మానవ పరిణామం




           భూమి ఏర్పడిన తర్వాత భూమిపై అనేక జీవరాసులు పరిణామక్రమంలో ఏర్పడ్డాయి .ఒక దశలో అత్యధిక హిమపాతం కలిగిన భూమిని అంతరిక్షం నుంచి వచ్చిన ఆస్టరాయిడ్ శకలాలు తగలడం వల్ల అనేక వృక్షాలు జంతువులు మరణించాయి. ఆ సందర్భంలో  భూమి పైన అనేక గడ్డి మైదానాలు ఏర్పడ్డాయి. ఉత్తరకెన్యా, ఈశాన్య ఇథియోపియాలో లేక్   
రుడాల్ఫ్ గడ్డి మైదానాలలో మానవ పరిణామ క్రమం ప్రారంభమైందనిఅందరూ అంగీకరిస్తున్నారు. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా  నడిచే వానరాలు చెట్ల మీద నుంచి భూమి మీదికి ఆహార సేకరణ కోసం చాలా దూరం గడ్డి  మైదానాల పై నడుస్తూ  వెళ్లాల్సి వచ్చేది. ఆ క్రమంలో లో వానరాలు నిలబడటం అలవాటు చేసుకున్నాయి. వెనుక కాళ్ళు మొత్తం శరీరాన్ని మోయగల శక్తిని సంపాదించుకున్నాయి. కాలి వేళ్ళు భూమిని పట్టుకునేందుకు అనువుగా పాదం వెడల్పుగా తయారైంది. అప్పుడు ముందు కాళ్ళు స్వేచ్ఛను పొందాయి. కాలక్రమంలో అవి మనిషి చేతులు గా రూపాంతరం చెందాయి. చెట్లు ఎగబాకే టప్పుడు, పళ్ళు ,కాయలు దుంపలు ఏరుకొనేటప్పుడు, రాళ్లను ఉపయోగించేటప్పుడు జరిగిన శ్రమవల్ల చెయ్యి నిర్మాణం అభివృద్ధి చెందింది. రకరకాల వస్తువులు పట్టుకునేందుకు బొటనవేలు మిగతా వేళ్ల కన్నా ఎడం అయింది.
స్వేచ్ఛ పొందిన చేతులతో ఆహార సంపాదన ఆత్మరక్షణ చేసుకోగలిగాడు. ఇదంతా 20 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది.మూడు కోట్ల సంవత్సరాల కిందట మొదలైన వానర ప్రస్థానం 20 లక్షల సంవత్సరాలు వచ్చేటప్పటికి మనిషి గా మారి నిటారుగా నిలిచి నడవటం నేర్చాడు. 10 లక్షల సంవత్సరాలు గడిచే టప్పటికి మానవుడిగా రూపాంతరం అయ్యాడు. ఇతనిని పెకింగ్ మాన్ అని కూడా అన్నారు. 2 లక్ష సంవత్సరాల కిందటరెండవ సారి వచ్చిన హిమయుగాన్ని ఆనాటి మనిషి తట్టుకొని నిలబడ్డాడు. గుహల్లో అగ్ని రగిల్చాడు .బల్లెం, బరిశ ,గది లాంటి ఆయుధాలను, రెండు వైపులా మొనదేలిన ఆయుధం మొదలైన వాటిని తయారు చేసుకున్నాడు .జంతువులను మచ్చిక చేసుకున్నాడు నిప్పును తయారు చేయడం నేర్చుకున్న మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. దీంతో మనిషి జంతువులతో వాన రాలతో విడిపడినట్లైంది. ఆనాటి మనిషి అంగ నిర్మాణానికి మన అంగ నిర్మాణానికి చాలా తేడా ఉంది. చిన్న నుదురు చిన్న ముక్కు, చిన్న చెవులు ,వంగిన నడుము, ఎక్కువ రోమాలు ఎత్తుగా పొడుచుకువచ్చినట్లు కనుబొమ్మలు, నాలుగడుగులు ఎత్తు. ఇది ఆదిమానవుని రూపం .అతని మెదడు బరువు నరవానరాలు మెదడు కన్నా పెద్దది. నేటి మనిషి మెదడు కన్నా చిన్నది. ఆధునిక  మానవుని అంగ నిర్మాణం 30000సంవత్సరాల క్రితం ఏర్పడింది .క్రీ.పూ.10000 సంవత్సరాల ప్రాంతంలో  ఒక పెద్ద ప్రేలుడు లాంటిదేదో సంభవించి మంచు యుగానికి ముగింపు పలికిందని  పలువురు శాస్త్రవేత్తలు భావించారు. అంటే మానవుని నాగరికత ప్రారంభమై కేవలం 12000 సంవత్సరాలు మాత్రమే అయింది.
       మనిషి తన ప్రస్థానాన్ని ఆఫ్రికా నుండి ప్రారంభించాడు నాగరికతను తూర్పు దేశాలలో వికసింపజేసినాడు.క్రీస్తుపూర్వం 10 వేల ఏళ్ళనాడే కుక్కల్ని మేకల్ని గొర్రెల్ని మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నాడు జంతువులు చంపడం మానేసి వాటిని పెంచడం ద్వారా ఆహారాన్ని సంపాదించుకోవడం సులభం అని అర్థమైంది. క్రీ.పూ. 5000 నాటికే గుర్రాలను మచ్ఛిక చేసుకున్నాడు
 క్రీస్తు పూర్వం 2000 ప్రాంతంలో మనిషి గుర్రాల స్వారీ చేయడం నేర్చుకున్నాడు మనిషి పనిముట్ల వాడకం నేర్చుకున్నాడు. ఆనాటి పనిముట్లు పదునైన రాళ్లు ,ఎముకలను వాడిగా చెక్కిన కర్రలు. పనిముట్లతో మొట్టమొదటి జరిగిన కార్యక్రమం పోగుచేయడం. పళ్ళు కాయలు, దుంపలు పక్షుల గుడ్లు పోగు  చేసుకుని తినేవారు . మనిషి దీంతో జంతు ప్రపంచం నుంచి వేరు పడ్డాడు.

Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం