ఆవిష్కరణల క్రమానుగతం



1905 ఐన్స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం, 1915లో సాధారణ సాపేక్ష సిద్ధాంతం వాస్తవ పరిశీలనలతో రుజువౌతూ కొనసాగాయి. 1900 నుంచే జీవకణాల్లోని జీన్స్ అధ్యయన జన్యుశాస్త్రంగా బయలుదేరి జన్యు ఇంజినీరింగ్ సాంకేతికతను ఆవిష్కరణ జరిగింది. మ్యాక్స్ ప్లాంక్ 1900లలోనే క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 1911లో పరమాణు కేంద్రక ఆవిష్కరణను రూధర్ఫర్డ్ చేశారు. 1912లో కాస్మిక్స్ ఆవిష్కరణను హెస్ చేశారు. 1912 బూ ఖండాల కదలిక సిద్ధాంతాన్ని వెగ్నర్ చేశారు. 1914లో మెదడు పనితనాన్ని ప్రభావితం చేసే న్యూరోట్రాన్స్మిటర్ల ఆవిష్కరణను డేల్, బర్గర్, లోవి చేశారు. 1918 తర్వాత జెనిటిక్ థీరాని, ప్రకృతివరణం ద్వారా జీవపరిణామ సిద్ధాంతంలో ఫిషర్, హాల్డేన్, రైట్లు మేళవించారు. నియో డార్వినిజం ఆవిర్భవించింది. 1921లో ఇన్సులిన్ ఉత్పత్తిని బాంటింగ్, చెస్ట్లు చేశారు. 1923లో హబుల్ గెలాక్సీలను వర్ణించి వివరించారు. 1925లో మానవ పూర్వ జీవుల పూర్వజీవి ఆస్ట్రలో పిథికస్ ఆఫ్రికానస్ ను డార్ట్ వివరించాడు. 1925 పదార్ధం అలవంటిదని డావిసన్, జర్మర్లు ప్రకటించారు. 1928లో ఫ్లెమింగ్ పెన్సిలిన్ను కనుగొన్నారు. విశ్వం విస్తరిస్తోందని హబుల్ ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని బలపరచారు.

1930లలో షాలింగ్ రసాయిన బంధాలను వివరించారు. 1931లో జాన్స్కీ పరిశోధనలతో రేడియో ఆస్ట్రానమీ ఆవిర్భవించింది. 1931లో రుస్కా ఎలక్ట్రాన్ మైక్రోస్కోపును రూపొందించారు. 1932లో పరమాణు శకలాలైన పాజిట్రాన్ అనే యాంటీమ్యాటర్ శకలాన్ని ఆండర్సన్ గుర్తించారు. 1938లో సూర్యుడిలోని కేంద్రక సంలీన చర్యలను బీతే, వాన్ విజాకర్లు గమనించారు. 1939 పరమాణ కేంద్రక విచ్ఛిత్తిని మీట్నర్, ఫ్రీష్లు కనుగొన్నారు. 1944లో బాక్టీరియాల్లో D.N.A. జన్యు పదార్ధమని అవెరీ, మాక్లియాడ్, న్యూకార్టీలు ప్రకటించారు. 1945 ఒక జన్యువు - ఒక ఎంజైము పరికల్పనను బీడిల్, టాటమీలు ప్రతిపాదించారు. 1946 రేడియో కార్బన్ డేటింగ్తో రాళ్ళ వయసును కనుగొనడాన్ని లిబ్బీ ఆవిష్కరించారు. 1948 బిగ్బ్యాంగ్ ద్వారా విశ్వం విస్తరించడం మొదలైందనే సిద్ధాంతాన్ని గామో, ఆల్ఫర్, హెర్మన్లు ప్రతిపాదించారు.

1953లో ప్రొటీన్లలోని ఎమైనో ఆమ్లాల వరుసను శాంగర్ ఆవిష్కరించారు. 1953లో వాట్సన్, క్రిక్లు డి.ఎన్.ఏ. నిర్మాణాన్ని డబుల్ హెలిక్సగా ఆవిష్కరించి నమూనాను రూపొందించారు. 1963 లోక్వాస్టార్లు ఉన్నాయని షిమిడ్ ప్రతిపాదించగా, క్వార్క్ కు ఉనికిని గుర్తించారు. జెల్-మన్, జ్విగ్లు. 1978లో విశ్వంలో డార్మెటర్ ఉందన్నారు రూబెన్. 1981లో స్ట్రింగ్ సిద్ధాంతంను గ్రీన్, ష్వార్ ప్రకటించారు. 1983 లో  ఆవిర్భవించిన ఆధునిక మానవులు బయటకు వచ్చి ప్రపంచమంతటా విస్తరించారనే విషయాన్ని అణు సమాచారంలో క్యాన్, స్టోన్కింగ్, విల్సన్లు ప్రతిపాదించారు. 1997 క్లోనింగ్ ప్రక్రియలో డాలీని సృష్టించారు. విల్మట్ 2001లో మానవ జన్యు సమాచారాన్ని హ్యూమన్ జిన్ ప్రాజెక్టు వారు ప్రకటించారు.

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata