Posts

Showing posts from September, 2021

శాస్త్రీయ దృక్పథం

           శాస్త్రీయ దృక్పథం అనేది ఒక జీవన విధానం. సమాజం, సమాజంలోని వ్యక్తులు ఆలోచనలు, ఆచరణలు చేసే అత్యున్నత పద్ధతి ఇది. మన చుట్టూ ఉండే భౌతిక వాస్తవి కతను పరిశీలించి, ప్రశ్నించి, పరీక్షించి, విశ్లేషించి, ఒక అభిప్రాయానికి రావడం, దాన్ని కమ్యూనికేట్‌ చేయడమే శాస్త్రీయ దృక్పథం. తర్కం, చర్చ, వాదన, విశ్లేషణల ద్వారా నిర్ధారణలకు రావటం శాస్త్రీయ దృక్పథంలోని ప్రధాన అంశం. ఇందులో నమ్మకం ఉంటుంది, సమానత్వం ఉంటుంది, ప్రజాస్వామ్య బద్ధత ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భౌతిక వాస్తవికత మన ఆలోచనల్లో నుండి పుట్టదు, మన ఆలోచనలే భౌతిక వాస్తవికత నుండి పుడతాయి కాబట్టి మన ఆలోచనల ద్వారా వాస్తవికతను తెలుసుకోవడం కాకుండా ఆచరణల ద్వారా తెలుసుకోవడం శాస్త్రీయ దృక్పథం. దీనికి భిన్నమైంది అశాస్త్రీయ దృక్పథం.  ఈ నిర్వచనాన్ని పరిశీలించినప్పుడు శాస్త్రీయ దృక్పధం అనేది కేవలం సైన్సుకు సంబంధించిన విషయం మాత్రమే కాదనీ, అది వ్యక్తులకూ, సమాజానికంతటికీ సంబంధించిన విషయమని అర్ధమవుతుంది.  ఆధునిక సైన్సు శాస్త్రీయ పద్ధతిని మాత్రమే అంగీకరిస్తుంది. పరీక్షకు నిలవని దాన్ని అది అంగీకరించదు. తర్కం, విశ్లేషణ,...

రాళ్లు కూడా పెరుగుతాయా?

నంది విగ్రహం పెరుగుతోందంటే తప్పకుండా చిత్రమే. తప్పకుండా ఇది మాయే అనే భావన ఏర్పడుతుంది. అయితే, దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. అది తెలుసుకోవాలంటే.. ముందుగా యూరప్‌లోని రోమేనియాలో ఎదిగే రాళ్లు గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే. ఈ రాళ్లు కూడా నంది విగ్రహం కంటే వేగంగా పెరుగుతాయి. అంతేకాదు.. పిల్లలను కూడా పెడతాయి. ఇది వినడానికి చిత్రంగా ఉంది కదూ. అయితే, అదెలా సాధ్యమో చూడండి. రోమేనియాలోని రాళ్లు ఏకంగా జీవిస్తాయని చెప్పవచ్చు. ఈ రాళ్ల చుట్టూ చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్లు పెరుగుతుంటాయి. వాటినే ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు. కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లి రాయి నుంచి విడిపోతాయి. అవి మళ్లీ కిందపడి పెరుగుతాయి. వాటి ద్వారా మరికొన్ని రాళ్లు ఏర్పడతాయి. అలా రాళ్లు తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే, వీటిలో జీవం ఉండదు. కేవలం రసాయానిక క్రియ వల్లే అది సాధ్యం. అదెలాగంటే.. రొమేనియాలోని రాళ్లు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఇవి వేసవి కాలంలో సాధారణ రాళ్లలాగే కనిపిస్తాయి. కానీ, వర్షకాలం వచ్చేసరికి క్రమేనా ఎదుగుదల ప్రారంభం అవుతుంది. ఇందుకు కారణం.. ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బొనేట్...