ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎందుకని గిడశబారిపోయింది!
ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎందుకని గిడశబారిపోయింది! ఆర్యభట,భాస్కర,బ్రహ్మగుప్తుడు వీరంతా భారతీయ శాస్త్రవిజ్ఞానాన్ని ఆకాశపు టంచుల వరకు తీసుకెళ్లారు. ■ క్రీస్తుపూర్వం ఈప్రపంచంలో నాలుగు దేశాల నాగరికతలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. భారతీయ నాగరికత మెసపటోమియా సుమేరియా అంటే పర్షియా చైనా ఇపుడు ఉన్నత స్థాయి ఆర్థికాభివృద్దలో ఉన్న ఇంగ్లాండ్, అమెరికా,జపాన్,జర్మనీ ఇవేవీ సోదిలో లేవు. మిగతా మూడింటి గురించి ఇక్కడ చర్చ అవసరం లేదు.భారతదేశం ఎంతో ఉన్నతమైన శాస్త్ర పరిజ్ఞానాన్ని మిగతా ప్రపంచానికి అందించింది.అలాంటి భారతదేశం ఎందుకని వెనుక బడిపోయింది. వాస్తవాలు చెపితే RSS,హిందు మతోన్మాదులూ,బూతు పురాణం లంకించుకుంటున్నారు.అయినా తప్పదు,వాస్తవాలు మీముందుంచాలి. ■సుశ్రుత ఈ ప్రపంచానికే తొలి ఫిజిషియన్ చరకుడు...ఈ ప్రపంచానికే తొలి వైద్యుడు భాస్కరుడు..బీజేపూర్,కర్ణాటకవాసి 12వ శతాబ్దం,గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు, అర్ధమేటిక్,ఆల్జీబ్రా గురించి అలవోకగా వివరించారు. ఆర్యభట.476 క్రీ శ పాటలిపుత్రం..జీరో ను zero ను ఆవిష్కరించడం ద్వారా ఈ ప్రపంచానికి,గణిత శాస్త్రంలో విప్లవాన్ని చూపించారు. కణాదుడు..అణు సిద్ధాంత వేత్త,...