ఉపగ్రహాలు మానవ ఉపయోగం




నేడు మనం ఉపయోగిస్తున్న సాంకేతికత లో నేడు అతి కీలకమైన పాత్ర పోషిస్తున్నది అంతరిక్ష విభాగం. ఈరోజు మనం ఉపయోగిస్తున్న టెలికమ్యూనికేషన్ తో పాటు తుఫాన్ హెచ్చరికలు, వనరుల పరిశీలన, భూ పరిశీలన , భారీ నౌకలకు మరియు విమానాలకు నేవిగేషన్ సూచన చెయ్యటం, సరిహద్దుల్లో నిఘా పెట్టడం. వాతావరణ మార్పులు , అంతరిక్ష పరిశోధనలు వంటి అనేక విభాగాలలో ఉపగ్రహాల పరిజ్ఞానాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఈ ఉపగ్రహాలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఉపగ్రహాలు తిరిగే కక్ష్యలు ఆధారంగా మరియు ఉపగ్రహాల ప్రయోజనాల ఆధారంగా వాటిని విభజిస్తారు. అవి:

కమ్యూనికేషన్ ఉపగ్రహాలు

ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు టెక్నాలజీ ఉపయోగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి రేడియో టెలివిజన్ ప్రసారాలు ఈ ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా గాని వీక్షిస్తున్నామంటే. వీటివల్లనే ఒక చోటు నుండి వేరే చోటుకు ఉపగ్రహాలు సిగ్నల్స్ ని చేరవేస్తాయి. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ లు భూమికి 35 వేల ఎనిమిది వందల కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి భూమి తన ఆత్మ ప్రదక్షిణానికి ఎంత సమయం తీసుకుంటుందో  అంతే సమయంలో ఈ ఉపగ్రహాలు భూమి చుట్టూ ప్రదక్షిణం చేయడానికి తీసుకుంటాయి.

వాతావరణ గ్రహాలు

ఈ ఉపగ్రహాలు నిరంతరం భూమి యొక్క వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉంటాయి వాటికి సంబంధించిన ఫోటోలను తీసి భూమి మీదకు పంపించడం ద్వారా తుఫాన్లు తదితర విపత్తుల నుండి ముందుగా మనకు హెచ్చరికలు చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ ఉపగ్రహాలు రెండు రకాలు ఉంటాయి. జియో స్టేషనరీ లో పరిభ్రమించే వే కొన్ని అయితే మరికొన్ని పోలార్ ఆర్బిట్ లో పరిభ్రమిస్తుంటాయి.
*నిఘా మరియు పరిశీలన ఉపగ్రహాలు*: -
దేశ సరిహద్దు భద్రతా బలగాలకు త్రివిధ దళాలకు సహాయపడేందుకు ఈ ఉపగ్రహాలు నిరంతరం సరిహద్దులను పరిశీలిస్తూ శత్రుదేశాల తాలూకు సైన్యం సమాచారాన్ని వాళ్ల రాడార్ లను గుర్తించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడతాయి. మన భారత్ ప్రయోగించిన cartosat సిరీస్ మరియు రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాలు వీటిలో కే వస్తాయి.

రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు

 మానవులకు అవసరమయ్యే వనరులను గుర్తించడం ఖనిజ నిక్షేపాలను గుర్తించడం అడవులను సముద్రాల లో ఉన్న ఖనిజాలను గుర్తించిన వంటి సమాచారాన్ని గుర్తించడానికి ఈ ఉప గ్రహాలు ఉపయోగపడతాయి

ఖగోళ ఉపగ్రహాలు

అంతరిక్షంలో ఉన్న సుదూరమైన గేలాక్సీల నక్షత్రాలను వేరే గ్రహాల సమాచారాన్ని  ఈ  ఉపగ్రహాలు పరిశీలిస్తాయి. మన భారత్ ప్రయోగించిన ఆస్ట్రా శాట్  ఈ ఇందులోకి వస్తుంది.

నానో ఉపగ్రహాలు

ఈ ఉపగ్రహాలు విద్యార్థులకు అంతరిక్ష రంగం పై వారి యొక్క ప్రయోగాలు చేసేందుకు 10x10x10 అనే మెజర్మెంట్స్ తో తయారు చేస్తున్నారు ఇందులో 1U,2U,3U,6U,12U వరకు వాటి యొక్క PAYLOADS పేరు ఆధారంగా పెంచుకోవచ్చు.

స్పేస్ షిప్స్

అంతరిక్షంలోకి తీసుకువెళ్లి కక్ష్యలో ప్రవేశ పెట్టి మళ్ళీ భూమికి తీసుకు వచ్చేందుకు CREW మాడ్యూల్ మా తో కలిగిన భారీ ఉపగ్రహాలు మన భారత్ చేపట్టబోయే గగన్ యాన్ మిషన్ ఈ పరిధిలోకి వస్తుంది.

ఇంటర్ ఆర్బిటర్ మిషన్

 భూమియొక్క గురుత్వాకర్షణ శక్తి ఉన్నా ఆర్బిట్ ను దాటి వెళ్లే వాటిల్ని ఇంటర్ ఆర్బిటర్ మిషన్ అని ఉంటారు మన దేశ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -1,చంద్రయాన్ -2 ప్రయోగాలు వీటిలో కే వస్తాయి.
*ఇంటర్ ప్లానెటరీ మిషన్*:- భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటుకొని వేరే  గ్రహాల యొక్క ఆర్బిట్ లోకి మరియు ఉపరితలంపైకి ప్రయోగించే ఉపగ్రహాల ప్రయోగాలను ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అంటారు. మన దేశం ప్రయోగించిన mangalyaan ఇందులో కే వస్తుంది.

ch.v. సాయి.

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata