ప్రతికూలంలోనూ మనిషి వికసిస్తున్నది అందుకే..!




          మనిషి కంటే బలమైన జంతువులెన్నో ఉన్నాయి. యుగాలుగా కొనసాగుతున్న వాతావరణ మార్పులకు వాటిలో కొన్ని అంతరించిపోయాయి.
కానీ, మానవజాతి మాత్రం వాటిని తట్టుకొని ఎలా పరిణామం సాధించగలి గింది? - శతాబ్దాలుగా శాస్త్రవేత్తలను డొలిచేస్తున్న ఈ ప్రశ్నకు ఎట్టకేలకు ఓ సమాధానం చిక్కింది. అది ప్రాచీన సూక్ష్మజీవుల ఆధారంగా! జార్జియా విశ్వవిద్యాల
యానికి చెందిన మైఖేల్ ఆడమ్స్, వాన్ ఆండెల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటకు చెందినహుయిలిన్ లీ బృందం ఈ చిక్కుముడిని విప్పింది. భూమిపై దాదాపు అన్ని జీవులూ శ్వాసించడం ద్వారా విద్యుత్ శక్తిని రసాయనరూప వినియోగశక్తిగా
మార్చుకుని మనుగడ సాగిస్తున్నాయి. అయితే, ప్రాచీన సూక్ష్మజీవి శ్వాసవ్యవస్థ
(ఎంబీ హెచ్) నిర్మాణం.... మనుషుల్లోని కాంప్లెక్స్-1కు సారూప్యంగా ఉన్నట్లు వారు గుర్తించారు. ఎంబీ హెచ్ నిర్మాణ తీరును విశ్లేషించడం ద్వారా- మనిషి శ్వాసవ్యవస్థ పరిణామశీలతను వారు గమనించారు. “మరిగే నీటిలో చక్కగా అభి వృద్ధి చెందే సూక్ష్మజీవిలోని ఎంబీ హెచ్ సరిగ్గా మనిషిలోని శ్వాసవ్యవస్థ
(కాంప్లెక్స్-1)ను పోలి ఉన్నట్లు గుర్తించాం. ఎంబీ హెలాగే.. పర్యావరణ మార్పులకు అణుగుణంగా కాంప్లెక్స్-1 కూడా పరిణామం చెందుతూ, విద్యుత్ శక్తిని రసాయన వినియోగశక్తిగా మార్చుకుంటోందనీ, అందువల్లే యుగాలుగా మనిషి పరిణామం చెందుతూ వస్తున్నట్లు అర్ధమవుతోంది" అని హుయిలిన్ వివరించారు.

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata