Posts

Showing posts from October, 2020

చంద్రమండలంపై నీటి జాడ

మనం రోజు రాత్రి ఆకాశంలోకి చూస్తున్నప్పుడు మనకు కనిపించే చంద్రుడి గుట్టు విప్పడానికి ప్రపంచ దేశాలు ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పుడు చంద్రమండలంపై నీటి యొక్క ఉనికిని పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి .చివరకు చంద్రునిపై నీటి దాడులు కనిపెట్టారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చంద్రుడి దక్షిణ ధ్రువం పై ఉన్న *CLAVIUS CRATER* పరిసరాల్లో నీటి జాడ ఉన్నట్లు నిర్ధారించింది అమెరికాకు చెందిన సోఫియా టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు .చంద్రుడిపై సూర్యుడి యొక్క కాంతి పడే చోట కూడా నీటి జాడ ఉందని  శాస్త్రవేత్తలు కనిపెట్టారు. చంద్రుడిపై సూర్యకాంతి పడే చోట మట్టిలోపెన్సిల్ కొన కంటే చిన్నదిగా ఉండే మట్టిలోని గాజు పూసలాంటి నిర్మాణాలలో నీటిని నిల్వ చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడు పై నీటి జాడను *భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో* తన *చంద్రయాన్ -1* మిషన్ ప్రయోగంతో నీటి జాడను మొదటిసారిగా కనిపెట్టిన దేశంగా భారత్ నిలిచింది ఇప్పుడు నాసా చేసిన పరిశోధనలు దానికి మరింత బలం చేకూరింది *Stratospheric Observatory for Infrared Astronomy(SOFIA)* ఇది ఒక ఖగోళ టెలిస్కోప్ అబ్జర్వేటరీ ఇ...

ఆ బిలాల రహస్యమేంటి?

 నక్షత్రాల జీవితకాలంలో వివిధ దశలుంటాయి. వాటిలో కృష్ణబిలం (బ్లాక్‌హోల్‌) చివరిది. ఈ దశకు ముందు నక్షత్రం రెడ్‌ జెయింట్‌, వైట్‌డ్వార్ఫ్‌, సూపర్‌నోవా, న్యూట్రిన్‌ స్టార్‌ లాంటి మరికొన్ని దశలను దాటుతుంది.  ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న నక్షత్రాలు చివరి దశకు చేరుకున్నప్పుడు, వాటిలోని గురుత్వాకర్షణ బలాలు ఎక్కువైపోతాయి. దాంతో అవి తమ కేంద్రం వైపు కుంచించుకుపోతాయి. వాటి ద్రవ్య సాంద్రత (density) అనంతంగా పెరుగుతుంది. దీన్నే కృష్ణబిలం అంటారు. కృష్ణబిలంలో దేశ,కాలాలు (space, time) వాటంతట అవి మలుపుతిరిగి దాంట్లోకి కలిసిపోతాయి. కృష్ణబిలం మీద పడే ద్రవ్యం, కాంతి కూడా వెనక్కి తిరిగి రాలేవు. కాబట్టి వీటిని మనం చూడలేము.  సూర్యుని ద్రవ్యరాశి 2,000,000,000,000,000,000,000 (2 తర్వాత 21 సున్నాలు) టన్నులు! వ్యాసం 1,000,000 కిలోమీటర్లు. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ సుబ్రహ్మణ్యం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.4 రెట్లు ఎక్కువగా ఉండే నక్షత్రాలే కృష్ణబిలాలుగా మారతాయని సిద్ధాంతీకరించాడు. సూర్యుని కన్నా అంత పెద్దగా ఉండే ఓ నక్షత్రం కృష్ణబిలంగా మారితే దాని వ్యాసం కేవలం 2.9 కిలోమీటర్ల వరకూ కుంచించుకుప...

ఆ పేలుడుకి ఉందా సాక్ష్యం?

 బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఒకప్పుడు అత్యధిక సాంద్రత, ఉష్ణోగ్రతలు కలిగిన ఒక చిన్న బిందువు. అది 1200 కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద శబ్దంతో పేలిపోయి కాంతి వేగంకన్నా ఎక్కువ వేగంతో విస్తరించింది. దాన్నే మహావిస్ఫోటం (బిగ్‌బ్యాంగ్‌) అంటారు. ఆ బిందువు అలా పేలిపోవడానికి కారణాలేంటో ఇప్పటికీ తెలియవు. అయితే ఈ సిద్ధాంతాన్ని రుజువు చేసే కొన్ని దృష్టాంతరాలు నమోదయ్యాయి. బిగ్‌బ్యాంగ్‌ ఉత్పన్నం చేసిన వికిరణ శక్తి (Radiation) ఇప్పటికీ విశ్వంలో కాస్మిక్‌ సూక్ష్మ తరంగ నేపథ్య వికిరణాల (casmic micro wave background radiation) రూపంలో ఉంది. ఈ కిరణాలను తొలిసారి ఆర్నోపెంజియాస్‌, రాబర్ట్‌ విల్సన్‌ అనే శాస్త్రవేత్తలు 1964లో కనుగొన్నారు. వీరు అప్పటి ధ్వని తరంగాలను వినడమే కాకుండా, ఈ వికిరణాల ఉష్ణోగ్రత మూడు కెల్విన్‌లుగా నిర్ధరించారు. దీంతో మహావిస్ఫోటం సిద్ధాంతానికి బలమైన మద్దతు లభించింది. కాస్మిక్‌ సూక్ష్మతరంగ నేపథ్య వికిరణాలు భూమి వైపు అన్ని దిశల నుంచీ వస్తున్నాయి. ఈ ధ్వనిని బిగ్‌బ్యాంగ్‌ ప్రతిధ్వనిగా భావించవచ్చు.

శాస్త్రీయ దృక్పథం

విశ్వం పుట్టుక జీవం పుట్టుక జీవ పరిణామ క్రమం మనిషి ఆవిర్భావం ప్రకృతి చుట్టూ ఏర్పరుచుకున్న నమ్మకాలు నమ్మకాలు బద్దలైన వేళ వికసించిన విజ్ఞాన శాస్త్రం వర్గ సమాజం సామాజిక మార్పు శాస్త్రీయ దృక్పథం కులం శాస్త్రీయ అవగాహన

విశ్వం ఏర్పడింది.. సృష్టించబడలేదు

Image
మాయలతో మంత్రాలతో ఈ భూమి పుట్టలేదు. ఏదో ఓ దేవుడు తీరికగా భోంచేసి కూర్చుని ఈ విశ్వాన్ని, సకల చరాచర జగత్తుని సృష్టించలేదు. మనిషిగా పుట్టినవాడు మనిషిగా ఆలోచించాలి. తన పుట్టుకను, తన అస్థిత్వాన్ని, సమాజ గతిని అన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే సైన్సు తెలుసుకోవాలి. కనీసం కామన్‌సెన్స్‌ (ఇంగితజ్ఞానాన్ని) ఉపయోగించాలి. కామన్‌సెన్స్‌ ఉపయోగించకుండా ఎవరైనా మాట్లాడితే తాము మూర్ఖులమని వారికి వారే ప్రకటించుకున్నట్టు అవుతుంది. అలాంటి వారు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంతటి స్థితిలో ఉన్నా వారి వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు. ఐదువందల బిలియన్‌ సంవత్సరాల పూర్వం, భూమిపుట్టిన తొలిదశలో భూమి ఉపరితల ఉష్ణోగ్రత అత్యంత గరిష్ట స్థాయిలో ఐదువందల సెంటీగ్రేడ్‌ నుండి ఆరువేల సెంటీగ్రేడ్‌ వరకు ఉంది. కొన్ని మిలియన్‌ సంవత్సరాల తరువాత భూమి కొంత చల్లబడింది. అప్పుడు భూమిలోపల ఉన్న, తక్కువ బరువున్న మూలకాలు హైడ్రోజన్‌, హీలియం, నైట్రోజన్‌, కార్బన్‌ వంటివి భూమి ఉపరితలంపైకి వ్యాపించి ప్రాథమిక వాతావరణం ఏర్పడింది. జీవుల పుట్టుక, మనుగడ కోసం భూమి ఉపరితలంలో జరిగిన పరిణామాల గూర్చి వివరంగా తెలుసుకోవడం ప్రతివారికీ అవసరం. ఆక్సిజన...

ఆకర్షణ శక్తి భూమికే ఎక్కువా?

సౌర మండలంలో ఉన్న గ్రహాలన్నింటిలో కన్నా భూమికే ఎక్కువ ఆకర్షణ శక్తి ఉందనుకోవడం సరికాదు. భూమి కన్నా అధిక ఆకర్షణ శక్తి ఉన్న గ్రహాలు ఉన్నాయి. ఫ్లూటోను గ్రహంగా పరిగణించడానికి వీల్లేదని తెలిసిన తర్వాత మన సౌర మండలంలో నవగ్రహాల బదులు అష్టగ్రహాలే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇందులో భూమి కన్నా తక్కువ ఆకర్షణ శక్తి ఉన్న గ్రహాలు, భూమి కన్నా ఎక్కువ ఆకర్షణ శక్తి ఉన్న గ్రహాలూ ఉన్నాయి. సాధారణంగా ఆకర్షణ శక్తిని గురుత్వ త్వరణంతో చూపుతాం.  భూమికి ఈ విలువ సుమారు 9.8 మీ/ సె2 ఉంటుంది. కానీ బృహస్పతి గ్రహానికి ఈ విలువ సుమారు 24.8మీ/ సె2 ఉంటుంది. అంటే భూమ్మీద 100 కిలోల బరువు తూగే బియ్యం బస్తా బృహస్పతి మీద సుమారు 250 కిలోల బరువు తూగుతుంది. ఇదే గురుత్వ త్వరణం శనిగ్రహం మీద 10.5మీ/ సె2 కాగా నెప్ట్యూన్‌ మీద 11.2మీ/ సె2 ఉంది. అంటే 100 కిలోల బస్తా శనిగ్రహం మీద సుమారు 110 కిలోల బరువు తూగగా నెప్ట్యూన్‌ మీద సుమారు 120 కిలోలు తూగుతుంది. భూమికి దాదాపు చేరువగా బరువు తూగే గ్రహాలు శుక్రగ్రహం, యూరేనస్‌లు. అక్కడ గురుత్వ త్వరణం విలువ సుమారు 8.9 మీ/సె2 ఉంటుంది. మిగిలిన అన్ని గ్రహాల విలువ భూమి కన్నా చాలా తక్కువే ఉంటుంది. ఒక గ్రహం ...