జీవకణం



350 కోట్ల సంవత్సరాల క్రితం నిర్జీవ పదార్ధ పరిణామంలో భాగంగా జీవకణం రూపొందింది.
సముద్రపు నీటిలో ఇది జరిగింది.
అది విభజన జరిగి ప్రత్యుత్పత్తి జరపడం ఆరంభించింది.
ఏకకణ సూక్ష్మ జీవ దశలోనే ప్రకృతి ఎంపిక ద్వారా జరిగిన పరిణామ ఫలితంగా జన్యువుల్లో మార్పులు జరిగి అనేక జాతులు ఏర్పడ్డాయి.
ఏకకణజీవులు పరిణామ క్రమంలో బహుకణ జీవులుగా పరిణామం చెందాయి.
బహుకణ జీవుల్లో మొదట వెన్నెముక లేని చిన్న చిన్న జీవులు పరిణామంలో వచ్చాయి.
బహుకణ జీవుల్లో అనేక అవయవాలు రూపొంది శ్రమవిభజన జరిగి ఒక్కో అవయవం ఒక్కో పనిని చేయడం ఆరంభమైంది.
బహుణ జీవుల్లో పరిణామం వల్ల వెన్నెముకలు గల జీవులు వచ్చాయి.
వెన్నెముకలతో అస్తి పంజరం రూపొందడంతో శరీర పరిమాణం పెరగడం మొదలైంది.
చేపలు లాంటి వెన్నెముక గల జీవులనుండి కప్పల్లాంటి వెన్నెముక జీవులు నీటినుండి బయటకు వచ్చి జీవించటానికి అనుకూలనాలు సాధించాయి.
ఉభయ చర జీవులు ఆహారం కోసం నేల మీదకు రావడం, ప్రత్యుత్పత్తి కోసం నీటిలోకి పోతూ ఉభయ ఆవాసాల్లో జీవించడానికి అనుకూలనాలు సాధించాయి.
కప్పల్లాంటి జీవులనుండే బల్లుల వంటి సరీ సృపాలు పరిణామంలో ఆవిర్భవించాయి.
బల్లులు నేలమీద పొడి వాతావరణంలో జీవించడానికి అనుకూలనాలను సాధించాయి.
కాళ్ళతో పాకడం మొదలు పెట్టాయి.
శరీరం నుండి నీరు నష్టపోకుండా చర్మం మీద పొలుసులు అభివృద్ధి చెందాయి.
కీటకాలను తింటూ జీవనం సాగించి పరిణామం చెంది మొసళ్ళు, పాములు,తాబేళ్ళు గా పరిణమించాయి.
సరీసృపాలు గుడ్లు పెట్టి వదలి వేస్తే అవి పొదిగి పిల్లలవుతాయి.
సంతాన పాలన బల్లుల్లో కానరాదు.
భారీ దేహాలతో డైనోసార్లు అప్పటి జీవ ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో జీవించాయి.
బల్లుల వంటి జీవులనుండి ఒక శాఖగా పక్షులు, మరొక శాఖగా క్షీరదాలు పరిణమించాయి.
డైనోసార్లు భారీకాయాలతో జీవప్రపంచాన్ని ఏలుతున్న యుగంలో క్షీరదాలు ఎలుకల్లాగా చిన్నవిగా ఉండేవి.
డైనోసార్లు ఒక్కసారిగా అంతరించడంతో తెలివైన క్షీరదాలు వాటి ప్రదేశాలను ఆక్రమించాయి.
క్షీరదాలు తెలివైనవి, చురుకైనవి.
పిల్లల్ని గర్భంలోనే పెంచి, కని, పాలిచ్చి పెంచుతాయి.
వీటిల్లో సంతాన పాలన క్రమంగా పెరిగి మానవుల్లో ఉచ్ఛదశకు చేరింది.
క్షీరదాల్లో పరిణామం జరిగి ఏనుగుల్లాంటి భారీకాయాలు ఆవిర్భవించాయి.
ఒంటెలు ఎడారి జీవనానికి, సీలు జంతువులు దృవ ప్రాంత జీవనానికి, కోతులు చెట్లమీద జీవించడానికి, తిమింగళాలు సముద్రంలో జీవించడానికి, గబ్బిలాలు చీకటిలో జీవించడానికి అనుకూలనాలు సాధించాయి.
ఏప్స్ లో కొన్ని నేలమీదకు వచ్చాయి.
మెదడు పరిణామం జరిగి ఏప్స్ లో త్వరగా తెలివి తేటలు పెరిగాయి.
పూర్వం జీవించిన ఒక జాతినుండి రెండు కాళ్ళమీద నడచే హోమో ఎరక్టస్, హోమో ఎరక్టస్ నుండి హోమో సెపియన్స్ అని శాస్త్రీయం గా పిలవబడే ఆలోచించ గల మానవులు ఆవిర్భవించారు.
మానవుడిలో మెదడులో ఆలోచించగల, విశ్లేషించగల, ప్రణాళిక వేయగల, భావాలను భాష ద్వారా వ్యక్తం చేయగల, పరికరాలను రూపొందించగల,తరతరానికి జ్ఞానాన్ని సంచిత వారసత్వంగా  అందించగల మెదడు భాగం బాగా పెరిగి మిగతా జంతువుల కంటే భిన్నంగా జీవించగల మానవుడు పరిణతి చెందాడు.
సరీసృపాల నుండే మరో శాఖగా పరిణమించిన పక్షులు చెట్లపై గూళ్ళు కట్టి, పొదిగి, పిల్లల్ని చేసి, ఆహారాన్ని తెచ్చి నోఅ్లో పెట్టి సంతాన పాలన కొనసాగిస్తున్నాయి.
ఈ విధంగా ప్రకృతి ఎంపిక ద్వారా అనేక జీవ జాతులు ఒకే మూల జాతి నుండి సుదీర్ఘ కాలం పాటు పరిణామం చెంది భూమి మీద విజయవంతంగా జీవిస్తున్నాయి.
పరిణామ క్రమంలో అనేక జాతులు అనుకూలనాలను పొందలేనివి అంతరించాయి.
వీటి మొత్తాన్ని వృక్షంగా అమర్చితే ఈ సంక్లిష్టమైన బొమ్మ తయారైంది.
శాఖోప శాఖలుగా జీవజాతులు లక్షలాదిగా పరిణమించాయి.

మేడూరి సత్యనారాయణ

Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం