కామన్ సెన్స్ - దృష్టి - దిష్టి





కొన్నిసార్లు మనం చదువుకున్న చదువు మొత్తం మన గుడ్డి నమ్మకాల్లో కాలిపోతుంది.. మనకు తెలిసినంతలో 5 శాతం కూడా తెలియని వారిని గుడ్డిగా నమ్మి మనలో ఉన్న కామన్ సెన్స్ కి చంపేసుకొంటాం. సహజంగా విద్య జ్ఞానసమపార్జనకి ఉపయోగ పడుతుంది, కానీ చదువుకున్న వారు కూడా మార్కుల్లా కొంతమందిని ఫాలో అయిపోతారు. రెండు ఉదాహరణలు చెప్తాను.

మిడ్ బ్రైయిన్ యాక్టివిటీ అనే స్కామ్ దేశం మొత్తాన్ని ఉపేసింది. ఇందులో మొదటి దశలో రెండు కళ్ళకి క్లాత్ కట్టి ముందు ఉన్న వస్తువులు చెప్పటం, లేక పుస్తకాన్ని చదవటం సాధ్యం అని నమ్మిస్తారు. ధ్యానం చేయటం వల్ల, మూడవ నేత్రం ఓపెన్ అయ్యి కళ్ళు కనిపించకపోయినా చూడగలరు అని చెప్తారు. రెండో దశలో ప్రక్క రూమ్ లో ఎం జరుగుతుందో కూడా చెప్తారు అంటారు. దీనికి వేలల్లో ఫీజులు తీసుకొని, కొన్ని కోట్ల వ్యాపారం చేశారు( ఆ మొదటి దశ ట్రిక్ తరువాత చర్చిస్తాను) ఈ ప్రగ్రామ్ లో బాగా చదువుకొన్న వారి పిల్లలు ఉన్నారు.

రెండోది ప్రముఖ ఆధ్యాత్మిక వ్యాపారవేత్త జగ్గీ వసుదేవ్. ఇతనైతే డైరెక్ట్ గా ఐఐటీ విద్యార్థులను ఎర్రోళ్లను చేసాడు. నీటికి జ్ఞపక శక్తి ఉంటుంది అని, తాను నీటిని మంచి ఉద్దేశ్యంతో చూసి ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని. చెడు దృష్టితో నీటిని చూసి ఇస్తే, ఆ నీరు తాగిన వారు అనారోగ్యం పాలు అవుతారు అని ఒక ఐఐటీ మీటింగ్ లో చెప్పారు. తాను చూసే చూపును బట్టి నీటిలో ఉన్న మలిక్యుల్స్ అమరిక మారిపోతుంది అని చెప్పాడు
గొఱ్ఱెలు అన్ని చప్పట్లు కొట్టాయి. ఇంగింత జ్ఞనాన్ని చంపే చదువులు మనం ఎందుకు చదువుతున్నాం. 

సరే ఇప్పుడు సమాజ కోణం లో ఈ మోసాలను తర్కించి చూద్దాం. నరుని దృష్టి కి నల్ల రాయి అయినా పగులుతుంది, దిష్టి బొమ్మ పెడితే దిష్టి తగలదు, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి కి విరుగుడు హారతి, దిష్టి యంత్రాలు, శని యంత్రాలు..ఇటువంటి అహేతుక భావాలు మనపై రుద్దబడ్డాయి. ఇప్పుడు బేసిక్స్ కి వెళదాం.

మనం ఏదైనా చూడాలి అంటే ఆ వస్తువు మీద కాంతి పడాలి. ఆ వస్తువు మీద కాంతి పడినప్పుడు ఆ వస్తువు కాంతి ని రిఫ్లేక్ట్ చేస్తుంది. ఆ రిఫ్లేక్ట్ అయిన తరంగాలు మన కంటిని చేరతాయి. మన కంటి నుండి ఎటువంటి కాంతి తరంగాలు ఉత్పన్నం అవ్వవు. కంటికి తరంగాలు కంటి ముందు భాగాన్ని తాకినప్పుడు, అవి లైన్స్ వాలే ఉన్న ముందు భాగం నుండి వంగి, వెనుక వైపు ఉన్న రిటీనా మీద మనం చూసే వస్తూవు తిరగేసి పడుతుంది( ఇన్వర్టడ్ ఇమేజ్) . అది ఆప్టికల నర్వ్ ద్వారా బ్రెయిన్ లో విజువల్ కర్టెక్ట్స్ అనే ప్రాంతానికి చేరి , అక్కడ ఉన్న రసాయిన చర్యల ద్వారా నిటారుగా ఉన్న ఇమేజ్ ని ఎలాక్ట్రిక్ ఇంపల్స్ ద్వారా కంటికి పంపిస్తుంది. నలుపు లో షేడ్స్ చూడటానికి రాడ్స్ , రంగులు చూడటానికి రెడ్ గ్రీన్ బ్ల్యూ కోన్స్ ఉంటాయి. కోన్స్ లేని వారికి రంగులు కనిపించవు. కుక్కలకి కోన్స్ ఉండవు, వాటికి లోకం మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తుంది. కొంత మందికి రెండు రంగుల కోన్స్ ఉంది ఒక రంగు కొన్ మిస్ అవుతుంది. మూడు మిస్ అయినవారికీ రంగులు కనిపించవు.

సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీ చూపు తగిలి ఎవ్వరు నాశనం అవ్వరు, ఎవరి చూపు ఎవరిని ఏమి చెయ్యలేదు. ఎందుకంటే కంటికి ఉంటేనే ఏదైనా చూడగలం. కన్ను కాంతిని గ్రహించి వస్తువుని చూపించే వహకమే కానీ..మీ చూపు ఏ వస్తువుయొక్క గుణాన్ని మార్చలేదు. చిన్నప్పటి నుండి ఈ దిష్టి కాన్సెప్ట్ మనకి అలవాటు అవ్వటం వల్ల, నేను చెప్పింది మీకు వెంటనే జీర్ణం కాకపోవచ్చు. కానీ ప్రశాంతంగా ఆలోచిస్తే మీకే అర్దం అవుతుంది. మోసాలను అరికట్టాలి అంటే, ముందు మనం ఎందుకు ఎలా మోసపోతున్నామో గ్రహించాలి. 

సర్వేజనసుఖిలోభావంతు.
రాజేష్ పిళ్ళా.

Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం