Posts

Showing posts from May, 2022

ఎందుకని ? ఎందుకని ? ఎందుకని ?

ఎందుకని ? ఎందుకని ? ఎందుకని ? మూలంః కె.కె.కె. కుమార్ అనువాదం: దేవి ఎందుకని ఎందుకని ఎందుకనెందు కనెందు కనెందుకని  వానల్లో హరివిల్లు ఎందుకని  చుక్కల్లో మిలమిల ఎందుకని మల్లెలు తెల్లటి తెలు పెందుకు  మందారం ఎర్రటి ఎరుపెందుకు  మిణుగురు పురుగుల రెక్కల్లోన వెలుగుల దీపం ఎందుకని? ॥ఎందుకని॥ గువ్వలు కాకులు ఎగిరినట్టు పిల్లి ఎగరదు ఎందుకని చక్కని చిలుకల, చిట్టి ఉడతల ముద్దు ముచ్చట కేరింతలు జాంపండుకు లేవెందుకని ॥ఎందు|| పచ్చటి కొండల్లో చెట్లన్ని నరకుతున్నారు ఎందుకని నవ్వులు రువ్వే చిన్నికన్నుల్లో కన్నీళ్ళు చిమ్మేను ఎందుకని? రాము బుజ్జీ అమ్మతో పాటు అడుక్కు తింటున్నారు ఎందుకని  అన్నం మందులు కావాల్సుండగా బాంబులు చేస్తున్నారెందుకని  కులాల పేరిట మతాల పేరిట కొట్టుకు చస్తున్నా రెందుకని? పస్తులు ఎందుకని ? పేదరికం ఎందుకని ? అజ్ఞానం ఎందుకని ?  ఎందుకనెందుకని అంటూ ఇదే సమయం ప్రశ్నించడానికి ఎక్కడెక్కడ దౌర్జన్యం చెలరేగుతుందో అక్కడెక్కడ భయం బెదురు లేకుండా తలెత్తి గొంతెత్తి సూటిగా ప్రశ్నించు  ఎందుకని? ఎందుకని? ఎందుకని?