హేతువాది బి.ప్రేమానంద్

హేతువాది బి.ప్రేమానంద్ 

     వీరి పేరు వింటే బాబాలు హడల్.  మహత్యాలన్నీ ట్రిక్కులేనని, మహత్యాలున్నాయని రుజువు చేసిన వారికి లక్ష రూపాయల బహుమానం అని నలభై ఏండ్ల క్రిందటనే ఛాలెంజ్ చేసిన ప్రముఖులు వీరు. విభూతి, ఉంగరాలు యిచ్చే స్వాములను మాకు అవేవీ వద్దు గుమ్మడికాయ యివ్వమన్నారు. కానీ ఎవ్వరూ యివ్వలేకపోయారు కారణం అది చేతిలో పట్టదు కనుక.అలా ఛాలెంజ్ చేసిన వ్యక్తే
 ప్రేమానంద్.

        పొడవాటి నెరసిన గెడ్డం, జుట్టుతో   రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుకు తెస్తారాయన. ఆయనతో చేతులు కలిపిన అందరికీ విభూతి యిచ్చేవాడు. 

 ప్రేమానంద్ గారిది మొండి పట్టుదల. చివరి రోజుల్లో (Stomach Can cer) పొట్టకు క్యాన్సర్ సోకి మూడు భాగాలు పొట్ట తీసేసిన తర్వాత 76 ఏళ్ల వయసులో కూడా ఆయన అదేపట్టుదలతో వుండేవారు.  ఆయన పోరాట పటిమ (Fighting Spirit) స్పూర్తిదాయకం.

ఆ పట్టుదలతోనే  అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాలలో సభలు నిర్వహించడంతో పాటు మహత్యాల బండారంపై వర్క్షాపులు నిర్వహించారు. ఎందరో యువకులకు శిక్షణ యిచ్చారు.

బహిరంగ సభల్లో తన కార్యక్రమం నిర్వహించే సందర్భంగా ప్రేమానంద్ తన మాటల్లో సాయిబాబాను ఘాటుగా, కసిగా విమర్శించేవారు. సాయిబాబాను కసాయిబాబా, అసత్య సాయిబాబా అనేవారు. యిది స్థానికంగా వున్న నిర్వాహకులకు చాలా యిబ్బందిగా వుండేది. ఎందుకంటే అబ్రహాం కోవూర్ వచ్చిన సమయంలో బాబా బలం తక్కువే. కానీ  ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి ఉచిత వైద్య సేవలు అందించడం ముఖ్యంగా రెండు లక్షల ఖరీదు చేసే గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించడం ద్వారాను మరియు జిల్లాలో వివిధ గ్రామాలకు త్రాగునీరు అందివ్వడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా జిల్లా ప్రజలు ఆయన మహత్యాలు నమ్మకపోయినా, జిల్లాకు మంచి చేస్తున్నాడు కదా మన మెందుకు ఆయన్ను వ్యతిరేకించాలి అనే అనుకూల ధోరణి పెంచుకున్నారు కనుకనే  బాబా ఆరాధ్యుడయ్యాడు.

     పుట్టపర్తిలో 1993లో ఆరోనెల, ఆరోతేది, ఆరు హత్యలు జరిగిన తర్వాతనే బాబా దాన్ని మరిపించడానికి సాయి వాటర్ స్క్ర్కీమ్ ప్రకటించాడని ఎవ్వరూ ఆలోచించడం లేకపోయారు. ఈ పథకం వల్ల పారిన నీరు వెంటనే ప్రజల దప్పిక తీర్చకముందే ఆయన బెడ్రూమ్లో పడిన బ్లడ్ను (రక్తాన్ని) వెంటనే కడిగేసింది . తమ మహత్యాలకు కాలం చెల్లింది కనుకనే మానవసేవ పేరుతో బలపడే ప్రయత్నం చేస్తున్నారు బాబాలు. ఇది ఒక రకంగా బాబాల పేరుతో జరిపే మోసాలను ప్రజలు విశ్వసించడం లేదడనాడికి నిదర్శనం.

హేతువాదులకు, నాస్తికులకు ప్రజాబలం లేకపోవడం వల్ల  దాడులు జరుగుతా యేమోననే భయం ఉంది.అయినా
ప్రేమానంద్ నిర్భయంగా తిరిగేవారు. ఎందుకంటే
 ప్రేమానంద్  ఒక వ్యక్తి కాదు. బలమైన శక్తి. బాబాలంటే ఆయనకు భయం లేదు. ఆయనంటేనే బాబాలకు భయం. కనుకనే ఆయన వొంటరిగా ప్రపంచమంతా తిరుగగలిగేవారు.
 ఎప్పుడూ పుస్తకాలు చదవడం, స్కెప్టిక్ మ్యాగజిన్కు కావాల్సిన ఆర్టికల్స్ వ్రాయడం చేసేవారు. సాయిబాబా భక్తులు ఆయనపై వ్రాసిన పుస్తకాలు బాబా భక్తులు కన్నా ప్రేమానంద్ ఎక్కువ చదివారు. చదవంది విమర్శించలేం కదా అనేవారాయన.

ఒకసారి కోయంబత్తూరుకు టికెట్ రిజర్వేషన్ కోసం రైల్వేస్టేషన్కు వెళ్తే "సార్ మీ వయసు 65 వేస్తే మీకు సీనియర్ సిటిజన్ కన్సెషన్ వస్తుంది" అని సలహా యిచ్చాడు బుకింగ్ క్లర్క్

ఆయన ఆ మాట వింటూనే "నా వయసు 64 నేనెందుకు 65 వ్రాయాలి. నేను ప్రభుత్వాన్ని మోసం చేయను "అని కోప్పడ్డారు. ఆయన 70 సం॥లు అని వ్రాసినా ఎవరూ అనుమానించలేదు. అయినా ఆయన అలా వ్రాయడానికి వొప్పుకోలేదు.ఆయన నిజాయితీ అలాంటిది.

