Posts

Showing posts from March, 2021

జాతీయ సైన్స్ దినోత్సవం

మనదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 28 వ తారీఖున జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా జరుపుకుంటారు. ఆ రోజున అన్ని ప్రభుత్వ జాతీయ సంస్థలలోకి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు. ఉదాహరణకు DRDO, ISRO వంటి సంస్థల్లోకి ముందస్తు అనుమతిలేకుండా ఆ రోజు ఎవరైనా వెళ్ళొచ్చు. ఫిబ్రవరి 28, 1928న సర్ సి.వి.రామన్, తన ‘రామన్ ఎఫెక్ట్’ను కనుగొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ రోజును భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్’ దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కా రంలో, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో, ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, ఇలా ఇంకా ఎన్నో సాధించాలనకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్తజ్ఞ్రుల పాత్ర విలువకట్టలేనిది. జాతీయ స్థాయిలో సైన్స్ స్ఫూర్తిని చాటడం, శాస్త్రీీయ భావాలను  వ్యాప్తి చేయడం ఈ నేషనల్ సైన్స్ డే లక్ష్యాలు. ఆకాశం నీలి రంగులో ఉంటుంది ! సముద్రం కూడా నీలిరంగులో కనబడుతుంది. ఎందుకని? సూర్యకాంతిలోని సప్తవ...

కాలమానాలు

మానవుడు భూమి మీద ఆవిర్భవించి 2 లక్షల సంవత్సరాలు మాత్రమేనని శిలాజ ఆధారాలు తెలుపుతున్నాయి.            భాష నేర్చి 50 వేల సంవత్సరాలే. వ్యవసాయం చేయడం మొదలు పెట్టి 10000 సంవత్సరాలే. అందువల్ల, కృత, త్రేత, ద్వాపర, కలియుగాల కాలమానాలు కల్పితాలే.

నాగమణి

భారతదేశంలో నాగుపాము అంటే ఎంతో భక్తి, భయము. హిందూ పురాణాలలో కూడా వాటికి ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడు నాగుపామును మెడలో ధరిస్తాడు. నాగులచవితి నాడు నాగుపామును పూజిస్తారు. విశ్వాన్ని కాపాడే విష్ణుమూర్తి సర్ప రాజైన ఆదిశేషువుపై పవళిస్తాడని హిందువుల నమ్మకం.. అయితే నాగుపాముని పూజించే హిందువులు సైతం నాగుపాము కనిపిస్తే దూరంగా పారిపోతారు. కాని నాగమణి కనిపిస్తే మాత్రం ఆశగా ముందుకువెళతారు. దాని మహత్యం అలాంటిది. వందల ఏళ్లుగా నాగమణి కోసం ప్రయత్నించినవారు ఎందరో. దానిని చేజిక్కించుకోవాలని జీవితాంతం ట్రైచేసిన వాళ్లు మరికొందరు. నాగమణి అంటే వెలకట్టలేని వజ్రంగా భావిస్తారు. దానిని దేనితోనూ పోల్చలేం. నాగమణి దొరికితే.. ఇక చావు ఉండదని, అష్టైశ్వర్యాలు వస్తాయని చాలామంది నమ్మకం. దీనికి పురాణాలను, శాస్త్రాలను ఉదాహరణగా చూపిస్తారు. మరి నాగమణికి అంత శక్తి ఉందా? అసలు నాగమణి అంటూ ఏదైనా ఉందా? లేకపోతే అంతా కట్టుకథేనా? నాగమణి గురించి శాస్త్రీయంగా చూస్తే.. భూమిలోపల చాలా ఖనిజాలుంటాయి. వాటిలో కొన్ని వింత కాంతితో మెరుస్తూ ఉంటాయి. ఆ కాంతిలోనే పాములు.. తమ ఆహారమైన చిన్న జీవులను వెదుక్కుంటాయని అంటారు. ఆ కాంతితో కూడిన ఖనిజాల...

ఉపగ్రహాలు మానవ ఉపయోగం

Image
నేడు మనం ఉపయోగిస్తున్న సాంకేతికత లో నేడు అతి కీలకమైన పాత్ర పోషిస్తున్నది అంతరిక్ష విభాగం. ఈరోజు మనం ఉపయోగిస్తున్న టెలికమ్యూనికేషన్ తో పాటు తుఫాన్ హెచ్చరికలు, వనరుల పరిశీలన, భూ పరిశీలన , భారీ నౌకలకు మరియు విమానాలకు నేవిగేషన్ సూచన చెయ్యటం, సరిహద్దుల్లో నిఘా పెట్టడం. వాతావరణ మార్పులు , అంతరిక్ష పరిశోధనలు వంటి అనేక విభాగాలలో ఉపగ్రహాల పరిజ్ఞానాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఈ ఉపగ్రహాలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఉపగ్రహాలు తిరిగే కక్ష్యలు ఆధారంగా మరియు ఉపగ్రహాల ప్రయోజనాల ఆధారంగా వాటిని విభజిస్తారు. అవి: కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు టెక్నాలజీ ఉపయోగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి రేడియో టెలివిజన్ ప్రసారాలు ఈ ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా గాని వీక్షిస్తున్నామంటే. వీటివల్లనే ఒక చోటు నుండి వేరే చోటుకు ఉపగ్రహాలు సిగ్నల్స్ ని చేరవేస్తాయి. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ లు భూమికి 35 వేల ఎనిమిది వందల కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి భూమి తన ఆత్మ ప్రదక్షిణానికి ఎంత సమయం తీసుకుంటుందో  అంతే సమయంలో ఈ ఉపగ్రహాలు భూమి చుట్టూ ప్రదక్షిణం చేయడానికి తీసుకుంటాయి. వాతావరణ గ్రహాలు ఈ ఉపగ్రహాలు నిరంతరం భూమి యొక్క వాతావరణ...

మానవ పరిణామం

Image
           భూమి ఏర్పడిన తర్వాత భూమిపై అనేక జీవరాసులు పరిణామక్రమంలో ఏర్పడ్డాయి .ఒక దశలో అత్యధిక హిమపాతం కలిగిన భూమిని అంతరిక్షం నుంచి వచ్చిన ఆస్టరాయిడ్ శకలాలు తగలడం వల్ల అనేక వృక్షాలు జంతువులు మరణించాయి. ఆ సందర్భంలో  భూమి పైన అనేక గడ్డి మైదానాలు ఏర్పడ్డాయి. ఉత్తరకెన్యా, ఈశాన్య ఇథియోపియాలో లేక్    రుడాల్ఫ్ గడ్డి మైదానాలలో మానవ పరిణామ క్రమం ప్రారంభమైందనిఅందరూ అంగీకరిస్తున్నారు. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా  నడిచే వానరాలు చెట్ల మీద నుంచి భూమి మీదికి ఆహార సేకరణ కోసం చాలా దూరం గడ్డి  మైదానాల పై నడుస్తూ  వెళ్లాల్సి వచ్చేది. ఆ క్రమంలో లో వానరాలు నిలబడటం అలవాటు చేసుకున్నాయి. వెనుక కాళ్ళు మొత్తం శరీరాన్ని మోయగల శక్తిని సంపాదించుకున్నాయి. కాలి వేళ్ళు భూమిని పట్టుకునేందుకు అనువుగా పాదం వెడల్పుగా తయారైంది. అప్పుడు ముందు కాళ్ళు స్వేచ్ఛను పొందాయి. కాలక్రమంలో అవి మనిషి చేతులు గా రూపాంతరం చెందాయి. చెట్లు ఎగబాకే టప్పుడు, పళ్ళు ,కాయలు దుంపలు ఏరుకొనేటప్పుడు, రాళ్లను ఉపయోగించేటప్పుడు జరిగిన శ్రమవల్ల చెయ్యి నిర్మాణం అభివృద్ధి చెందింది. రకరకాల వస్...

మనసు

Image
మనసులో 3 భాగాలుంటాయి.  1.ఆవేశాలు 2. సమర్థత 3. తీరు. ఆగ్రహం, ఆహ్లాదం, అసూయ, అసహ్యం, దయ ,జాలి మొదలైనవి ఆవేశాలు గా పరిగణింపబడతాయి.  ఆవేశాలను అనుభవంలోకి తెచ్చుకోగలిగే శక్తిని సమర్థత అంటాం .ఆవేశాలకు మనం స్పందించే విధానాన్ని తీరు అంటారు. స్పందన తీవ్రంగా గాని అల్పంగా గాని ఉండటం సరైనది కాదు. మితంగా ఉండటం సరైన పద్ధతి. అందువల్ల శీలసంపద ఆవేశాలకు, సమర్థతకు కు సంబంధించింది కాదు .అది మనసు తీరుకు సంబంధించినది. భావాలు మనసు తీరును బట్టి ఉంటాయి. మనిషి  చేసే పనులు రెండు రకాలుగా ఉంటాయి. 1. ఉద్దేశం లేకుండా చేసేవి 2. ఉద్దేశంతో చేసేవి. ఉద్దేశపూర్వకమైన వాటిని మంచి చెడ్డలను బట్టి    మెచ్చుకోవడం గాని విమర్శ గాని గురవుతాయి . ఉద్దేశం లేకుండా చేసే  పనులు మాత్రం క్షమాపణ గాని జాలికి గాని గురవుతాయి . ఉద్దేశం లేకుండా చేసేవి రెండు రకాలుగా జరుగుతాయి. 1.ఒకరి వత్తిడి వల్ల లేదా ఆదేశాల వల్ల  2. విషయపరిజ్ఞానం సరిగా లేకపోవడం వల్ల .ఉదాహరణకు శిరచ్ఛేదం చేసే సైనికుడికి తను చేస్తున్నది ఏమిటో తెలుసు కానీ ఆ పని చెయ్యటం చేయకపోవడం అతని చేతిలో లేదు కనుక ఇది ఉద్దేశం లేకుండా చేసేదిగా పరిగణించాలి. అమాయకత్...

శాస్త్రీయ దృక్పథం అంటే?

ప్రశ్న : శాస్త్రం, శాస్త్రీయ దృక్పథం ఒకటేనా? విజ్ఞాన శాస్త్రం సముపార్జించిన అందరికీ శాస్త్రీయ దృక్పథం వున్నట్లేనా? - ఎం జగన్మోహన్‌రెడ్డి, వరంగల్‌ జవాబు : శాస్త్రం, శాస్త్రీయ దృక్పథం ఒకటి కాదు. విజ్ఞాన శాస్త్రాన్ని ఆపోసన చేసిన వారందరికీ శాస్త్రీయ దృక్పథం వున్నట్లు భావించకూడదు. అయితే శాస్త్రీయ దృక్పథానికి ఆధారం మాత్రం శాస్త్రమే. అలాగని శాస్త్రీయ దృక్పథం ఉన్న వారందరూ సకల శాస్త్రకోవిదులు కారు. సామాజికంగా చూస్తే శాస్త్రం అందరికీ తెలియకపోయినా పర్లేదుగానీ, పరిమిత సంఖ్యలోనే శాస్త్రజ్ఞుల సంఖ్య దేశంలో ఉన్నా సర్దుకు పోవచ్చును గానీ శాస్త్రీయ దృక్పథం విషయంలో పరిమితికి తావులేదు. ఇది మొత్తం సమాజానికి ఆసాంతం వుండాలి. శాస్త్రీయ దృక్పథం, హేతువాదం సామాజిక సంస్కృతిగా ఉండాలి. ప్రతి జన జీవనంలోను శాస్త్రీయ దృక్పథం తొణికి సలాడాలి. శాస్త్రం అంటే ఏమిటో, శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటో? టూకీగా తెలుసుకుందాం. ప్రకృతి గురించిన, సమాజాన్ని గురించిన నియమాలను అవగా హన చేసుకోవడం, వాటికి సంబంధించిన వాస్త వాలను ప్రాయోగికంగాను, అనుభవాల ద్వారాను తెలుసుకోవడం, తద్వారా మానవ సమాజ జీవితంలో వాటిని ఇముడ్చుకుంటూ నిన్నటికంటే మెరుగయిన, త...