Posts

Showing posts from March, 2022

జనచైతన్యమే జన విజ్ఞానవేదిక లక్ష్యం

జనచైతన్యమే జన విజ్ఞానవేదిక లక్ష్యం  భారత రాజ్యాంగంలోని 51ఎ (హెచ్) ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ ఆలోచనలు కల్గి వుండాలి. మానవత్వాన్ని పెంపొందించాలి. అందుకు పాలకులు కృషిచేయాలి. మన రాజ్యాంగం మతాన్ని వ్యక్తిగత అంశంగా పరిగణించింది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నించి ఇప్పటి వరకు పరిశీలిస్తే వ్యక్తిగత అంశంగా ఉన్న మతం రాజకీయ అంశంగా మారింది. ఫలితంగా ప్రజలలో వైజ్ఞానిక ఆలోచనలు పెరగడానికి బదులు మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు సంఘటనలు ఈ విషయాన్ని బలపరుస్తున్నారు. మదనపల్లె లో విద్యావంతులైన తల్లిదండ్రులు మూఢ నమ్మకాలతో తమ పిల్లలని దారుణంగా చంపారు. రైస్ పుల్లింగ్ యంత్రాల పేరుతో కొందరు మోసాలు చేస్తున్నారు. న్యూమరాలజీ,జ్యోతిష్యం వంటివి శాస్త్రాలుగా చలామణి అవుతున్నాయి. గ్రామాలలో చేతబడి పేరుతో అమాయకుల్ని భయభ్రాంతులకి గురిచేస్తూనే ఉన్నారు.క్షుద్రపూజల పేరుతో అక్కడక్కడా చిన్న పిల్లలని బలి ఇస్తున్నారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తన 'ది డిస్కవరీ ఆఫ్ ఇండియా' లో శాస్త్రీయ ఆలోచనలని గురించి ఇలా చెప్పారు. రుజువులు, ఆధారాలతో నిరూపించబడేదే 'విజ్ఞానం' అన్నారు. శాస్త...