సృజనాత్మకత
మొదట్లో ఇతర జంతువుల మాదిరిగా నిప్పంటే భయపడేవాడు. అది వేడిని ఇస్తుందని క్రూర మృగాలు నుండి కాపాడుతుందనే తెలుసుకున్నాక మండే అడవులనుండి అగ్నిపర్వతాల నుండి దివిటీ వెలిగించుకుని అవి ఆరిపోకుండా వంతులవారీ కాపలా కాసేవారు. మనిషి జీవితంలో నిప్పు చాలా ప్రధానమైంది. మనిషికి మాత్రమే పట్టుబడిన శక్తి అది. నాలుగు లక్షల సంవత్సరాల క్రితం మనిషిని కనుక్కున్నాడు.భారతం రచనా కాలంలో దానిని అరణి అనేవారు. నిప్పును ఉపయోగించి ఆహారం ఉడికించడం, కాల్చడం చేసేవారు . నిప్పు ఉపయోగం వలన జంతువులను లొంగదీసుకోవడం సులభమైంది. అగ్ని నాశనకారిగాకాక పదార్థాలను మార్చివేయగల ఒక మాంత్రిక శక్తి గా భావించారు. అగ్ని నాశనం చేయదు అది పునర్జన్మ నిస్తుందని భావించేవారు .రాళ్లను పగలకొట్టడానికి , వంటకూ నిప్పును వాడినారు. లోహాల శుద్దికి వాడినారు. దాంతో రాతి పనిముట్లు బదులు లోహపు పనిముట్లు కూడా వచ్చాయి. అగ్నిని దేవునిగా భావించారు. నిప్పు ద్వారానే ద్వారానే మనిషి హిమయుగంలో మనుగడ సాగించగలిగాడు. ఈ విధంగా నిప్పు మానవ నాగరికతలో ప్రధాన పాత్ర వహించింది. మనిషి తన జీవిత మజిలీలో మొట్టమొదట మాంసం కోసం మాత్రమే పశువులను పెంచాడు. అయితే త్వరలోనే అ...