మానవవాదానికి పెద్ద అడ్డంకి


అంతర్జాతీయ మానవవాదానికి పెద్ద అడ్డంకి ఏవంటే జాతీయ రాజ్యాలు, జాతీయవాదం ముదిరి పాకానపడితే అది క్రమంగా ఫాసిజంగా మారుతుందని మేధావులు కొంతమంది ఆమోదిస్తున్న విషయమే. మనుషులు సమిష్టిగా ఏ కారణాన కూడినా ఆ సమిష్టిలో భాగమైతే క్రమంగా హేతుబద్ధచింతన. తగ్గి వ్యక్తులుగా వారు ఆలోచించడమని గుంపు మనస్తత్వానికి బానిసలవతారు. మనవాడు చేస్తే రైటు, పరాయివాడు చేస్తే రాంగు అనే సూత్రానికి చేరితే అది ఫాసిజంగా మారినట్లే. మనుషులను ఎంత మంచి కారణంతోనైనా సంకుచిత సమిష్టులుగా విభజన చేయడమంటే మానవత్వానికి ఎదురు నిలవడమే అని. గుర్తించాలి. అందువల్ల అంతర్జాతీయత అంతర్మానవతగా మారాల్సిన చారిత్రాత్మక అవసరమొచ్చింది.

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata