ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎందుకని గిడశబారిపోయింది!

ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎందుకని గిడశబారిపోయింది!

ఆర్యభట,భాస్కర,బ్రహ్మగుప్తుడు వీరంతా భారతీయ శాస్త్రవిజ్ఞానాన్ని ఆకాశపు టంచుల వరకు తీసుకెళ్లారు.
■ క్రీస్తుపూర్వం ఈప్రపంచంలో నాలుగు దేశాల నాగరికతలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.
భారతీయ నాగరికత
మెసపటోమియా 
సుమేరియా అంటే పర్షియా
చైనా 
ఇపుడు ఉన్నత స్థాయి ఆర్థికాభివృద్దలో ఉన్న ఇంగ్లాండ్, అమెరికా,జపాన్,జర్మనీ ఇవేవీ సోదిలో లేవు.
మిగతా మూడింటి గురించి ఇక్కడ చర్చ అవసరం లేదు.భారతదేశం ఎంతో ఉన్నతమైన శాస్త్ర పరిజ్ఞానాన్ని మిగతా ప్రపంచానికి అందించింది.అలాంటి భారతదేశం ఎందుకని వెనుక బడిపోయింది. 
వాస్తవాలు చెపితే RSS,హిందు మతోన్మాదులూ,బూతు పురాణం లంకించుకుంటున్నారు.అయినా తప్పదు,వాస్తవాలు మీముందుంచాలి.
■సుశ్రుత ఈ ప్రపంచానికే తొలి ఫిజిషియన్ 
చరకుడు...ఈ ప్రపంచానికే తొలి వైద్యుడు భాస్కరుడు..బీజేపూర్,కర్ణాటకవాసి 12వ శతాబ్దం,గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు, అర్ధమేటిక్,ఆల్జీబ్రా గురించి అలవోకగా వివరించారు.
ఆర్యభట.476 క్రీ శ పాటలిపుత్రం..జీరో ను zero ను ఆవిష్కరించడం ద్వారా ఈ ప్రపంచానికి,గణిత శాస్త్రంలో విప్లవాన్ని చూపించారు.
కణాదుడు..అణు సిద్ధాంత వేత్త, atom గురించి వివరించిన తొలి గ్రీకు శాస్త్రవేత్త డేమోక్రటిస్ కంటే ముందరి వారు.
కపిలుడు 
నాగార్జనడు 
వరహామిహిరుడు ఇలాఎంత మంది గురించి అయినా వివరించాలి.
శాస్త్ర ప్రపంచానికే,దిశానిర్దేశం చేసిన భారతదేశం ఆ తర్వాత వెనకబడి పోయింది.
గిడస బారిపోయింది.
■ఎప్పుడైతే మనుస్మృతి,కుల వ్యవస్థ భారతీయ సంస్కృతి లోనికి ప్రవేశించిందో అక్కడ నుంచి భారతీయ విజ్ఞానం  క్షీణదశ మొదలయింది
■ బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య ఈముగ్గురు మాత్రమే విద్యను అభ్యసించాలి.సమాజంలో నూటికి 80 శాతంగా ఉన్నసూద్రులు,ఈరోజున అగ్రకులస్థులుగా చెప్పుకుంటున్న కాపు,కమ్మ,రెడ్డి,వెలమ వీరు కూడా సూద్రులే.సూద్రులు, దళితులపై భయానక ఆంక్షలు విధించారు.విద్యను,విజ్ఞానాన్ని, పరిసోధనలను,అభ్యసించ రాదు.ఆ విధంగా ఈసమాజం గిడస బారిపోయింది.అత్యధిక శాతం ప్రజలు మనుషులుగానే గుర్తించబడలేదు.
■ఈ పరిస్థితి క్రీస్తు శకం ప్రారంభం నుండి దాదాపు బ్రిటిష్ వారు వచ్చేంత వరకు కొనసాగింది. ఆంగ్లేయులే,వాళ్లకోసమే విద్య రంగం లో సంస్కరణలు ప్రవేశపెట్టి అందరూ చదువుకోవచ్చన్నారు. అంటే దాదాపు 2 వేల సంవత్సరాల పాటు,ఈ కుల వ్యవస్థ వల్ల ఈ దేశం సర్వనాశనం మయింది.
స్వాతంత్రం వచ్చిన తరువాత మాత్రమే,దళితులు విద్యనభ్య సించారు.అంతవరకు వారికి అవకాశమే లేదు
■ఇప్పుడూ ఆ మనుస్మృతినే మరల  అమలులోకి తీసుకు రావడానికి మతోన్మాదులూ ఉవ్విళ్లూరిపోతున్నారు.
భారతీయ ప్రజానీకం  అందరూ శాస్త్ర విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. దళితులూ సూద్రులూ సహా.అప్పుడే ఈ దేశం ముందుకు వేగంగా ముందుకు పోగలదు....
Please share..
దువ్వ శేషబాబ్జి

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata