Posts

Showing posts from September, 2020

కోతి నుంచి మనిషి రూపాంతరం చెందాడంటారు. మనిషి కూడా అలా మరో రకమైన జీవిగా మారతాడా?

Image
 గొంగళి పురుగు ప్యూపా దశలోకి వెళ్లి అందులోంచి సీతాకోక చిలుకగా మారినట్టు కోతి నుంచి మనిషి ఏర్పడలేదు. అది ఒక జీవి జీవిత చక్రంలో వివిధ దశలు కాగా, ఇది పరిణామ క్రమంలో ఒక భాగం. కోతి లాంటి జీవుల్లో కొన్ని లక్షల సంవత్సరాల విస్తారంలో మార్పులు జరిగి క్రమేపీ మనిషిలాంటి జీవులు పరిణామం (evolution) చెందాయని అంటాము. ప్రకృతిలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునేలా దేహంలో క్రమేపీ మార్పులు చెందేలా సంతానం తర్వాత సంతానం, తరం (generation) తర్వాత మరో తరంలో ఎంతో కొంత మార్పు జరుగుతుంది. ఏ మార్పులైతే ప్రకృతితో తలపడడానికి, మనుగడ సాగించడానికి అనువుగా ఉంటాయో అలా రూపాంతరం చెందిన జీవులే నిలుస్తాయి. అవి లేనివి అంతరిస్తాయి. దీనినే శాస్త్రవేత్త డార్విన్‌ 'ప్రకృతి వరణం ద్వారా జీవ పరిణామం, జంతువుల ఆవిర్భావం' (Origin of species by evolution and natural selection) అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనిషిలో కూడా మార్పులు జరిగి మరో ఆధునిక రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉంది. -ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక

జీవపరిణామం అంటే ఏమిటి?

Image
ఈ కార్యక్రమం లో భారత హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి మేడూరు సత్యనారాయణ " జీవపరిణామం" అంశం మీద ప్రసంగించారు. మానవుడు భూమి మీద రెండు లక్షల సంవత్సరాల క్రితం అంతకు మందు ఉన్న మనిషిలాంటి జీవజాతి హోమో ఎరక్టస్ నుంచి పరిణమించాడని, ఆఫ్రికాలో ఆవిర్భవించిన మనుషుల 60000 సంవత్సరాల క్రితం అక్కడ నుండి బయటకు వలస వచ్చి భూమి చుట్టూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రకృతి వరణం ద్వారా ఒక జాతి నుండి మరొక నూతన  జాతి  జీవులు పరిణమించాయన్నారు. దైవసృష్టివాదాన్ని డార్విన్ జీవపరిణామ వాదం తప్పు అని ఆధారాలు చూపిందన్నారు. మసనవుడు హేతుబద్ధ ఆలోచనతో, స్వతంత్ర చింతనతో అభివృద్ధి చెందడానికి అతనికి పరిణామ ఫలితంగా సంక్రమించిన పెద్ద మెదడే కారణం అన్నారు. మనిషి విశ్వాసి కాదు అన్వేషి అన్నారు. అనంతరం వీక్షక శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. మూడు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో 50 మంది పాల్గొన్నారు గుంటూరు జిల్లా హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి కరణం రవీంద్ర బాబు సూచనలు చేసి, వందన సమర్పణ చేశారు. https://youtu.be/j2qcLlgDZiU

కొబ్బరి చుట్టూ అల్లుకున్న నమ్మకాలు ఏమిటి?

కొబ్బరి కాయను దృష్టి తీయడానికి, హోమాలకు, వ్రతాలకు మాత్రమే కాకుండా కొత్త వాహనం కొనుక్కున్నప్పుడు కూడా ఎందుకు కొడతారు? కారు కొనుక్కుంటే ప్రమాదాలు ఏమి జరగకుండా కాపాడటానికి కొబ్బరికాయ కొట్టాలి అనే కారణం వెనుక భయం, నమ్మకం తప్ప మరేదీ లేదని శ్రీనివాస్ అన్నారు. కొబ్బరి కుళ్ళగానే అశుభం అంటారు. దీని గురించి చెబుతూ కుళ్ళిన ఏ పదార్ధమైనా పనికి రాదు. దానితో అది మనిషికి కూడా ఉపయోగపడటానికి పనికి రానిదవుతుంది తప్ప మరొకరకమైన అశుభమేమి జరగదని అన్నారు.

మరణం లేని జీవి ఉంటుందా.. ?

