జీవపరిణామం అంటే ఏమిటి?

ఈ కార్యక్రమం లో భారత హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి మేడూరు సత్యనారాయణ " జీవపరిణామం" అంశం మీద ప్రసంగించారు. మానవుడు భూమి మీద రెండు లక్షల సంవత్సరాల క్రితం అంతకు మందు ఉన్న మనిషిలాంటి జీవజాతి హోమో ఎరక్టస్ నుంచి పరిణమించాడని, ఆఫ్రికాలో ఆవిర్భవించిన మనుషుల 60000 సంవత్సరాల క్రితం అక్కడ నుండి బయటకు వలస వచ్చి భూమి చుట్టూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు.
ప్రకృతి వరణం ద్వారా ఒక జాతి నుండి మరొక నూతన  జాతి  జీవులు పరిణమించాయన్నారు.
దైవసృష్టివాదాన్ని డార్విన్ జీవపరిణామ వాదం తప్పు అని ఆధారాలు చూపిందన్నారు.
మసనవుడు హేతుబద్ధ ఆలోచనతో, స్వతంత్ర చింతనతో అభివృద్ధి చెందడానికి అతనికి పరిణామ ఫలితంగా సంక్రమించిన పెద్ద మెదడే కారణం అన్నారు.
మనిషి విశ్వాసి కాదు అన్వేషి అన్నారు.
అనంతరం వీక్షక శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
మూడు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో 50 మంది పాల్గొన్నారు

గుంటూరు జిల్లా హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి కరణం రవీంద్ర బాబు సూచనలు చేసి, వందన సమర్పణ చేశారు.

https://youtu.be/j2qcLlgDZiU

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata