12 ఏప్రియల్ , అంతరిక్షయాత్రదినోత్సవం




12 ఏప్రియల్ 1961 అంతరిక్ష పరిశోధనలలోనే ఒక మైలురాయి.మొట్టమొదటి సారిగా అంతరిక్షంలోకి మనిషిని ప్రవేశపెట్టిన రోజు మానవుడు సాధించలేనిది ఏమి లేదని చాటిచెప్పిన రోజు.1961సంవత్సరం అంతరిక్ష పరిశోధనలలో సోవియెట్ రష్యా  దూసుకుపోతుంది. తమ పరిశోధనలను మరింత విస్తరించాలని భావించి 1950 సంవత్సరం మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రోజెక్ట్ ను ప్రారంభించింది.ఇందులో భాగంగా అంతరిక్షంలోకి పంపడానికి వారియొక్క శిక్షణ కోసం సోవియెట్ అంతరిక్ష సంస్ధ సోవియెట్ రష్యాకు చెందిన వాయుసేన నుండి  20 మంది  పైలెట్ లతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది వీరికి  శిక్షణ ఇస్తూ ఎంపికలో భాగంగా చివరకు *yuri gagarin* అనే వ్యక్తిని ఎంపిక చేశారు.యూరీ గగారిన్ 9 మార్చి ,1934 సంవత్సరంలో రష్యాలో ఒక పేదరిక కుటుంబంలో  జన్మించాడు. చిన్నప్పటినుండి ఎన్నో కష్టాలు పడి రష్యా వాయుసేనలో చేరాడు. అంతరిక్ష యాత్ర ఎంపిక అయిన తరువాత cosmonaut గాశిక్షణ పొంది తక్కువ ఎత్తు ఉండటం శిక్షణలో మెరుగైన ప్రతిభ కనబరచడం వలన  మొట్టమొదటి అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యాడు.cosmonaut అంటే రష్యా పంపించే వ్యామగాములను cosomonauts అని అంటారు.12 ఏప్రియల్ 1961 తేదిన 9:07 A.M సమయంలో Biakonur అనే launching site నుండి వోస్టోక్-1(vostok-1) అనే rocket ద్వారా vostok 3KA అనే space craftను విజయవంతంగా earth యొక్క lower orbitlo ప్రవేశ పెట్టి 108నిమిషలు పాటు అంతరిక్షంలో గడిప అన్ని సవాళ్ళను  అధిగమించి తిరిగి భూమికి చేరాడు యూరిగగారిన్ .ఈ విజయం  అంతరిక్ష పరిశోధనలలోనే చారిత్రాత్మకమైన విజయం. అప్పటినుండి అంతరిక్ష పరిశోధనలు  విశ్వంయొక్క గుట్టును విప్పుతూనే ఉన్నాయి.ఈ ప్రయోగాన్ని ఆదర్శంగా,సవాలుగా తీసుకొని ఈరోజు inter orbitary mission అంటే చంద్రమండలంపై కాలు మోపాము. Inter planetary mission అంటే mars గ్రహంపైకి అంతరిక్ష నౌకలను పంపడం. త్వరలో mars గ్రహం మీద కూడా కాలు మోపడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.కాబట్టి ఈ మొట్టమొదటి మనిషి యొక్క అంతరిక్ష యాత్ర రోజును. అంతరిక్ష యాత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు

*జనవిఙ్ఞానవేదిక ఆంధ్రప్రదేశ్*

Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం