Posts

Showing posts from May, 2021

కాలవిభజన

Image
భూమి ఆవిర్భవించి సుమారుగా 450 కోట్ల  సంవత్సరాలు గడిచింది .  భూ ఆవిర్భావం నుంచి జీవ పరిణామం వరకు గల కాలాన్ని "జీవ పరిణామ కాల విభజన" (GEOLOGICAL CALANDER) అంటారు . ఈ కాలెండర్ కాలాన్ని  "దశ" (ERA) లుగా దశలను "ఘట్టాలు" (PERIODS) గా ఘట్టాలను "మహాయుగాలు" (EPOCHS) గా మహాయుగాలను తిరిగి "యుగాలు" (AGES) లుగా విభజించారు . దశలలో మొదటిది 1) నిర్జీవ దశ ( Ezoic Era ) ------------------------------------ భూఆవిర్భావం నుంచి 260 కోట్ల సంవత్సరాలకు వర గల కాలాన్ని నిర్జీవ దశ అంటారు . ఈ దశలో జీవం గానీ జీవ పదార్దాం కానీ ఆవిర్భవించలేదు. 2) ప్రథమ జీవ దశ (Archiozoic Era) -------------------------------------------------- ఈ దశ 260-200 కోట్ల సంవత్సరాల వరకు కొనసాగింది. ఈ దశలోనే జీవ పదార్దం ఆవిర్భవించి ఉంటుదని శిలాజాదారాల ద్వారా చెప్పగలిగారు . 3) పూర్వ జీవ దశ (Protirozoic Era) ------------------------------------------------- సుమారు 200-50 కోట్ల సంవత్సరాల మద్య సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. ఏక కణ జీవులు ప్రారంభ దశలో వెన్నుముక లేని సముద్రజీవులు అంతిమ దశలో ఏర్పడ్డాయి. 4)...

ఆక్సిజన్‌ ఉత్పత్తి వ్యవస్థలు (oxygen generators)

Image
       pc enaadu.net 1. వాక్యూమ్‌ ఇన్సులేటెడ్‌ ఎవాపరేటర్‌ (వీఐఈ): ఇది ప్రత్యేకమైన ఆక్సిజన్‌ వ్యవస్థ. ఇందులో వాక్యూమ్‌ ఇన్సులేటెడ్‌ ట్యాంకులో పెద్ద మొత్తంలో ద్రవ ఆక్సిజన్‌ను నిల్వ చేస్తారు. ఆక్సిజన్‌ ఉష్ణోగ్రత -118 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటుంది. ఇది వేపరైజర్‌ ద్వారా ఆవిరై గ్యాస్‌గా మారి.. గొట్టాల ద్వారా వార్డులకు సరఫరా అవుతుంది. కంట్రోల్‌ ప్యానెల్‌ ఆక్సిజన్‌ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది.          PC enaadu.net 2. ఆక్సిజన్‌ సిలిండర్లు: అత్యధిక పీడనంతో కూడిన సిలిండర్‌లోని ఆక్సిజన్‌ను తేమతో కూడిన సీసాలోకి పంపించి, అక్కడ్నుంచి గొట్టం ద్వారా ముక్కుకు ఆక్సిజన్‌ అందేలా చూడటం దీని ప్రత్యేకత. ఆక్సిజన్‌ మాస్కు, గొట్టం, ఆక్సిజన్‌ టెంట్‌, హైపర్‌బారిక్‌.. ఇలాంటి పరికరాలు, పద్ధతుల్లో ఆక్సిజన్‌ను అందిస్తారు.          pc enaadu.net 3. ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు: ఆక్సిజన్‌ నిల్వ చేయటం కుదరని చోట, సిలిండర్లు లేని చోట్ల ఇవి ఉపయోగపడతాయి. విద్యుత్తు లేదా బ్యాటరీ సాయంతో పనిచేసే ఇవి చుట్టుపక్కల గాలిని ...

ఆక్సిజన్‌

Image
         pc: topper.com మన వాతావరణంలోని గాలి ప్రత్యేకతే వేరు. ఇందులో 21% ఆక్సిజన్‌ ఉంటుంది. మనకు తెలిసినంతవరకు విశ్వంలో మరెక్కడి వాతావరణంలోనూ ఇంత ఎక్కువ స్థాయిలో ప్రాణవాయువు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆక్సిజన్‌ను భూమి సంతకమనీ అనుకోవచ్చు. ఇంతకీ మన భూమ్మీద ఆక్సిజన్‌ ఎలా పుట్టుకొచ్చింది? ఇంత ఎక్కువస్థాయిలో ఎలా ఉంటోంది? ఇంతటి కీలకమైన ఆక్సిజన్‌ స్థాయులు ఎలా స్థిరంగా ఉంటున్నాయి? అన్నీ ఆలోచించదగ్గ, ఆశ్చర్యకరమైన ప్రశ్నలే. భూమి, ఖండాలు, మహాఆక్సిజన్‌ కథ!సముద్రాలు ఏర్పడిన తర్వాత మన వాతావరణం క్రమంగా ఆక్సిజన్‌ లేమి స్థితి నుంచి ఆక్సిజన్‌ సహిత స్థితికి చేరుకుంది. వాతావరణంలో ఇంత పెద్దమొత్తంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి కావటానికి మూలం కిరణజన్య సంయోగ క్రియ. మూడొంతుల ఆక్సిజన్‌ ఇలా పుట్టుకొచ్చిందే. చెట్లు, మొక్కల ఆకులే కాదు.. సైయానోబ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములూ ఇందులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. ఆశ్చర్యంగా అనిపించినా ఆక్సిజన్‌ అనేది కిరణజన్య సంయోగక్రియలో భాగంగా పుట్టుకొచ్చే ఓ వ్యర్థ పదార్థం! సూర్యరశ్మి ప్రసరించినప్పుడు వీటిల్లోని పత్ర హరితం సూర్యరశ్మిని పట్టేసుకొని ద...

చప్పట్లు కొట్టి వైరస్ ను చంపెయ్యమని పిలుపు నిచ్చే నేతలు ఉన్న దేశంలో క్షుద్ర హత్యలు కాకవైజ్ఞానిక ఆవిష్కరణలు జరుగుతాయా? నరబలులు కాక నోబెల్ ప్రైజ్ లు దక్కుతాయా?

కరోనా వైరస్ ను చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించి,పళ్ళాలు మోగించి చంపెయ్యమని ప్రజలకు పిలుపునిచ్చిన నేతలు ఉన్న దేశంలో, అంతరిక్షంలోకి పంపే రాకెట్ నమూనాను తిరుపతి వెంకన్న పాదాల ముందు పెట్టి పూజ చేసి కానీ ప్రయోగించలేని ఇస్రో సైంటిస్టున్న దేశంలో,రోడ్డు మీద పసుపు అంటిన నిమ్మకాయనో, మిరపకాయనో చూసి జడుసుకొని చెమటలు పట్టే ప్రొఫెసర్స్ ఉన్న దేశంలో,భూమ్మీద పుట్టిన పిల్లలకి ఆకాశంలో నక్షత్రాలు చూసి పేర్లు పెట్టే డాక్టర్లున్న దేశంలో, పేరులో స్పెల్లింగ్ మారిస్తే సినిమా హిట్ అయిపోద్ది అని నమ్మే యాక్టర్లున్న దేశంలో... 'క్షుద్ర హత్యలు' కాక వైజ్ఞానిక ఆవిష్కరణలు జరుగుతాయా? 'నరబలులు' కాక నోబెల్ ప్రైజులు దక్కుతాయా? “ప్రస్తుత సమాజంలో దిగ్ర్భాంతి కల్గించే వైరుధ్యాలు కనిపిస్తాయి. అత్యాధునిక జీవన శైలితో బ్రతుకుతున్న ఈ తరం మానసికంగా ఆటవిక దశలో ఉందనే సత్యాన్ని మనం గుర్తించాలి” అని కొడవటిగంటి రోహిణి ప్రసాద్ అనే శాస్త్రవేత్త అన్నట్లు శాస్త్ర,           సాంకేతిక రంగాల్లో            పురోగమిస్తూనే రాతియుగ భావాలతో మన ప్రగతి పయనిస్తుందన్న కఠోర సత్యాన్ని ఒప్పుకొని త...

ఆధునిక భౌతిక శాస్త్ర దిక్సూచి ఐన్‌స్టీన్

Image
         pc sharechat "ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు”గా పిలుస్తున్న అల్బర్ట్ ఐన్‌స్టీన్ 1879 మార్చి 14న జర్మనీ లో జన్మించారు. ఆయన ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి యూరప్ దేశాలలో విద్యా భ్యాసాన్ని కొనసాగించారు.1914లో తిరిగి జర్మనీ వచ్చి 1933 వరకు వున్నారు. యూదులపై అడాల్ఫ్ హిట్లర్ అనుసరించిన క్రూరమైన విధానాలవల్ల ఐన్‌స్టీన్ అమెరికా వలస వెళ్ళారు. ఐన్‌స్టీన్ భౌతిక శాస్త్రంలో కాంతిపై పలు ప్రయోగాలు చేశారు. ఆయన ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం భౌతికశాస్త్ర స్వరూపాన్నే మార్చి వేసింది. ఆయన ఆవిష్కరించిన ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్టు కూడా భౌతిక శాస్త్రానికి కొత్తదారి చూపించింది. ఐన్‌స్టీన్ బాల్యంలో దైవాన్ని ఎక్కువగా నమ్మేవారు. ఆయనకు సంగీతంలో కూడా పరిచయం వుంది. మార్క్స్ టాల్‌మాడ్ అనే వ్యక్తి ప్రభావంతో ఐన్‌స్టీన్ శాస్త్రీయ ఆలోచనలు పెంచుకోవడం ప్రారంభించారు. భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాధ్ బోస్‌తో కలిసి ఐన్‌స్టీన్ పలు పరిశోధనలు చేశారు. 1920లో బోస్ పదార్ధం 5వ స్థితిపై కొన్ని పరిశోధనలు చేశారు. పదార్ధం సాధారణంగా ఘన, ద్రవ, వాయు రూపాలలో వుంటుంది, నాలుగో రూప...

కోతి నుంచి మనిషి రూపాంతరం చెందాడంటారు. మనిషి కూడా అలా మరో రకమైన జీవిగా మారతాడా?

Image
       pc: nunoacoasta  గొంగళి పురుగు ప్యూపా దశలోకి వెళ్లి అందులోంచి సీతాకోక చిలుకగా మారినట్టు కోతి నుంచి మనిషి ఏర్పడలేదు. అది ఒక జీవి జీవిత చక్రంలో వివిధ దశలు కాగా, ఇది పరిణామ క్రమంలో ఒక భాగం. కోతి లాంటి జీవుల్లో కొన్ని లక్షల సంవత్సరాల విస్తారంలో మార్పులు జరిగి క్రమేపీ మనిషిలాంటి జీవులు పరిణామం (evolution) చెందాయని అంటాము. ప్రకృతిలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునేలా దేహంలో క్రమేపీ మార్పులు చెందేలా సంతానం తర్వాత సంతానం, తరం (generation) తర్వాత మరో తరంలో ఎంతో కొంత మార్పు జరుగుతుంది. ఏ మార్పులైతే ప్రకృతితో తలపడడానికి, మనుగడ సాగించడానికి అనువుగా ఉంటాయో అలా రూపాంతరం చెందిన జీవులే నిలుస్తాయి. అవి లేనివి అంతరిస్తాయి. దీనినే శాస్త్రవేత్త డార్విన్‌ 'ప్రకృతి వరణం ద్వారా జీవ పరిణామం, జంతువుల ఆవిర్భావం' (Origin of species by evolution and natural selection) అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనిషిలో కూడా మార్పులు జరిగి మరో ఆధునిక రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉంది. -ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక