మనిషి_పరిధి




పసి బిడ్డ గా  రూపం దాల్చిన నుండి మనిషి గా రూపం కనుమరుగు అయినంత వరకే మనిషి పరిధి........

1.గర్భం లో "శుక్రకణం , అండం తో ఐక్యం చెంది  సంయుక్త బీజం(జైగొట్)/ ఏక కణ జీవి గా ఏర్పడి, బహుకణ జీవిగా "జీవ పరిణామం" చెంది  ఒక రూపం  దాల్చి  బాహ్య ప్రపంచం లోకి  ఒక బిడ్డ వస్తుంది....

2.బిడ్డలు  ప్రకృతి లోని "పదార్ధం"తో శారీరకంగా , కాలంతో పాటు అనుభవం తో 
 "మానసికం"గా పెరిగి  మనుషులు గా అవుతారు..

3.#మనసు - #జీవి - #ఆలోచన.....
మనిషి శరీరం జీవ కణాలతో ఏర్పడిన, ఒక #జీవి .
మనిషి శరీరం లో ప్రతి జీవ కణం ను  అనుభూతి చెందేటట్లుగా అనుసంధానం చేయబడి సమన్వయ పరచగల  ద్రవ రూప జీవ పదార్ధం ఉంటుంది. దీనికి అనుభూతి చెందే మరియు ప్రేరణ కలిగించే గుణం  ఉంటుంది.. 
ఈ జీవ పదార్ధం యొక్క అనుభూతి "#మనసు".
ఈ జీవ పదార్ధం యొక్క ప్రేరణ "#ఆలోచన"...
ఈ ఆలోచన మెదడు లో కలిగి మనిషి లో చైతన్యం మరియు కదలిక ఏర్పడుతుంది.. 

4.ఈ ఆలోచన ఆధారంగా మనిషి ప్రవర్తన ఉంటుంది....మనిషి ప్రవర్తన సమాజం ను 
    ప్రభావితం చేస్తుంది...సమాజం యొక్క పరిస్థితి మనిషి ని ప్రభావితం 
   చేస్తుంది....ప్రవర్తన , పరిస్థితి మధ్య  నిరంతరం చర్యా , ప్రతిచర్యలు జరుతుంటాయి.
  అందుకే మనిషికి అనుభవాలు, ఆలోచనలు...

5.మనిషి శరీరం మానవ జాతి యొక్క ఆలోచనను నడిపే ఒక  ఒక #యంత్రం ....

6.మనిషి లోని జీవ పదార్ధం చైతన్యం ఉన్నంత వరకే మనిషి కి జీవం/ప్రాణం ఉంటుంది. జీవ చైతన్యం ఆగి పోతే మరలా మనిషి రూపం కనుమరుగు అయ్యి  "పదార్ధం" లో కలసి పోతారు....

#గమనిక:- సాంప్రదాయ పరిస్థితుల ప్రభావం వలన మనుషులు బిడ్డలకు జన్మ ఇస్తారు..పదార్ధం.తో పెరిగి .తన లోని ..జీవ పదార్ధ అనుభూతి, ప్రేరణల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని సమాజం లో జ్ఞాపకాలుగా విడిచి  కనుమరుగై ప్రకృతిలో పదార్ధం తో కలసి పోతారు. ఇదే పునరావృతం అవుతుంది..

#ముఖ్యగమనిక :- సహజంగా బిడ్డకు జన్మ ఇవ్వడం మనుషుల పరిధి లోనే ఉంది.(గర్భ నిరోధక పద్దతులు / సహజ రుతు చక్ర 30 రోజుల కాలం లో కానుపు కలిగే సమయం )...జన్మించిన వారు మరణించక తప్పదు....అంటే #జన్మ , #మరణం ఒక #జత. .జన్మ ఇచ్చిన వారే పరోక్షంగా ఆ మనిషి మరణానికి కూడా  బాధ్యులు....

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata