కాలవిభజన
భూమి ఆవిర్భవించి సుమారుగా 450 కోట్ల సంవత్సరాలు గడిచింది . భూ ఆవిర్భావం నుంచి జీవ పరిణామం వరకు గల కాలాన్ని "జీవ పరిణామ కాల విభజన" (GEOLOGICAL CALANDER) అంటారు .
ఈ కాలెండర్ కాలాన్ని "దశ" (ERA) లుగా దశలను "ఘట్టాలు" (PERIODS) గా ఘట్టాలను "మహాయుగాలు" (EPOCHS) గా మహాయుగాలను తిరిగి "యుగాలు" (AGES) లుగా విభజించారు .
దశలలో మొదటిది
1) నిర్జీవ దశ ( Ezoic Era )
------------------------------------
భూఆవిర్భావం నుంచి 260 కోట్ల సంవత్సరాలకు వర గల కాలాన్ని నిర్జీవ దశ అంటారు . ఈ దశలో జీవం గానీ జీవ పదార్దాం కానీ ఆవిర్భవించలేదు.
2) ప్రథమ జీవ దశ (Archiozoic Era)
--------------------------------------------------
ఈ దశ 260-200 కోట్ల సంవత్సరాల వరకు కొనసాగింది. ఈ దశలోనే జీవ పదార్దం ఆవిర్భవించి ఉంటుదని శిలాజాదారాల ద్వారా చెప్పగలిగారు .
3) పూర్వ జీవ దశ (Protirozoic Era)
-------------------------------------------------
సుమారు 200-50 కోట్ల సంవత్సరాల మద్య సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. ఏక కణ జీవులు ప్రారంభ దశలో వెన్నుముక లేని సముద్రజీవులు అంతిమ దశలో ఏర్పడ్డాయి.
4) పురా జీవదశ (Peleolithic Era)
------------------------------------------------
ఈ దశ 50-20.5 కోట్ల సంవత్సరాల వరకు కొనసాగింది . దీనిని ఏడు ఘట్టాలుగా విభజించారు .
i) కేంబ్రియన్ పీరియడ్ :
------------------------------
50-42.5 కోట్ల సంవత్సరాల వరకు కొనసాగింది .వెన్నుముక లేని జీవులు వృక్షజాతులలో జంతుజాతిలలో ఆర్ద్రోపోడ వర్గ జీవులు ఆవిర్భవించాయి.
ii) ఆర్దోవిసియన్ పీరియడ్ :
-----------------------------------
42.5-36 కోట్ల సంవత్సరాల వరకు కొనసాగింది .వెన్నుముక గల జీవులు జీవులు చేపలు భూమి పై వృక్షజాతులు అవతరించాయి.
iii) సైలూరియన్ పీరియడ్ :
-----------------------------------
36-32.5 కోట్ల సంవత్సరాల వరకు కొనసాగింది
మంచి నీటి చేపలు రెక్కలు లేని కీటకాలు ఆవిర్బవించాయి.
iv) డివోనియన్ పిరియడ్ :
----------------------------------
32.5-28 కోట్ల సంవత్సరాల మద్య కొనసాగింది.
భూమిపై అరణ్యాలు ఏర్పడ్డాయి ఉభయచరాలు సముద్రాలలో షార్క్ జాతులు ఏర్పడ్డాయి .
v) మిసిసిపియన్ (కార్బోనిఫెరస్) పీరియడ్ :
-----------------------------------------------------
28-26.5 కోట్ల సంవత్సరాల మద్య కొనసాగింది. ఉభయచరాలు బాగా అబివృద్ది చెందాయి.
vi) పెన్సిల్వేనియన్ (కార్బోనిఫెరస్) పీరియడ్
--------------------------------------------------------
26.5-23 కోట్ల సంవత్సరాల మద్య కొనసాగింది . సరీసృపాలు అభివృద్ది చెందాయి.
vii) పెర్మీయన్ పీరియడ్
-----------------------------
23-20.5 కోట్ల సంవత్సరాల మద్య కొనసాగింది. ఈ యుగంలో ఖండాల ఆవిర్బావం ప్రారంభమయింది . వాతవరణ పరిస్తితులు తట్టుకోలేక కొన్ని ప్రాచీన జీవులు అంతరించాయి. సరీసృపాలు స్తన్య జీవులు అభివృద్ది చెందాయి.
5) మద్య జీవ దశ (Mesozoic Era )
-----------------------------------------------
20.5 -7.5 కోట్ల సంవత్సరాల మద్య కొనసాగింది. దీనిని తిరిగి మూడు పీరియడ్ లుగా విభజించారు.
i) ట్రయాసిక్ పీరియడ్
----------------------------
ఈ యుగం 20.5 16.5 కోట్ల సంవత్సరాల మద్య కొనసాగింది. ఈ యుగంలో ఎడారులు వ్యాపించాయి . డైనోసార్లు గుడ్లు పెట్టే క్షీరదాలు అవతరించాయి.
ii) జురాసిక్ పిరియడ్
--------------------------
16.5 - 13.5 కోట్ల సంవత్సరాల మద్య ఈ యుగం కొనసాగింది. ఈ యుగంలో డైనోసార్లు బాగా అభివృద్ది చెందాయి. పక్షులు మార్సూపియల్స్ (కంగారు లాంటి జీవులు) అవతరించాయి. ఖండాల ఎత్తు బాగా పెరిగాయి.
iii) క్రిటేసియన్ పీరియడ్
-------------------------------
13.5 - 7.5 కోట్ల సంవత్సరాల క్రితం కొనసాగిన ఈ యుగంలో డైనోసార్లు అంతరించిపోయాయి. వివిద ఖండాలలో ముడుత పర్వతాలు ఏర్పడ్డాయి. క్షీరదాలు బాగా అభివృద్ది చెందాయి.
6) నవ్య జీవదశ (Cenozoic Era )
---------------------------------------------
ఈ దశ 7.5 కోట్ల సంవత్సరాల నుంచి 10 లక్షల సంవత్సరాల మద్య కొనసాగింది . ఈ యుగాన్ని స్తన్య జీవుల యుగంగా చెప్పోచ్చు. ఈ దశ ను తిరిగి రెండు పీరియడ్ లుగా విభజించవచ్చు.
i) టెర్షీయరీ పీరియడ్
--------------------------
7.5 కోట్ల సంవత్సరాల నుంచి కోటి పది లక్షల సంవత్సరాల మద్య యుగంగా చెప్పుకోవచ్చు . దీనిని మళ్లి 5 మహాయుగాలు (ఇసాక్) లుగా విభజ్ంచవచ్చు .
a) పేలియోసీన్ ఇసాక్
b) ఇనోసీన్ ఇసాక్
c) అలిగో సీన్ ఇసాక్
d) మయోసీన్ ఇసాక్
e) ప్లియోసీన్ ఇసాక్
ఈ టెర్షీయరీ కాలంలోనే ఆధునిక మానవుడిని పోలిన ఆంత్రోపాయిడ్ వానరాలు పరిణామం చెందాయి . ఈ కాలం చివరికొచ్చేసరికి పచ్చిక మైదనాలు అడవులు అవతరించి ఆదునిక జంతువులైన ఏనుగులు గుర్రాలు ఓంటెలు మరియు ఇతర జీవులు ఈ నాటి రూపాన్ని సంతరించుకున్నాయి .
ii) క్వేటర్నరీ పీరియడ్
---------------------------
నవ్య జీవదశలో రెండవ ఘట్టాన్ని క్వేటర్నరీ పీరియడ్ అంటారు. ఈ కాలం 10 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమయి ఇంకా నడుస్తున్నది.
దీనిని రెండు ఇసాక్ లుగా విభజించవచ్చు .
a) స్లీస్టోసీన్ ఇసాక్
----------------------
ఇది 10 లక్షల సంవత్సరాల నుంచి 25 వేల సంవత్సరాల వరకు కొనసాగింది. ఈ కాలంలోనే మానవ సాంఘీక జీవనచ్చాయలు కనిపించాయి. హిమయుగాలు అవతరించి అంతరించిపోవటం జరిగింది .
b) రీసెంట్ ఇసాక్
----------------------
దీనినే ఆధునిక మహా యుగంగా చెప్పుకోవచ్చు. సుమారు 25 వేల సంవత్సరాల క్రితం ప్రారంభమయి ఇంకా నడుస్తుంది. హిమయుగాలు అంతరించి వెచ్చని శీతోష్ణ వాతావరణం ఏర్పడి మానవ మహా యుగం ప్రారంభమైంది.
ఇలా 450 కోట్ల సంత్సరాల క్రితం ఏర్పడిన భూ గ్రహం మీద వానరుడు నరునిగా పరిణామం చెందటం అనే ప్రకృియ 3 కోట్ల 90 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమై సుమారు 25 వేల సంవత్సరాలు గడిస్తే ఆదునిక మానవుడిగా మార్పు చెందాడని చెప్పవచ్చు..
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్

Comments
Post a Comment