Kepler
P.c: Britannia.com కెప్లర్ అతనో అవిటివాడో, కుంటివాడో, గ్రుడ్డివాడో కావచ్చు. కానీ అతని యొక్క నిరంతరకృషి, పట్టుదల వల్ల ఒక్కో మెట్టూ అధిరోహిస్తూ - అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. అది పూర్తిగా ఆ వ్యక్తి యొక్క కృషికి నిదర్శనం.మనిషి తలుచుకుంటే సాధించలేని కార్యమంటూ లేదు. కష్టాలు అందరికీ వస్తాయి. ఆ కష్టాలను అధిగమించడం మాత్రం కొద్దిమందే చేస్తారు. ఆ కోవకు చెందిన వాడు కెప్లర్. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజేసి అఖండమైన ఖ్యాతిని గడించిన “కెప్లర్" మూడు ముఖ్యమైన సూత్రాలు ఖగోళ గణితంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కెప్లర్ జర్మనీలోని వైల్' నగరంలో 1571లో డిసెంబరు 27వ తేదీన జన్మించాడు. ఈయన తండ్రి పేరు "హైన్శ్ కెప్లర్”. ఇతనో రాజ సైనికుడు. తాగుబోతు. బాధ్యతలను మరచి ప్రవర్తించేవాడు. విధి నిర్వహణ సైతం సక్రమంగా చేయని కారణంగా సైనికుడి పదవి నుండి తొలగించివేశారు. తరువాత ఈయన తనకున్న యావదాస్తినీ అమ్మివేసి ప్రత...