Posts

Showing posts from February, 2022

National Science Day

National Science Day   సైన్స్.. మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేము.  ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది.. నడిపిస్తున్నది..  సైన్స్ మాత్రమేనన్న విషయం అందరికీ తెలిసిందే.  భౌతికశాస్త్రంలో సర్ సీవీ రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా.. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే (February 28 National Science Day) నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.  సైన్స్ డే నిర్వహించుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే.. భారత శాస్త్రవేత్త సీవీ రామన్‌ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ కనుగొన్నారు.  ఆ రోజును పురస్కరించుకొని దేశంలో జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం ఎంటంటే.. ముఖ్యంగా రోజువారీ జీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను, దాని ఉపయోగాలను ప్రజలలో వ్యాప్తి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాంకేతిక విద్య, నైపుణ్యాల వృద్ధి, భవిష్యత్‌లో సైన్స్ పరంగా సాధించాల్సిన ప్రగతి పరంగా విద్యార్థులు, యువతను ప్రోత్సహించడం కోసం నిర్వహిస్తారు.  సర్ సీవీ రామన్ చేసిన సేవలను కూడా  గుర్తు చేసుకుంటూ ...

పుష్పాయం భార్గవ

ఒక వైజ్ఞానికుడూ, ఒక హేతువాది : పుష్పాయం భార్గవ..!!! ———————————————————————————— మన భారతదేశంలో ఆత్మలని, పరమాత్మలని, దేవుళ్ళని, దయ్యాల్ని, స్వాముల్ని, బాబాల్ని, మంత్రాల్ని, పూజల్ని, ముహూర్తాల్ని, తాయత్తుల్ని నమ్మే సైంటిస్టులకి కొదువలేదు. నిజమే! కాని, వైజ్ఞానిక స్ఫూర్తి సామాన్యులకు అందాలని జీవితాలు ధారపోసిన వైజ్ఞానికులు, సైన్సు ప్రచారకులు, రచయితలు లేకపోలేదు. అలాంటి వారిలో ముందు వరసలో చెప్పుకోవాల్సినవారు పుష్పాయం భార్గవ! ఈయన జీవితం నుంచి నేటి యువతరం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కొంతమంది మనుషులు తమ వాక్చాతుర్యంతో అబద్ధాలు ప్రచారం చేస్తారు. కానీ, సైన్సు అనేక రుజువులతో సత్యాన్ని భౌతికంగా మనముందు నిలబెడుతుంది. ఆ సైన్సు వెలుగులో ప్రజలకు సత్యాన్ని చూపించడానికి ఆహర్నిశలు తపించిన హేతువాది పుష్ప మిత్ర భార్గవ!  పాఠశాల స్థాయి నుంచి, విశ్వవిద్యాలయ స్థాయి దాకా అలాగే బయట సమాజంలోనూ మేథావుల గొంతులు నొక్కేయడానికి నేటి ప్రభుత్వ పాలకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఎండగడుతూ వచ్చిన ఉన్నతశ్రేణి వైజ్ఞానికుడు ఆయన! ఒకవైపు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావల్సిన మార్పులకు - విధి విధానాల రూపకల్పన చేస్తూనే, క్షేత్రస...

హేతువాదం ఎప్పుడు ప్రారంభమైంది?

మానవవాదాలు ఎప్పటివి? 2 లక్షల సంవత్సరాల క్రితం ఆధునిక ఆలోచించగల మానవుడు హేతుబద్ధ చింతన చేయగల ఉత్తమ పరిణతి పొందిన మెదడుతో ఆవిర్భవించాడు. చేపల ఆవిర్భావం నుంచి చూసినా  మెదడు పరిణామ వయసు దాదాపు 40 కోట్ల సంవత్సరాలకు పైనే. 40 కోట్ల సంవత్సరాల కాల గమనంలో జీవుల పరిణామంలో చేపల మెదడు మానవ మెదడుగా పరిణమించింది. చేపల మెదడు నిర్మాణం , పని విధానం కంటే మానవ మెదడు నిర్మాణం , పని విధానం ఉత్తమ మైనది. ఎర వేసి చేపను పట్ట గల హేతుబద్ధ చింతన మానవుడిది. జీవులన్నింటిలో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో పరిసరాలను గమనించడం, వాటికి ప్రతిస్పందించడం వివిధ స్థాయిల్లో సాధారణ  విషయమే. నాడీ కణాల ఆవిర్భావం, అవి మెదడుగా రూపధారణ, మెదడు భాగాల టీం వర్క్ క్రమంగా పరిణతి పొంది ఆయా జీవుల మనుగడను పెంచాయి. 2 లక్షల సంవత్సరాల క్రితం మానవుడికి హేతుబద్ధంగా ఆలోచించగల, ప్రశ్నించగల, పరికల్పించగల, విశ్లేషించగల,సత్య నిర్ధారణ చేయగల మెదడు లభించింది. అయితే ,ఆనాటి మానవుడి జ్ఞానం చాల అల్పం. తరతరాలుగా మానవులు పొందిన జ్ఞానం సంచితంగా పోగుబడి తర్వాత తరాలకు అందడంతో క్రమంగా జ్ఞానమే శక్తిగా మారి మానవుడు శక్తివంతుడై జీవ ప్రపంచాన్ని జయించాడు. క్రమక...

శాస్త్రీయ దృక్పథం కలిగిన సంస్కృతి రావాలి

*శాస్త్రీయ దృక్పథం కలిగిన సంస్కృతి రావాలి* మనం సహేతుకత, శాస్త్రీయ దృక్పథం, శోధన, ప్రశ్నించేతత్వంపై ఆధారపడిన సంస్కృతిని కోరుకుంటాం. ఈ సుగుణాలు మన ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్నాయి. ప్రభుత్వ విద్య ఎన్ని లోపాలతోనైనా నిండి ఉండనీ గాక, అభివృద్ధినిరోధకులూ, వారి మిత్రులూ సృష్టిస్తున్న అడ్డంకులబండరాళ వల్ల అందరికీ విద్య అందడంలేదన్న వాస్తవం ఉండనీ గాక... అయినప్పటికీ మన ప్రభుత్వ విద్యా వ్యవస్థ పైన చెప్పిన సుగుణాలతో నిండి ఉంది. బ్రిటిష్ వారి కాలం నుండీ అనేక మంది మేధావులూ, విద్యావేత్తలు భౌతిక, సామాజిక శాస్త్రాల్లో అభివృద్ధికర భావాలతో కూడిన సంప్రదాయాలను నిర్మించడానికి దోహదం చేశారు. ఇది కేవలం విశ్వ విద్యాలయ క్యాంపస్లకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రజా సైన్సు ఉద్యమాల్లో కూడా ప్రతిఫలించింది. ఒకవైపు పెట్టుబడిదారీ సిద్ధాంతం విజృంభించి అన్ని చోట్లా నిర్నిబంధమైన లాభాపేక్షను పెంచిపోషిస్తూ, ప్రభుత్వ విద్యా విధానాన్ని నాశనం చేస్తుండగా మరోవైపు అంతటా వ్యాపిస్తున్న అహేతుక, అశాస్త్రీయ భావజాలం, మూఢనమ్మకాలు ప్రజా సైన్సు ఉద్యమాలకు హాని చేస్తున్నాయి. కానీ మనం ఈ ఉద్యమాలను బ్రతికించి పెంపొందించాలి. ఎందుకంటే అవి మన పోరాటంలో ...