పరిణామ వాద సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్
పరిణామ వాద సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్ బ్రిటీష్ జీవపరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ రాబర్ట్ డార్విన్ (ఫిబ్రవరి 12, 1809 – ఏప్రిల్ 19, 1882) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది. ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందింది అనే విషయముపై పరిశోధనలు చేసి, జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతని పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది జీవ పరిణామ సిద్ధాంతం. ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానికి - అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెంది ఏర్పడతాయని, ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్టమొదటి సారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్ మాత్రమే. నరవానర పూర్వజీవి నుంచి నరవానరుడు, నరవానరుడి నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. #విద్యాభ్యాసం ---------------------------- డార్విన్ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో జన్మించాడు. వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా చదువులో రాణి...