ఈరోజు ప్రముఖ పాత్రికేయుడు, హేతువాది, మానవ వాది, రచయిత నార్ల వెంకటేశ్వరరావు జయంతి ******************************************************* నార్ల వెంకటేశ్వరరావు ( V. R. Narla ) (1 డిసెంబరు 1908 - 16 ఫిబ్రవరి 1985 ) తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. వీ.ఆర్.నార్లగా కూడా వీరు ప్రసిద్ధులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. హేతువాదిగా, మానవవాదిగా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల రచనలు అన్నీ కూర్చి ఇటీవలే "నార్ల రచనలు" పేరిట పలుభాగాలుగా వెలువరించారు నార్ల కుటుంబం వారు. నార్ల స్వాతంత్ర్యోద్యమంలో కూడా పాల్గొన్నారు. జీవిత విశేషాలు ------------------------ మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో జన్మించిన నార్ల విద్యాభ్యాసం కృష్ణాజిల్లాలో జరిగింది. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఈయన నార్ల వారి మాట అను శతకాన్ని కూడా రచించారు. నార్ల వారి సొంత గ్రంథాలయంలో 25,000 ...
Posts
Showing posts from December, 2023