పోరాటంలో గాయపడి సృహతప్పిన వాడికి మరణించిన వాడికి పెద్దగా తేడా తెలిసేది కాదు. స్పృహతప్పిన మనిషి మళ్లీ మేలుకొనే వాడు.దాన్ని చూసి మరణించిన మనిషి కూడా తిరిగి మేల్కొంటాడని నమ్మకం ఏర్పడింది. ఇదే మనిషిలో ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి ఉందనే ఒక నమ్మకం ఏర్పడడానికి కారణమయింది. అలాగే మనిషి నిద్రించే సమయంలో కలలు కంటుంటాడు .అప్పుడు కూడా మనిషి మరణించిన వాని లాగా ఉంటాడు .మనిషి నిద్రిస్తున్నప్పుడు శరీరంలోని ఒక అదృశ్య శక్తి బయటికి వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ నిద్ర లేవగానే శరీరం లోకి వస్తోందని భావించే వాళ్ళు. ఈ భావనే ఆత్మభావన కు దారి తీసిందన్నాడు గ్రాంట్ అల్లెన్ తన 'ఎవవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్' లో . జంతువులను వేటాడి ఆహారసేకరణ మానేసి కుదురుగా ఒకచ...