సృజనాత్మకత

మొదట్లో ఇతర జంతువుల మాదిరిగా నిప్పంటే భయపడేవాడు. అది వేడిని ఇస్తుందని క్రూర మృగాలు నుండి కాపాడుతుందనే తెలుసుకున్నాక మండే అడవులనుండి అగ్నిపర్వతాల నుండి దివిటీ వెలిగించుకుని అవి ఆరిపోకుండా వంతులవారీ కాపలా కాసేవారు. మనిషి జీవితంలో నిప్పు చాలా ప్రధానమైంది. మనిషికి మాత్రమే పట్టుబడిన శక్తి అది. నాలుగు లక్షల సంవత్సరాల క్రితం మనిషిని కనుక్కున్నాడు.భారతం రచనా కాలంలో దానిని అరణి అనేవారు. నిప్పును ఉపయోగించి ఆహారం ఉడికించడం, కాల్చడం చేసేవారు . నిప్పు ఉపయోగం వలన జంతువులను లొంగదీసుకోవడం సులభమైంది. అగ్ని నాశనకారిగాకాక  పదార్థాలను మార్చివేయగల ఒక మాంత్రిక శక్తి గా భావించారు. అగ్ని నాశనం చేయదు అది పునర్జన్మ నిస్తుందని భావించేవారు .రాళ్లను పగలకొట్టడానికి , వంటకూ నిప్పును వాడినారు. లోహాల శుద్దికి వాడినారు.
 దాంతో రాతి పనిముట్లు బదులు లోహపు పనిముట్లు కూడా వచ్చాయి.  అగ్నిని దేవునిగా భావించారు. నిప్పు ద్వారానే ద్వారానే మనిషి హిమయుగంలో మనుగడ సాగించగలిగాడు. ఈ విధంగా నిప్పు మానవ నాగరికతలో ప్రధాన పాత్ర వహించింది.





మనిషి తన జీవిత మజిలీలో మొట్టమొదట మాంసం కోసం మాత్రమే పశువులను పెంచాడు. అయితే త్వరలోనే అతడు పశువులతో మరిన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకొన్నాడు. తన వీపు పైనున్న బరువును జంతువుల వీపుపై మోపాడు. వాటిల్తో వాహనాలను కూడా లాగించటం నేర్చుకొన్నాడు. మొదట్లో ఈ  వాహనాలకు చక్రాలుండేవి కావు. స్లెడ్జి బండికిలాగా చక్రాలకు బదులుగా బండి క్రింద కొయ్యబద్దలు ఉండేవి. వీటి స్థానంలో చక్రాలు ఎప్పుడు వచ్చాయో కచ్చితంగా చెప్పలేం. 

   

        ( Sledge in ancient Egypt, pc : Wikipedia)

    వ్యవసాయం ప్రారంభించినప్పుడు భూమిని దున్నడానికి          స్లెడ్జిని విస్తృతంగా ఉపయోగించటం జరిగింది. కొన్నాళ్ల తరువాత రెండు కొయ్య దిమ్మలపై అడ్డంగా రెండు మూడు దిమ్మలను అమర్చి,  చర్మం తాళ్లతో బిగించి కట్టిన సాధనం వాడుకలోకి వచ్చింది.  శీతాకాలంలో మంచు పడే ప్రాంతాల్లో దీనిని రవాణా సాధనంగా వాడుతూ వచ్చారు. మంచు ప్రదేశం, అందులోనూ నీళ్ళు గడ్డ కట్టిన నది లేదా  చెరువు చాలా నునుపు తలాన్ని కలిగి ఉండటమే దీనికి కారణం.  

                   ఎద్దులబండి చక్రం

ఈ విషయాన్ని ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల అనేక సార్లు కనుగొన్నారు. అదే కాలంలోనో లేదా కొన్ని వందల సంవత్సరాల తరువాతో  మానవుడు మరో గొప్ప విషయాన్ని కనుగొన్నాడు. ఆహారం వండుకోవటానికి  ఇంధనం కావాలనే ఉద్దేశంతో వృక్షాలను పడగొట్టే సందర్భంలో రెండు పెద్ద మొద్దులపైన బరువైన రాతి బండ అకస్మాత్తుగా పడటం సంభవించి ఉండవచ్చు. బండను దూరంగా నెట్టి వేయాలని ప్రయత్నించినపుడు, మొద్దులపై బండ సులభంగా దొర్లి పోవటాన్ని మానవుడు గమనించాడు. ఈ పద్ధతిలో బరువులను అవలీలగా తరలించవచ్చుననే  ఆలోచన అప్పట్లో అతనికి తట్టింది.ఈ పద్ధతిని ఆది మానవుడు విరివిగా వాడాడనడంలో సందేహం లేదు. దొర్లుతున్న కొయ్యలపై బరువులను తరలించేటప్పుడు కొయ్యలకీ, భూమికీ మధ్య రాపిడి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి జారుడు  ఘర్షణ కంటే దొర్లుడు ఘర్షణ ఎప్పుడూ తక్కువే. దొర్లుడు పద్ధతిలో బరువులను తరలించటం చాలా కాలంగా జరుగుతోంది. ఈ పద్ధతి ఇప్పటికీ కొన్ని దేశాల్లో వాడుకలో ఉంది. కొందరు బరువును తోయటమో, లాగటమో చేస్తున్నప్పుడు మరికొందరు బరువు వెనక ఉండే కొయ్య దిమ్మలను తీసి ముందు వైపు పడవేస్తుంటారు. ఇలాంటి "సామాజిక"  పనులు చేసేటప్పుడు ఆదిమ మానవుల్లో ఒక రకమైన సమిష్టితత్వం పెంపొందింది.

      'చక్రం' కనుకొనడం మానవ నాగరికత లో అతి పెద్ద మలుపు.సుమేరియాలో క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాలకు చెందిన చిత్రాలలో వాహనాలకు చక్రాలున్నాయి. నిజానికి ఈజిప్టులో చాలా కాలం తర్వాత అనగా క్రీస్తుపూర్వం 1650 సంవత్సరంలో చక్రాల వాహనాలు వచ్చాయి. అది నాగరికతల విస్తరణకు ఎంతో దోహదం చేసింది.ఇప్పటికీ చేస్తోంది.అది వారి జీవితాన్ని వేగవంతం చేసింది. దాంతో సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.  ఇలా అభివృద్ధి చెందిన  నాగరికతలన్నీ  నదీ లోయల్లోనే పుట్టాయి.

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata