ఆక్సిజన్‌ ఉత్పత్తి వ్యవస్థలు (oxygen generators)


       pc enaadu.net
1. వాక్యూమ్‌ ఇన్సులేటెడ్‌ ఎవాపరేటర్‌ (వీఐఈ): ఇది ప్రత్యేకమైన ఆక్సిజన్‌ వ్యవస్థ. ఇందులో వాక్యూమ్‌ ఇన్సులేటెడ్‌ ట్యాంకులో పెద్ద మొత్తంలో ద్రవ ఆక్సిజన్‌ను నిల్వ చేస్తారు. ఆక్సిజన్‌ ఉష్ణోగ్రత -118 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటుంది. ఇది వేపరైజర్‌ ద్వారా ఆవిరై గ్యాస్‌గా మారి.. గొట్టాల ద్వారా వార్డులకు సరఫరా అవుతుంది. కంట్రోల్‌ ప్యానెల్‌ ఆక్సిజన్‌ ప్రవాహాన్ని నియంత్రిస్తుంది.  


       PC enaadu.net
2. ఆక్సిజన్‌ సిలిండర్లు: అత్యధిక పీడనంతో కూడిన సిలిండర్‌లోని ఆక్సిజన్‌ను తేమతో కూడిన సీసాలోకి పంపించి, అక్కడ్నుంచి గొట్టం ద్వారా ముక్కుకు ఆక్సిజన్‌ అందేలా చూడటం దీని ప్రత్యేకత. ఆక్సిజన్‌ మాస్కు, గొట్టం, ఆక్సిజన్‌ టెంట్‌, హైపర్‌బారిక్‌.. ఇలాంటి పరికరాలు, పద్ధతుల్లో ఆక్సిజన్‌ను అందిస్తారు.


         pc enaadu.net
3. ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు: ఆక్సిజన్‌ నిల్వ చేయటం కుదరని చోట, సిలిండర్లు లేని చోట్ల ఇవి ఉపయోగపడతాయి. విద్యుత్తు లేదా బ్యాటరీ సాయంతో పనిచేసే ఇవి చుట్టుపక్కల గాలిని తీసుకొని, అందులోని ఆక్సిజన్‌ను వేరు చేస్తాయి. గాలిలో 79% నైట్రోజన్‌, 21% ఆక్సిజన్‌ ఉంటాయి. ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌ గాలిలోని నైట్రోజన్‌ను వేరు చేసి, 90-95% ఆక్సిజన్‌తో కూడిన గాలిగా శుద్ధి చేస్తుంది. దీన్ని ముక్కు గొట్టం ద్వారా రోగులకు అందిస్తాయి.

Enaadu,12.5.2021

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata