అసలు కుంకుమ ఎందుకు తయారైంది
పూర్వం యజ్ఞాలు చేసేటప్పుడూ, గృహప్రవేశాలు వ్రతాలు, పెళ్ళిళ్ళవంటి ఏ శుభకార్యాలు చేసినా జంతువుల్ని బలి ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. యజ్ఞాలలో అయితే వందల వందల గుర్రాలు, ఆవులు, మేకలు మొదలైన జంతువుల్ని బలి ఇచ్చేవారు. మనిషి కోరికలు తీరడానికీ, సంతోషాన్ని తెలియజేయడానికీ, దుష్టశక్తుల దిష్టి తగలకుండా ఉండాలంటే రక్తపాతం జరగాల్సిందే. ఆ రక్తాన్ని నుదుటికి రాసుకుని వీరులుగా ఫోజుకొట్టేవారు. జంతువుల పేగులు వేలాడదీసుకుని మాంసాన్ని పీక్కుతినేవారు.
ఈ హింసను భరించలేక బుద్ధుడు జీవహింస మహాపాపం అని తన మతం ద్వారా ప్రచారం చేశాడు. జంతుబలిని నిషేధించాలి అని చెప్పాడు. ఆ మాటలు చాలా మందిని ఆకర్షించి బౌద్ధం వైపు నడిపించాయి బౌద్ధం వల్ల హిందూ మతం అంతరించిపోయే ప్రమాదముందని భయపడిన బ్రాహ్మణులు బుద్ధుడికంటే ఒక అడుగు ముందుకేసి జంతువులను బలివ్వడం ఆపేశారు.
Comments
Post a Comment