గ్రహాలు


బుధ గ్రహం

       బుధుని ఇంగ్లీషులో 'మెర్క్యురీ' అంటారు. తారా(చుక్క) చంద్రులకు పుట్టినవాడు బుధుడని బ్రహ్మ పురాణంలో రాశారు. వేదాలలో అగ్ని కుమారుడన్నారు.ఇతరపురాణాల లో కార్తికేయుడు కుమారుడని రాశారు.బుధునికి కుమారుడనే  పేరు కూడా ఉంది. అదే గ్రీకు పురాణాల్లో  అతను బృహస్పతి (గురుడు)కి పుట్టినట్లు రాశారు.ఆనాటి కవుల ఊహలు అలా ఉండేవి. మనిషిని గ్రహానికి ప్రతీకగా చేశారు.
        ఇప్పుడున్న ఎనిమిది గ్రహాల్లో బుధగ్రహం అతి చిన్నది. సూర్యునికి అతి దగ్గరలో వుంది. చంద్రునికన్నా ఇది కాస్త పెద్దది. ఆకాశంలో మనం చూసినప్పుడు బుధగ్రహం ఎప్పుడూ సూర్యునికి తోకలా అంటి పెట్టుకుని తిరుగుతుంది. దానికి కారణం అది సూర్యునికి చేరువలో ఉండడమే. అందుకనే బుధగ్రహం రాత్రివేళ కనిపించదు. సూర్యోదయమప్పుడు తూర్పులో, సాయంసంధ్యా సమయంలో పడమరలో దిగంతం నిర్మలంగా ఉంటే బుధుడు కనిపిస్తాడు.
      సూర్య కుటుంబంలో అతి చిన్నది,సూర్యుడికి అతి సమీపంలో ఉండేగ్రహం బుధుడు గ్రహం. బుధ గ్రహం  88 రోజులలో సూర్యప్రదక్షణం ముగిస్తుంది.
      1973లో అమెరికా పంపిన మెరైనర్-10 అనే వ్యోమ నౌక 1974 మార్చి 29న బుధ గ్రహంచేరుకుని దాని చుట్టూ పరిభ్రమిస్తూ 10,000 ఫోటోలు తీసి భూమికి పంపింది. ఈ నౌక బుధ గ్రహం మీద 57 శాతం ఉపరితలాన్ని పరిశోధించింది.దీనికి ఎలాంటి ఉపగ్రహాలు లేవు.

శుక్రగ్రహం

         బుధుని తరువాత ఉన్న రెండో గ్రహం శుక్ర గ్రహం.ఇది భూమికి దగ్గరగా ఉన్న గ్రహం. ఆకాశంలో సూర్యచంద్రుల తరువాత ప్రకాశవంతంగా కనిపించే గ్రహం ఇది. దీన్ని వేగుచుక్క(ఉదయతార) సాయంకాల చుక్క(సంధ్యాతార) అని పిలుస్తారు.  పురాణ పురుషుడైన శుక్రాచార్యుని పేరు ఇదే. ఇంగ్లీషులో దీన్ని 'వీనస్’ అంటారు. వీనస్ అంటే రోమన్ల సౌందర్య దేవత. 

     

       సౌరకుటుంబంలోనే అత్యంత నివాసయోగ్యం కాని గ్రహంలో ఇది మొదటివరసలో ఉంటుంది. ఈ గ్రహంపై ఒక పొరలా కార్బన్ డయాక్సైడ్ కప్పి ఉంటుంది. సౌర కుటుంబంలో అత్యంత వేడి గల గ్రహం .వాతావరణ పీడనం భూమి మీద కంటే 90 రెట్లు ఎక్కువగా ఉంటుంది.ఇది అపసవ్యదిశ (తూర్పు నుంచి పడమరకు)లో తిరుగుతుంది. దీనికి కూడా ఉపగ్రహాలు లేవు. దీని భ్రమణ కాలం 243 రోజులు (1 రోజు).పరిభ్రమణ కాలం 225 రోజులు (1 ఏడాది).

 

     శుక్రుని దగ్గర కు సోవియట్ యూనియన్, అమెరికాలు రోదసీ నౌకలు పంపాయి. అమెరికా 'మారినర్, 'పయొనీర్', 'వీనస్' 'మగెల్లాన్' అనే నౌకలు పంపింది. సోవియట్ యూనియన్ 'వెనీరా' అనే నౌకలు వరుసగా అనేకం పంపింది. 1983లో వెనీరా-14 శుక్రగ్రహం మీద దిగి అక్కడ మట్టితీసి పరిశోధనలు జరిపి అనేక వివరాలు భూమి మీదకు పంపింది.

     సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వేడి ఒక్కోసారి 460 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు వెళుతుంది. ఈ గ్రహం మీద కాలు పెట్టగానే మీ కాలు ఎండకు కరిగిపోయేంత వేడి వాతావరణంలో ఉంటుందన్నమాట.ఈ గ్రహంలో వర్షం పడుతుంది. కానీ, అదంతా సల్ఫర్ ఆసిడ్‌తో ఉంటుంది. ఇలాంటి వర్షంలో తడిస్తే మన చర్మం పూర్తిగా కాలిపోతుంది.అయితే, విపరీత ఉష్ణోగ్రతల కారణంగా వర్షం కిందికిపడేలోపే ఆవిరైపోతుంది. ఇంత తీవ్రస్థాయిలో ఊష్ణోగ్రత ఉన్నప్పటికీ ఇక్కడ మంచు కూడా ఉంది.

భూమి

      సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటిలోకి జీవరాశిని కలిగి ఉన్న గ్రహం.సూర్యుడి నుంచి దూరంలో మూడోది. పరిమాణంలో ఐదోది. దీని పరిభ్రమణ కాలం 365 రోజులు.అంతరిక్షం నుంచి చూసినప్పుడు భూమి నీలి ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం నేల, చెట్లు, నీటి వల్ల కాంతి వక్రీభవనం.

మం. అయం గౌః పృశ్ని రక్రమీత్ అసదన్ మాతరంపురః, పితరంచ ప్రయన్‌త్స్వః
ఋ.మం.10.సూ.189. మం. 1/శు.య.వే.3.6./అథర్వ. 1.31.1./సా.వే.630/1376
  (సూర్యాకర్షణ చేత జలసహితమైన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. తల్లి అయిన భూమి చుట్టూ తిరిగే చంద్రుడు తండ్రి అయిన సూర్యుని చుట్టూ సూర్యప్రభావం చేతనే తిరుగుతున్నాడు).
     
 భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడే.
 భూమి సూర్యుని చుట్టూ ‘జియాయిడ్’ (దీర్ఘగోళం) ఆకారంలో తిరుగుతోంది. గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడాన్ని 'భ్రమణకాలం' అంటారు. భూమి భ్రమణ కాలం 24గంటలు. భూమి భ్రమణం వల్లనే మనకు రాత్రి పగలు ఏర్పడుతున్నాయి.    
భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. భూమి గుండ్రంగా ఉందన్న విషయం చంద్రగ్రహణ సమయంలో చంద్రుడి మీద పడిన భూగోళపు నీడని బట్టి రుజువు చేయబడింది. 
    సూర్యుడు భూమికి 14.9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఈ దూరాన్ని ‘ఆస్ట్రనామికల్ యూనిట్’ అంటారు. సూర్యుని కిరణాలు భూమిని   8.3నిమిషాల్లో చేరతాయి. సూర్యుని ఉపరితల వైశాల్యం భూమి ఉపరితల వైశాల్యం కన్నా 12,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

        భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి కారణం సూర్యునియొక్క గురుత్వాకర్షణ శక్తి . ఇంకా వివరంగా చెప్పాలి అంటే భూమి సూర్యుని చుట్టూ కాదు సూర్యునికి , భూమికి మధ్యన వున్న భారీ సెంటర్ చుట్టూ తిరుగుతుంది.ఏవైనా రెండు వస్తువులకు భారీ సెంటర్ ఆ వస్తువు యొక్క సెంటర్ అఫ్ మాస్ (ద్రవ్యరాశి కేంద్రం ) బట్టి ఉంటుంది. ఒకవేళ వస్తువులో వేరు వేరు లోహాలు ఉంటే ఆ లోహాల యొక్క ద్రవ్యరాశిని బట్టి ద్రవ్యరాశి కేంద్రం మారుతుంది . ఉదాహరణకి ఒక సుత్తి యొక్క ద్రవ్యరాశి కేంద్రం ఆ సుత్తి తలభాగానికి దగ్గరగా ఉంటుంది కారణం చెక్క కంటే మెటల్ ఎక్కువ ద్రవ్యరాశిని మరియు బరువుని కలిగి ఉంటుంది. అందుకే సుత్తి తలభాగం దగ్గర పట్టుకుంటే ఈజీ గా సుత్తిని కంట్రోల్ చేయొచ్చు.

     అంతరిక్ష వస్తువైనా మరొకదాని చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని ఉపగ్రహం అంటారు.మన భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. 

మానవ నిర్మిత ఉపగ్రహాలను 'కృత్రిమ ఉపగ్రహాలు' అంటారు.మనదేశం ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపింది.భూమ్యాకర్షణ శక్తిలో చంద్రుడి ఆకర్షణ శక్తి 1/6వ వంతు ఉంటుంది.

గురు గ్రహం/బృహస్పతి

 సౌర కుటుంబంలోకెల్లా అతిపెద్ద గ్రహం గురు గ్రహమే. సౌర కుటుంబంలో భూమికి ఉన్నట్లే ప్రతి గ్రహానికి చందమామ ఉంటుంది. దీనికి 50 ఉపగ్రహాలు ఉన్నాయి.వీటిలో గురు గ్రహానికి ఉన్న 
అతిపెద్ద చందమామ గానిమీడ్‌. అన్ని గ్రహాలకున్న చందమామల్లోకెల్లా పెద్దది.రెండు వస్తువుల మధ్య భారీ సెంటర్ ఆ రెండు వస్తువుల యొక్క సెంటర్ అఫ్ మాస్ ని బట్టి ఉంటుంది. అంటే ఎలాగైతే సుత్తిలో మెటల్ వున్న ఏరియా ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉందొ అలానే రెండు వస్తువుల్లో ఏ వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎక్కువ ఉంటే భారీ సెంటర్ ఆ వస్తువుకి దగ్గరగా వుంటుంది.అలానే సౌర కుటుంబంలోనే అతి పెద్ద గ్రహం అయిన జుపిటర్ (గురు గ్రహం) కి , సూర్యునికి మధ్య భారీ సెంటర్ సూర్యుని బయట ఉంటుంది కాబట్టి జుపిటర్ మరియు సూర్యుడు రెండు ఆ భారీ సెంటర్ చుట్టూ తిరుగుతాయి.ఈ గ్రహం భూమి కంటే 1300 రెట్లు పెద్దది. దీని ద్రవ్యరాశి భూ ద్రవ్యరాశికి 318 రెట్లు ఎక్కువ.ఇది తనచుట్టూ తాను అతివేగంగా తిరుగుతుంది.దీని పరిభ్రమణానికి పట్టే కాలం 12 సంవత్సరాలు.

కుజుడు/ అంగారకుడు

   అంగారక గ్రహాన్నే కుజగ్రహం అంటారు. అంటే భూమికి పుట్టిన వాడని. భూదేవికి విష్ణుమూర్తికి పుట్టిన కొడుకే అంగారకుడు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది.  విష్ణువుకు పుట్టిన  ఒక పురుషుడు  తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఒక గ్రహంగా మారాడు. ఆ గ్రహమే 'కుజుడు' అని పద్మ పురాణం చెబుతుంది.

రోమన్ల యుద్ధ దేవత పేరు 'మార్స్'. దాని నుండి ఇంగ్లీషులో దీనికి “మార్స్" అనే పేరు వచ్చింది. శుక్రుడు, అంగారకుడు భూమికి ఇరుగుపొరుగు గ్రహాలు.భూమికి అత్యంత సమీపంలో ఉంది.

       గ్రహాలన్నింటిలోకి మానవుడు దిగడానికి అను వుగా వున్నది అంగారక గ్రహమే.  అంగారక గ్రహం భూమికి సమీపంలోకి వచ్చినప్పుడు సుమారు 12 కోట్ల 86 లక్షల మైళ్ళ దూరంలో ఉంటుంది.

        భూకక్ష్యకు బయటి వైపు ఉన్న మొదటి గ్రహం ఇదే.  కొద్దిగా ఎరుపు రంగులో ఉండటం వల్ల దీనిని అరుణతార అని పిలుస్తారు. దీనికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి.దీని పరిభ్రమణానికి పట్టే కాలం 687 రోజులు.


శని

ఇది పసుపు వర్ణంలో కనిపిస్తుంది.దీని చుట్టూ వలయాలు ఉంటాయి.దీనికి 53 ఉపగ్రహాలున్నాయి. దీని పరిభ్రమణానికి పట్టే కాలం 29.5 సంవత్సరాలు.దీని ఉపగ్రహం టైటాన్ భూమిని పోలి ఉంటుంది.

యురేనస్, నెఫ్ట్యూన్

ఈ గ్రహాన్ని టెలిస్కోప్ సాయంతో మాత్రమే చూడగలం.ఇది శుక్రగ్రహం మాదిరి తూర్పు నుంచి పడమరకు పరిభ్రమిస్తుంది.దీని అక్షం అత్యధికంగా వంగి ఉంటుంది. దీనికి 27 ఉపగ్రహాలున్నాయి. దీని పరిభ్రమణానికి పట్టే కాలం 84 ఏళ్లు.

సౌర కుటుంబంలో చివర్లో వాయువులతో నిండిన యురేనస్, నెఫ్ట్యూన్ గ్రహాలు ఉంటాయి. భూ గ్రహానికి సుదూరంలో ఉన్న ఈ గ్రహాలు మిథేన్‌తో నిండిన మేఘాలతో నిండి ఉంటాయి.

సౌర కుటుంబంలోని గ్రహాలలో ఇక్కడే అంత్యంత తీవ్రమైన గాలులు వీస్తాయి.

గ్రహ ఆకృతి కారణంగా ఇది చాలా చదునుగా ఉంటుంది. దీనిపైనున్న మీథేన్ వాయువులు గంటకు 2,400 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి.

ఇక్కడి వాతావరణంలో కార్బన్ సంపీడనం చెందడం వల్ల వజ్రాల వర్షం కురుస్తుంది.

ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మైనస్ 200 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటుంది.

ఫ్లూటో

అతి చిన్న గ్రహం ఫ్లూటో. 2006లో ప్రేగ్‌లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఫ్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి డ్వార్ఫే (మరుగుజ్జు) గ్రహంగా ప్రకటించారు.అంతర్జాతీయ ఖగోళవేత్తల సంఘం ప్రకారం పూర్తి స్థాయి గ్రహాలకు మూడు ముఖ్య లక్షణాలు ఉండాలి.
  1. అది సూర్యుడి చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతూ ఉండాలి.
  2. దాదాపు గుండ్రంగా ఉండేందుకు వీలయ్యేంత ద్రవ్యరాశి దానికి ఉండాలి.
  3. అది దాని చుట్టుపక్కల ఉండే అంతరిక్ష వస్తువుల గురుత్వాకర్షణ శక్తిని వదిలించుకోగలిగినదై ఉండాలి.

ప్లూటోకు ఈ చివరి లక్షణం లేనందువల్ల, అంటే అది పొరుగునే ఉన్న వస్తువుల ఆకర్షణ శక్తిని వదిలించుకోలేకపోవడం వల్ల దాన్ని గ్రహం కాదని నిర్ణయించారు. కానీ దానికి పై రెండు లక్షణాలు ఉన్నాయి కాబట్టి మరుగుజ్జు గ్రహంగా గుర్తించారు. అసలు సౌరకుటుంబంలో ప్లూటో అనే తొమ్మిదవ గ్రహం ఉందని 1930 లో అమెరికాకు చెందిన ఖగోళవేత్తలు గుర్తించారు. దానికి పేరు సూచించమని కోరినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా సూచనలు వచ్చాయి. అందులో ఇంగ్లాండ్ లోని ఆక్స్ఫర్డ్ ప్రాంతానికి చెందిన పదకొండేళ్ల స్కూల్ విద్యార్థిని వెనీషియా బర్నీ ప్లూటో అనే పేరుని సూచించింది. దాన్ని ఎంపిక చేసి అప్పటి నించీ ఆ పేరుతో పిలవడం మొదలు పెట్టారు.






 











































Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం