Posts

Showing posts from January, 2022

ఆర్యుల రాక నిజమే

ఆర్యుల రాక నిజమే? ——————————— హరప్పా ప్రజలు దక్షిణాదివారే.. వారిలో ఉన్నవి ఆ జన్యువులే ‘రాఖీగఢీ’ అస్థిపంజరం నుంచి డీఎన్‌ఏ సేకరించి పరీక్షించిన శాస్త్రజ్ఞులు భారతదేశంలోకి ఆర్యుల రాక నిజమేనా? నిజమంటారు కొందరు. వారు వచ్చి.. అప్పటికే ఉత్తరాదిన ఉన్నవారిని దక్షిణాదికి వెళ్లగొట్టారని చెబుతారు. ఇదంతా ఆంగ్లేయుల కుట్రని కొట్టిపారేస్తారు మరికొందరు. మరి ఎవరి వాదన నిజం? అత్యంత అధునాతనమైన డీఎన్‌ఏ పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నలకు కొంతమేరకు సమాధానం కనుగొనగలిగారు. హరప్పా నాగరికత ప్రజలకు.. దక్షిణ భారతదేశంలోని పూర్వీకులకు మధ్య జన్యు సంబంధం ఉందని తేల్చారు. ఈ నాగరికత క్షీణించిపోతున్న సమయంలో మధ్య ఆసియా నుంచి వ్యవసాయం చేసే రైతు సమూహాలు తరలి వచ్చి.. స్థానికులతో కలవటం వల్ల వారి జన్యువులు కూడా వీరిలో ఉన్నాయని తేల్చి చెప్పారు. మన భారత ఉపఖండ చరిత్రను తిరగరాసే ఈ జన్యుచరిత్రను త్వరలో అంతర్జాతీయ పత్రిక ‘సైన్స్‌’లో ప్రచురించనున్నారు.   రాఖీగఢీ.. ఢిల్లీకి మూడున్నర గంటల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లె. దాదాపు 9 వేల ఏళ్ల క్రితం నుంచి ఈ ప్రాంతంలో ప్రజలు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పటి హరప్పా-మోహంజ...

" చరిత్ర చదవని వాడు మరో చరిత్ర ను నిర్మించలేడు "

" చరిత్ర చదవని వాడు మరో చరిత్ర ను నిర్మించలేడు " మన మూలాలను మర్చిపోయి వైదిక భావన ఇచ్చిన పండుగల , పబ్బాల వెంట పరుగులు తీస్తున్నాం . ఈ దేశపు ఆదిమ జాతులమై ఉండి కూడా  అవిద్యా ,  అజ్ఞానాల తో  ప"రాయిని" ఆశ్రయించి  మన ఆలోచనలకు సమాధి కట్టేసుకుంటున్నాం . ఈ రోజు వినాయక చవితి .పార్వతీ తనయుడు  (నలుగుపిండి తో సృష్టించబడిన )  మన దేశపు సనాతన పశుపతి / శివుడి మీదా లేదా శైవం మీద జరిగిన  వైదిక దాడే ఈ వినాయక సృష్టి . " శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు " అనే నానుడి ని ఒక వైపు ప్రచారం చేస్తూ .... మరో వంక - తన భార్య స్నానాల గదిలో ఉన్నట్లు ఎవడో చెప్పాడని , అది నిజమో కాదో తెలుసు కునేందుకు శివుడు ఆదరా బాద రా వచ్చినట్లు  , అక్కడ ఒక బాలుడు అడ్డుకున్నట్లు , కోపం తో బాలుడి తల నరికినట్లు , తరువాత పార్వతి జరిగిన విషయం చెప్పి ఏడవడం , ఏనుగు తలను ఏర్పాటు చేయడం .సర్వజ్ఞ ఐన శివునికి  మానవ  బలహీనతలను అంటగట్టటం దాడి కాక మరేమౌతుంది ❓   పురాణాల ప్రకారం చూచినా , అంబేడ్కర్ గారి రచనల్లో వివరణ లు చూచినా ....  దేవుళ్ళు అనే భావనను పుట్టించిన వారే కాలక్రమంలో అదే దేవుళ...