 విశ్వంలో చాలా చోట్ల జీవులుండటానికి ఆస్కారం ఉన్నా, సైద్ధాంతిక అవకాశం వున్నా మనకు లభించిన వైజ్ఞానిక ఆధారాల ప్రకారం, ఒక్క భూమి మీద తప్ప మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదు.  అంగారక గ్రహం మన సౌర మండలంలోనే మన పొరుగున ఉన్న గ్రహమే. దాని మీద గతంలో ఎపుడో జీవం వున్నట్లు అరకొర ఆధా రాలు అగుపించినా అవి బలమైన ఆధారాలు కావు. ఒకదాన్ని జీవి అనాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మన భూమ్మీద వృక్ష జాతులు, జంతు జాతులు అటుయిటూ గాని జాతులు లక్షలాదిగా వున్నా జీవులన్నింటికీ సార్వత్రికంగా (Universal or Common) కొన్ని సాధారణ లక్షణాలున్నాయి.  రాయిని చూపి పుస్తకమని అనలేం. ఇటుకను చూపి మొబైల్‌ ఫోన్‌ అనం. నదిని చూపి పర్వతం అనం. అలాగే వేటిని జీవులు అనకూడదో, వేటిని జీవులు అనాలో నిర్ద్వంద్వంగా చెప్పగలం.  మిల్లీమీటరులో సుమారు వెయ్యోవంతు ఉన్న తిత్తిలాంటి కోశంలో DNA లేదా RNAఅనే పొడవాటి బృహదణు (macro molecular) సముదాయం వుండడం జీవికి వున్న ప్రాథమిక లక్షణం. దీనికి ఏ జీవీ (చెట్టూ చేమా, చీమా దోమా, పురుగు పుట్రా, కప్పలు పాములూ, ఆవూ పందీ, తులసీ తుమ్మా, ఉమ్మెత్త ఉలవ, నత్త నల్లి, అమీబా అనకొండ, తేయాకు ...

విజ్ఞాన శాస్త్రం సముపార్జించిన అందరికీ శాస్త్రీయ దృక్పథం వున్నట్లేనా?

 శాస్త్రం, శాస్త్రీయ దృక్పథం ఒకటి కాదు. విజ్ఞాన శాస్త్రాన్ని ఆపోసన చేసిన వారందరికీ శాస్త్రీయ దృక్పథం వున్నట్లు భావించకూడదు. అయితే శాస్త్రీయ దృక్పథానికి ఆధారం మాత్రం శాస్త్రమే. అలాగని శాస్త్రీయ దృక్పథం ఉన్న వారందరూ సకల శాస్త్రకోవిదులు కారు. సామాజికంగా చూస్తే శాస్త్రం అందరికీ తెలియకపోయినా పర్లేదుగానీ, పరిమిత సంఖ్యలోనే శాస్త్రజ్ఞుల సంఖ్య దేశంలో ఉన్నా సర్దుకు పోవచ్చును గానీ శాస్త్రీయ దృక్పథం విషయంలో పరిమితికి తావులేదు. ఇది మొత్తం సమాజానికి ఆసాంతం వుండాలి. శాస్త్రీయ దృక్పథం, హేతువాదం సామాజిక సంస్కృతిగా ఉండాలి. ప్రతి జన జీవనంలోను శాస్త్రీయ దృక్పథం తొణికి సలాడాలి. శాస్త్రం అంటే ఏమిటో, శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటో? టూకీగా తెలుసుకుందాం. ప్రకృతి గురించిన, సమాజాన్ని గురించిన నియమాలను అవగా హన చేసుకోవడం, వాటికి సంబంధించిన వాస్త వాలను ప్రాయోగికంగాను, అనుభవాల ద్వారాను తెలుసుకోవడం, తద్వారా మానవ సమాజ జీవితంలో వాటిని ఇముడ్చుకుంటూ నిన్నటికంటే మెరుగయిన, తక్కువ వేదన కలిగిన ప్రజాజీవితానికి ఉపకరించడం- ఇదే శాస్త్రం (శాస్త్ర సాంకేతిక రంగాలు రెండూ శాస్త్రం అనే ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు కాబట్టి ఇక మీదట శ...

ప్రతికూలంలోనూ మనిషి వికసిస్తున్నది అందుకే..!

          మనిషి కంటే బలమైన జంతువులెన్నో ఉన్నాయి. యుగాలుగా కొనసాగుతున్న వాతావరణ మార్పులకు వాటిలో కొన్ని అంతరించిపోయాయి. కానీ, మానవజాతి మాత్రం వాటిని తట్టుకొని ఎలా పరిణామం సాధించగలి గింది? - శతాబ్దాలుగా శాస్త్రవేత్తలను డొలిచేస్తున్న ఈ ప్రశ్నకు ఎట్టకేలకు ఓ సమాధానం చిక్కింది. అది ప్రాచీన సూక్ష్మజీవుల ఆధారంగా! జార్జియా విశ్వవిద్యాల యానికి చెందిన మైఖేల్ ఆడమ్స్, వాన్ ఆండెల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటకు చెందినహుయిలిన్ లీ బృందం ఈ చిక్కుముడిని విప్పింది. భూమిపై దాదాపు అన్ని జీవులూ శ్వాసించడం ద్వారా విద్యుత్ శక్తిని రసాయనరూప వినియోగశక్తిగా మార్చుకుని మనుగడ సాగిస్తున్నాయి. అయితే, ప్రాచీన సూక్ష్మజీవి శ్వాసవ్యవస్థ (ఎంబీ హెచ్) నిర్మాణం.... మనుషుల్లోని కాంప్లెక్స్-1కు సారూప్యంగా ఉన్నట్లు వారు గుర్తించారు. ఎంబీ హెచ్ నిర్మాణ తీరును విశ్లేషించడం ద్వారా- మనిషి శ్వాసవ్యవస్థ పరిణామశీలతను వారు గమనించారు. “మరిగే నీటిలో చక్కగా అభి వృద్ధి చెందే సూక్ష్మజీవిలోని ఎంబీ హెచ్ సరిగ్గా మనిషిలోని శ్వాసవ్యవస్థ (కాంప్లెక్స్-1)ను పోలి ఉన్నట్లు గుర్తించాం. ఎంబీ హెలాగే.. పర్యావరణ మార్పులకు అణుగుణంగా కాంప్ల...

దయ్యం మీదపడటం

Image
నిద్రలో ఉన్నప్పుడు తమపై 'దయ్యం'మీద పడిందని,గొంతునూ,శరీరాన్ని అదిమిపట్టడం వల్ల కాళ్ళూ చేతులూ ఆడలేదని, మాటరాలేదని అంటుంటారు. ఇది నిజమేనా?? ------------------------------------------------------------------------------ ఇది చాలామందికి నిద్రలో అనుభవం అయ్యే ఉండవచ్చు. ఈ పరిస్థితి పేరు శాస్త్రీయంగా "స్లీపింగ్ పెరాలసిస్/hypnagogia". ఇది తెలుసుకోవాలనుకుంటే నిద్ర యొక్క దశలపై కొద్దిగా అవగాహన ఉండాలి. మనిషి మెలుకువగా(Conscious state of mind) ఉన్నప్పుడు ఒక సెకను కాలంలోనే గరిష్టంగా 6 రకాల ఆలోచనలు(Average) కలిగి ఉంటాడు. నిద్రలో ప్రధాన దశలు 1.మెలుకువ(అలోచనల గజిబిజి దశ),2.ట్రాన్స్(దాదాపుగ ఆలోచనల శూన్యం), 3.గాడనిద్ర(శరీరం విశ్రాంతి దశ), 4.కలల దశ. ట్రాన్స్ దశలోని మనిషి శరీరం గాడనిద్ర దశకు ఆకర్శించబడుతుంది లేదా గుంజబడుతుంది. ఈ సంధి కాలంలో ఇక్కడే మనిషికి గట్టిగా శబ్దం గానీ, డిస్టబెన్స్ గానీ జరిగితే ట్రాన్స్ దశకు రివర్స్ గా కదిలి మెలకువ దశ కు ప్రయత్నం జరుగుతుంది. మెలకువ కు రావచ్చు. అయితే శరీరం విశ్రాంతిదశను గట్టిగా డిమాండ్ చేస్తూ సక్సెస్ అయితే మనిషి మెలుకువకు రాలేడు. ఆ సంధి దశలోన...

సముద్రపు నీరు నీలం రంగులో కనిపిస్తుంది, ఎందుకు?

🟢 ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. సూర్యుని కాంతి ప్రధానంగా ఏడు రంగుల మిశ్రమమని చదువుకుని ఉంటారు. ఈ కాంతి సముద్రంపై పడినప్పుడు నీటి అణువులు ఆ కాంతిని వెదజల్లుతాయి. దీన్నే పరిక్షేపం (స్కాటరింగ్‌) అంటారు. ఇలా వెదజల్లేప్పుడు సూర్యకాంతిలోని ఇతర రంగుల కన్నా నీలం రంగు ఎక్కువగా పరిక్షేపమవుతుందనేది స్థూలంగా చెప్పే కారణం. రసాయనిక బంధాల పరంగా చూస్తే నీరు దృశ్యకాంతిని శోషించుకోలేదు. అందుకనే సాధారణ నీరు వర్ణరహితంగా, పారదర్శకంగా (colourless, transparent) ఉంటుంది. నీటి అణువులు కాంతిని శోషించుకోలేవు కాబట్టే వెదజల్లుతాయి. ఆ ప్రక్రియలో అధికంగా నీలం రంగునే వెదజల్లుతాయి. మన కన్ను సూటిగా వెళ్లే కాంతి కన్నా అన్ని వైపులకూ వెదజల్లిన కాంతిని ఎక్కువగా గుర్తించగలుగుతుంది. అలాగే నీలంగా కనిపించే ఆకాశాన్ని నీరు ఒక అద్దంలా ప్రతిబింబించడం కూడా సముద్రపు నీలం  ఒక కారణమని కూడా చెప్పవచ్చు.

సమాజంతో సైన్స్ కలసి నడవాలనే డా. నాయుడమ్మ

Image
“మన జీవితాల్ని చీకటిమయం చేస్తున్న అంధవిశ్వాసాల్ని తొలగించడానికీ,  సాహసం చేయగల ఉత్తేజాన్ని యివ్వడానికీ, భవిష్యత్తును చూడగల, దిద్దగల మేథస్సును అందుకోవడానికీ - మనకు శాస్త్రీయ అవగాహన చాలా అవసరం.” 1976 నవంబరు 15న బెంగుళూరు విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ డా. యలవర్తి నాయుడమ్మ చెప్పిన ఈ మాటలు లక్షల విలువ చేస్తాయి. డా. నాయుడమ్మ చర్మ సాంకేతిక విజ్ఞానంలో ప్రపంచస్థాయి శాస్త్రవేత్త మాత్రమే కాదు - విద్యావేత్త, విజ్ఞానరంగ ప్రణాళికా కర్త. అంతకుమించి మానవాళి అభ్యుదయానికి రూపశిల్పి. పేదరికం, మూఢనమ్మకం, నిరక్షరాస్యత మధ్య నలిగిపోయే గ్రామీణ భారతీయుడు విజ్ఞానం బాసటగా నిలవాలని ఆయన తపన.  గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో సామాన్యరైతు దంపతులు - అంజయ్య రాఘవమ్మ గార్లకు 1922 సెప్టెంబరు 10న నాయుడమ్మ జన్మించారు. తురుమెళ్ళ గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం నాయుడమ్మ గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాలలో ఇంటర్మీడియట్ చదివారు. తర్వాత వారణాసి కాశీవిశ్వవిద్యాలయం నుంచి (1943) కెమికల్ టెక్నాలజీలో బి.యస్సీ. డిగ్రీ పొందారు. 1943లో మదరాసులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో చేరారు. అక్కడ నాయుడమ్మ చురుకుదనం, ఆసక్తి...

జీవం పుట్టుక పై సాహిత్యం

                   భూమిపై జీవం ఎలా పుట్టింది ? ఈ ప్రశ్న మానవున్ని నిరంతరం వేధిస్తోంది. ఆధునిక విజ్ఞానం ఈ ప్రశ్నకు సమాధానం దాదాపు కనుగొన్నదనే చెప్పవచ్చు.             భారతదేశంలో క్రీ.పూ. 1000-600 మధ్య కాలంలో వచ్చిన ఉపనిషత్తులలో బృహదారణ్య కోపనిషత్ సృష్టి ఎలా జరిగిందనే విషయంపై పెద్దగా చర్చ చేశారు. ఈ ఉపనిషత్తులో (1-2-2)లో విశ్వమంతా శూన్యంగా ఉండేదని అందులో జీవరహితమైన ఆకలి మృత్యురూపంలో ఉండేదని చెప్పారు. ఆకలి శరీరం కావాలనుకొంది. దాంతో బ్రహ్మ నీటిని సృష్టించాడు. దాని నుండి నేలను సృష్టించాడు. బ్రహ్మ తేజస్సు (వీర్యం)అగ్నిగా మారిపోయింది. ఇందులో మొదటి భౌతిక పదార్థం నీరుగా చెప్పినారు. వీరి ప్రకారం సృష్టికి మూలం నీరే.        ప్రకృతిలోని భౌతిక పదార్థం, దానిలోని జీవం కలయిక వల్లే జీవం ఏర్పడుతోందని ప్రశ్నోపనిషత్  (క్రీ.పూ. 500-400) చెపుతుంది. ఇలా కొన్ని ఉపనిషత్తుల్లో దార్శనికులు కొద్దిపాటి భౌతికవాద దృష్టితో చెప్పినారు. ఉపనిషత్తులతో సంబంధం లేకుండా 'అసితకేశ కంబలుడు' అనే భౌతికవాద దార్శనికుడు నీరు, నిప్పు,...