Posts

Showing posts from January, 2023

మార్పు.

మార్పు.                ___ పిళ్లా కుమారస్వామి,9490122229           ప్రపంచం క్షణం క్షణం మారుతూ ఉంటుందన్నాడు బుద్దుడు. ప్రపంచంలో మారనిదంటూ ఉంటే అది మార్పు ఒక్కటే నన్నాడు మార్క్స్.అయితే ఆ మార్పు ఘర్షణ ద్వారా జరుగుతుందన్నాడు.  మార్పు ప్రకృతిలో నిరంతంరంగా ఉంది. అది ప్రకృతి సహజ లక్షణం. ప్రకృతిలో భాగంగా ఉన్న మనిషి ప్రవర్తన కూడా పరిస్థితులను బట్టి చెందుతూ ఉంది.మన చుట్టూ సమాజంలో జరిగే మార్పులు మనల్ని ప్రభావితం చేస్తాయి. మనలో మార్పు వస్తూ ఉంటుంది. అలాగే మన చర్యల ద్వారా పరిసరాల్లో కూడా మార్పులు వస్తుంటాయి.          మనం ఒక పని చేస్తే ప్రపంచం, దాంతోపాటు మనమూ కొంచమైనా మార్పు చెందుతాం. ప్రకృతిలో మార్పు అత్యంత సహజమైన జీవనప్రక్రియ. మార్పు  జీవనచైతన్య కేతనం. మార్పుల పరంపరే చరిత్ర.          "ప్రపంచం మారదు. మనం దేన్నీ మార్చలేము. మనుషుల స్వభావం మారదు. ఈ సమాజం మారదు” అని చాలామంది అంటూ ఉంటారు. ఇది నిజమా? సమాజ సంస్కృతి,  నీతినియమాలు, సంప్రదాయాలు స్థిరంగా ఉంటాయంటారు. దురాశ, అధికార వ్...

దేశాన్ని ఎదగనీయకుండా వెనక్కి లాగుతున్న పంచ భూతాలు

 దేశాన్ని ఎదగనీయకుండా వెనక్కి లాగుతున్న పంచ భూతాలు 1) *కులం* : ఇది ఈ విశ్వంలో ఎక్కడా లేని, కనబడని వింత డేంజర్ కాన్సెప్ట్. దీని బేసిక్ ప్రిన్సిపుల్ మనిషిని మనిషిగా చూడకూడదు. మనుషులను ఐదు జాతులుగా విడగొట్టి హింసించే నిచ్చెనమెట్ల వ్యవస్థ ఇది. మన దేశం ఎదగకపోడానికి, ఎదుగుదల ఆగిపోడానికి, వెనుకబాటు తనానికి 99 శాతం ప్రధాన కారణమిదే. దీన్నొక్క దాన్ని రూపుమాపితే, మిగతా రోగాలన్నీ వాటికవే నయమవుతాయి. 2) *వాస్తు* : ఇదో కామెడీ కాన్సెఫ్టు కష్టపడి కట్టుకున్న ఇంటిలో, ఆ మూలన ఇది పెట్టు, ఈ మూలన అది పెట్టకు, ఈ దిక్కున ఇది కట్టు, ఆదిక్కున ఇది కట్టకని చెప్పి, ఒక వేళ అలా గాని చెయ్యకపోతే, కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలు,మన దేశంలోని మనుషుల్లో,  కొన్ని ప్రత్యేక మతస్తులను మాత్రమే పసిగట్టి, పగబట్టి వేధించి, వార్నింగ్ లిచ్చి, వాటి కిరణాలను పంపించి నష్టం చేస్తా యంటా. అక్కడితో ఆగదు ఈ శాస్త్రం. ఈ గ్రహాల రివెంజ్ కి విరుగుడు కూడా తగలబడింది. ఒక్క 2000-/ కొడితే, ఇక్కడ నుంచే మన వాస్తు విద్వాంసులు, ఆ గ్రహాల ఆగ్రహాన్ని చల్లార్చి పడేస్తారు. ఆ దెబ్బతో జీవితం మారి పోతుందంటారు. 3) *జ్యోతిష్యం* : తమ జీవితాన్ని ...