     ఇంకొక సందర్భంలో ప్రేమానంద్  తాడిపత్రి రామమూర్తితో కలసి సాయినీటి పథకంలో జరిగిన అవకతవకలు తెలుసుకోవడానికి   టాక్సీ రెండు రోజులు బాడుగకు తీసుకొని వెళ్ళారు. ప్రేమానంద్ గురించి తెల్సుకొన్న టాక్సీ యజమాని  బయారెడ్డి "నాకు టాక్సీ బాడుగవద్దు, అది నా విరాళంగా తీసుకోండి అన్నాడు. కానీ ప్రేమానంద్ No. It is a taxi. It is your livelihood. I don't want to tax you' అంటూ మొత్తం చిల్లరతో సహా యిచ్చారు. యిలా ప్రతి చిన్న విషయంలో ఆయన ఖచ్చితంగా నిజాయితీగా ఆదర్శంగా వుండేవారు. 

బాల్యంలోనే విద్యార్థులకు హేతువాద ఆలోచనలు పెంచే విషయాలు చెప్పడం వల్ల భవిష్యత్లో వారి నుంచి మరెందరో కోవూర్లు, ప్రేమానంద్లు పుట్టుకొస్తారనేది ఒక వాస్తవం.ఈ విషయాన్ని ఆయన తో చెప్పినప్పుడు " you are right" అనేవారు.

కొందరు గొప్పవాళ్లు దగ్గరైతే వారిపై గతంలో మనకున్న మంచి అభిప్రాయం పోతుంది. ఎందుకంటే వాళ్లు వేదికపై చెప్పేది వొకటి. నిజజీవితంలో చేసేది మరొకటి. దీన్నే హిపోక్రసీ అంటాం.  అలాకాక ప్రేమానంద్ గారు చెప్పేది చేసేది ఒక్కటే.  అందుకే ఆయన అందరికీ ఆకాశమంత ఎత్తు కనపడేవారు.

     రక్తసహాయం,  మ్యాజిక్ కుల ద్వారా మహత్యాల బండారం మొదలైన కార్యక్రమాల ద్వారా విద్యార్థులను చైతన్యపరచడం, వారిలో శాస్త్రీయ దృక్పథం, సామాజిక స్పృహ పెంచడమే ప్రేమానంద్ గారికిచ్చే  నిజమైన నివాళి. ఇలా చేయడం వల్ల ప్రేమానంద్ మరణించినా, ఆయన ఉద్యమం కలకాలం బతికే వుంటుందనడంలో సందేహంలేదు.

ఏసుక్రీస్తు ఒక పెళ్ళి సందర్భంగా వచ్చిన వారందరికీ చాలినంత ద్రాక్ష సారాయి (వైన్)ని నీళ్ళద్వారా అందించాడట. నీరు కాస్తా ద్రాక్ష సారాయిగా మార్చడానికి ఆరు రాతి కూజాలను వాడారట. అలాగే మరో సందర్భంలో 5 రొట్టెముక్కల్ని వేలాది మందికి క్రీస్తు పంచి అద్భుతాన్ని చూపాడట. బైబిల్ ఆధారంగా యీ విషయాల్ని ఆయన వివరించాడు.
అమెరికా మాంత్రికుడు జేమ్స్ రాండి యీ విషయాలను లోగడ వివరించాడు. హేతువాది ప్రేమానంద్ సువార్త కూటాల వద్దకు రాగా, భక్తులు కొందరు ఆటంకపరచారు. బయట సభ పెట్టి క్రీస్తు మహిమల రహస్యాన్ని ఆయన వివరించాడు.

ఒక బాబాలో నీటిని ద్రాక్ష సారాయిగా మార్చవచ్చుగదా. అలాగాక, కేవలం రాతి కూజాలు అమర్చి వాటిలో నీళ్ళు పోయించి ద్రాక్షసారాయిగా ఎందుకు మార్చినట్లు? అదే రహస్యం. క్రీస్తుకు బావిలో నీటిని మార్చగల శక్తి లేదు. ఆయన తాను నేర్చిన మాంత్రికవిద్యతో ట్రిక్కు ప్రదర్శించి, ఆకర్షించాడు. ఎలాగ?

పెద్ద రాతి కూజాలలో చిన్న రాతి కూజాలు అమర్చాడు. చిన్న కూడా అంచు పెద్ద కూజా పైకి వుండేటట్లు ఏర్పరుస్తారు. చిన్న కూడా జనానికి కనిపించదు. పెద్ద కూజాలో ద్రాక్షసారాయి పోస్తారు. తరువాత చిన్న కూజా లోనపెట్టి, తలక్రిందులు చేస్తే చిన్న కూజా పెద్ద కూజాలో అతుక్కు పోతుంది. తరువాత చిన్నకూజాపై మూత పెట్టి పెద్ద కూజా మూత తీసి, అందులో ముందుగానే పోసిన ద్రాక్షరసాన్ని పంచుతారు. ఈ ట్రిక్కు తెలియక, భక్తులు అద్భుతంగా దాన్ని భావిస్తారు. 

 (తరిమెల అమరనాథ్ రెడ్డి గారు రాసిన  "ఆయనే మా రోల్ మోడల్ " గ్రంథం ఆధారంగా)

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata