సైన్సు తెలిసిన శాస్త్రవేత్త డా. పి.ఎం. భార్గవ నాల్గవ వర్ధంతి నేడు -------------------------------------------------------------------- (ఆత్మలనీ, పరమాత్మలనీ, దేవుళ్ళనీ, దెయ్యాలనీ, బాబాలనీ, స్వాముల్నీ, మంత్రాలనీ, తాయత్తుల్నీ, మహూర్తాలనీ, పూజల్నీ నమ్మే ఫేక్ సైంటిస్టులంతా ఈ నిజమైన సైంటిస్ట్ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.) డా. పి.యం. భార్గవ జననం: 22 ఫిబ్రవరి 1928 అస్తమయం: 01 ఆగస్టు 2017 (89 ఏళ్ళ వయస్సు) జన్మస్థలం: అజ్మీరు (అజయ్ మేరు), రాజస్థాన్ తల్లిదండ్రులు: డా. రామచంద్ర భార్గవ (వైద్యుడు) గాయత్రీ భార్గవ విద్య: బీసెంట్ థియోసాఫికల్ స్కూల్, వారణాసి, క్వీన్స్ కళాశాల, లక్నో యూనివర్సిటీ వాక్చాతుర్యంతో మనుషులు అబద్దాలు ప్రచారం చేస్తారేమో గాని సైన్సు భౌతికంగా అనేక రుజువులతో సత్యాన్ని మనముందు నిలబెడుతుంది. సైన్సు వెలుగులో ప్రజలకు సత్యమార్గం చూపించడానికి అహర్నిశలు ప్రయత్నించిన హేతువాది పుష్ప మిత్ర భార్గవ. ఈనాడు పాఠశాలలో విశ్వవిద్యాలయాల్లోనే గాక మేధావుల గొంతుకలను నులమడానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఎండ గట్టిన వాడు భార్గవ. 1944 లో బి.ఎస్సి పట్టా పొంది, 1946 లో సేంద్రీయ రసాయనాల శాస్త్ర...