మనసు




మనసులో 3 భాగాలుంటాయి.
 1.ఆవేశాలు 2. సమర్థత 3. తీరు. ఆగ్రహం, ఆహ్లాదం, అసూయ, అసహ్యం, దయ ,జాలి మొదలైనవి ఆవేశాలు గా పరిగణింపబడతాయి.  ఆవేశాలను అనుభవంలోకి తెచ్చుకోగలిగే శక్తిని సమర్థత అంటాం .ఆవేశాలకు మనం స్పందించే విధానాన్ని తీరు అంటారు. స్పందన తీవ్రంగా గాని అల్పంగా గాని ఉండటం సరైనది కాదు. మితంగా ఉండటం సరైన పద్ధతి. అందువల్ల శీలసంపద ఆవేశాలకు, సమర్థతకు కు సంబంధించింది కాదు .అది మనసు తీరుకు సంబంధించినది. భావాలు మనసు తీరును బట్టి ఉంటాయి. మనిషి
 చేసే పనులు రెండు రకాలుగా ఉంటాయి. 1. ఉద్దేశం లేకుండా చేసేవి 2. ఉద్దేశంతో చేసేవి. ఉద్దేశపూర్వకమైన వాటిని మంచి చెడ్డలను బట్టి    మెచ్చుకోవడం గాని విమర్శ గాని గురవుతాయి . ఉద్దేశం లేకుండా చేసే  పనులు మాత్రం క్షమాపణ గాని జాలికి గాని గురవుతాయి . ఉద్దేశం లేకుండా చేసేవి రెండు రకాలుగా జరుగుతాయి. 1.ఒకరి వత్తిడి వల్ల లేదా ఆదేశాల వల్ల  2. విషయపరిజ్ఞానం సరిగా లేకపోవడం వల్ల .ఉదాహరణకు శిరచ్ఛేదం చేసే సైనికుడికి తను చేస్తున్నది ఏమిటో తెలుసు కానీ ఆ పని చెయ్యటం చేయకపోవడం అతని చేతిలో లేదు కనుక ఇది ఉద్దేశం లేకుండా చేసేదిగా పరిగణించాలి. అమాయకత్వం వల్ల  అనాలోచితంగా చేసే పనులు కూడా ఇలాగే ఉంటాయి.

____అరిస్టాటిల్ (ఎథిక్స్)( క్రీ పూ 384_447)
(సేకరణ: పిళ్లా విజయ్)
**************************

Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం