కోడి ముందా? లేక గుడ్డు ముందా? జీవ పరిణామ క్రమం ప్రకారం ఏది ముందని అర్థం చేసుకోవాలి?





 జీవ పరిణామం ప్రకారం గుడ్డే ముందు. చాలామంది సైన్సుకు కూడా పరిమితులు ఉన్నాయనీ, అన్నింటికీ సైన్సు సమాధానం చెప్పలేదని దాన్ని తృణీకరించడానికి, తమకున్న ఛాందస భావాల్ని సమర్థించుకునే క్రమంలో సైన్సును ఎద్దేవా చేయడానికి 'చెట్టు ముందా? విత్తు ముందా?', 'కోడి ముందా? గుడ్డు ముందా?' అంటూ మాటల గారడీ చేస్తారు. నీలాంటి జిజ్ఞాసాపూరిత అమాయక విద్యార్థులే నిజమైన అసక్తితో ప్రశ్నలు వేస్తారు. వారెందుకలా ప్రశ్న సంధిస్తారంటే, గుడ్డు ముందు అని మనం అంటే అది కోడి లేకుండా (లేదా గుడ్డును యిచ్చే అండ జనని) గుడ్డు ఎలా వచ్చింది అంటారు. 'లేదండీ కోడే ముందు' అంటే- గుడ్డు లేకుండా ఎలా వచ్చింది? అంటారు. ఇలా ప్రశ్నలకు సమాధానం సైన్సు ఇవ్వడంలేదు చూశారా అంటూ విద్వేషపూరితంగా చమత్కరిస్తారు. గుడ్డే ముందు అన్నది సైన్సు వాదనకు నిలుస్తుంది. గుడ్డే ఏకకణం, కోడి లేదా గుడ్డు నుంచి వచ్చిన జీవి మరో ఏకకణం (మరో గుడ్డు) అవుతుంది. లేదా కోడిలాగా బహుకణ జీవి అవుతుంది. విత్తు (విత్తనం) ఏకకణం, ఆ విత్తునుంచి జీవావిర్భావ తొలి దశలో మరో విత్తు వస్తుంది లేదా చెట్టులాంటి బహుకణ జీవి తర్వాత వచ్చింది. జీవి ఏకకణ జీవి అయినా బహుకణ జీవి అయినా తన తొలి దశ సంయుక్త జీవకణం (zygote) లేదా సంపూర్ణ క్రోమోజోముల ఏకకణం (Diploid cell). నేనైనా, నువ్వయినా, గాంధీగారయినా, ఐన్‌స్టీన్‌ అయినా తన తల్లి అర్థ క్రోమోజోముల (Haploid) ఏకకణ అండంలో తన తండ్రి అర్థ క్రోమోజోముల ఏకకణ శుక్ర కణంతో సంయోగం (Fertilization) జరిగాక కూడా ఏర్పడేది కూడా ఏకకణ సంయుక్త బీజ కణమే. దాదాపు 400 కోట్ల సంవత్సరాల క్రితం అమీబా, యూగ్లీనా వంటి సంపూర్ణ క్రోమోజోములున్న ఏక కణాలే ఏర్పడ్డాయి. ఇవి ద్విదావిచ్ఛిత్తి (binary division) జరుపుకొనే తమలాంటి సంతానాన్ని జీవుల సందోహాన్ని పెంచుకొన్నాయి. కాలక్రమేణా పని విభజన రీత్యా బహుకణ జీవులు ఏర్పడ్డాయి. ఏయే కణాలు ఏయే కార్యకలాపాలు చేయాలన్నా విషయం క్రోమోజోములలోకి జన్యువులలో నిక్షిప్తం అయ్యింది. కాబట్టి పరిణామ క్రమానుగతిలో గుడ్డే ముందు, కోడి తర్వాత. విత్తు ముందు, చెట్టు తర్వాత. నేను ముందు గుడ్డే. నేను ఇపుడు తర్వాత...

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, 
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata