ప్రాణి ఎలా ఉద్భవించినది?



ప్రాణి ఎలా ఉద్భవించినది? 

ఆకాశంలో, సూర్య చంద్రులు ,భూమి గ్రహాలు నక్షత్రాలు ఎలా వెలిశాయి?

భూమి నందు, నీరు ఎలా వచ్చినది?

భూమి సూర్యుని చుట్టూ, ఎలా తిరుగుతున్నది?

సూర్యుని కేంద్రకంలో ఏమి ఉన్నాయి?

సూర్యుడు, ఎందుకు అగ్నిగోళంగా ఉన్నాడు.? 

సూర్యుడి చుట్టూ గ్రహాలు, యెలా తిరుగుతున్నాయి?

భూమి నందు, ఉన్న మూలకాలు ఎన్ని?

ఈ భూమి మీద మానవుడు ఎలా ఉద్భవించాడు?

ఎన్ని కోట్ల సంవత్సరాల నాడు, భూమి, గ్రహాలు ఏర్పడ్డాయి.?

ఈ ప్రశ్నలన్నింటికి దేవుడు దేవుడు అనే సమాధానం చెబుతారు,  ఆన్నిటికీ ఒక అదృశ్య శక్తి కారణమని, ఊహించి చెబుతారు. స్వర్గ, నరకాలు ఉన్నాయని, పునర్జన్మలు  ఉన్నాయని ఆత్మలు ఉన్నాయని, దేవుడు దేవతలు కలరని, ఊహించి చెబుతారు. కానీ సైంటిస్టులు ఇవి ఎలా ఏర్పడ్డాయి? వాటి వివరాలు అన్నీ, పరిశోధించి, వాస్తవాలు వెల్లడిస్తున్నారు. 

మనము అధునాతన యుగంలో ఏది  నమ్మాలి?
వాస్తవాలని నమ్మాలి కదా. పదమూడు వందల ఎనభై రెండు కోట్ల సంవత్సరాల క్రితం, విశ్వ పదార్థాలు కర్బన వాయువులు, దుమ్ము , దూళీ, నత్రితాలు మొదలగు విశ్వ పదార్థం అంతా, ఒక్కచోట ,ప్రోగైనప్పుడు, బిగ్ బ్యాంగ్ అంటే, మహా విస్పోటనం వల్ల, ద్రవ్యరాశి రూపుదిద్దుకొని, మహాశక్తి,  ఉద్భవించి సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు , ఏర్పడ్డవి. భూమి కూడా, సూర్యుడు నుండి, వచ్చిన ముక్క. విస్ఫోటనం వల్ల,  అత్యంత, వేడిగా నున్న భూమి, చల్లబడి ఆ తర్వాత, తోకచుక్కల వలన,  హైడ్రోజన్ ఆక్సిజన్ ల సమ్మిశ్రమం వల్ల, నీరు ఉత్పన్నమై, పల్లపు ప్రాంతాలన్నీ, ఆక్రమించి, పెద్ద పెద్ద  సముద్రాలు ఏర్పడ్డాయి.

భూమి ఆవిర్భవించిన, 100 కోట్ల సంవత్సరాలకు,  కర్బన రసాయన, పరిణామం వల్ల, జీవ లక్షణాలను, వ్యక్తపరిచ గల, ఏకకణ జీవులు, ఆవిర్భవించి, భూమిపై, వందకోట్ల సంవత్సరాలలో, అనేక జాతులుగా, పరిణామం చెందాయి.
అనంతర, పరిణామాల క్రమంలో, బహుకణ జీవులు, ఆవిర్భవించి, పత్రహరితం, సహాయంతో, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా, ఆహారోత్పత్తి, జరుపుకోవడం వల్ల, ఆక్సిజన్ విడుదల అయింది. ఆక్సిజన్(౦) ౩పరమాణువుల సంయోగం వల్ల(0)3 ఓజోన్ ఉత్పత్తి అయ్యింది.

రెండు వందల కోట్ల సంవత్సరాల,పిదప, సముద్రంలో ఆవిర్భవించిన, మొక్కలు, భూమి మీదకు రావడం, మొదలెట్టాయి. పుష్పించని మొక్కలు, ఆవిర్భవించాయి. 30 40, కోట్ల సంవత్సరాల తర్వాత, మొక్కలు జంతువుల, అవశేషాలు భూమి అడుగు పొరల్లో, పడిపోయాయి. అధిక ఉష్ణోగ్రతకు గురై, బొగ్గు పెట్రోలియం, వాయువులు,  ఉత్పత్తి అయ్యి, భూమి అడుగు పొరల్లో,  నిక్షిప్తంఅయ్యాయి.

మూడు లక్షల సంవత్సరాల క్రితం, కోతి లాంటి జీవి నుండి, పరిణమించాడు మానవుడు. 350 కోట్ల సంవత్సరాల క్రితం, జీవించిన జీవుల వారసుల మే ,మనం. భూమి మీద, జీవోత్పత్తికి మూలం, అప్పటి భూమి మీద గల,  రసాయన మూలకాల, పరమాణువులు, అణువులు, వాటి పరిణామమని గ్రహించాలి.

భూమి యందు 40 డిగ్రీల సెంటి నుండి 50 సెంటి, వరకు, ఉష్ణోగ్రత ఉంటుంది కావున, నీరు సూర్యరశ్మి, ఆక్సిజన్ కర్బన ,వాయువులు ఉన్నందున, భూమియందు, ప్రాణి, ఉద్భవించి కొనసాగుతున్నది.

1859లో, చార్లెస్ డార్విన్ పరిణామ శాస్త్రం , రచించి ప్రపంచంలో ప్రాణి, ఎలా ఉద్భవించి, మానవుడు, ఎలా పరిణామ దశలో, ప్రస్తుత స్థితి కి,  ఎలాచేరుకున్నది,  విశద పరచాడు.

1543 లో, కోపర్నికస్, సూర్యకేంద్ర ,సిద్ధాంతాన్ని,  ప్రతిపాదించాడు. అప్పటివరకూ, భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు గ్రహాలు, నక్షత్రాలు తిరుగుతున్నావని, బైబిల్ ,కురాన్ గ్రంధాలు, విశ్లేషించాయి. మీ భూమి గ్రహాలు సూర్యుని కేంద్రం గా, తిరుగుతున్నావని, కోపర్నికస్, బ్రూనే,  కెప్లర్ లు నిరూపించారు.

1609లో గెలీలియో, ద మెసెంజర్ ఆఫ్ ద స్టార్స్ గ్రంధాన్ని, రచించి టెలిస్కోపును, కనుగొని, మరి నాలుగు, గ్రహాలను, కూడా స్వయంగా కనుగొన్నాడు. చంద్రుడు కూడా భూమి లాంటి  ధేయని అన్నాడు.

సూర్యుని నందు హైడ్రోజన్ ఆక్సిజన్ ల సంయోగం వల్ల  హీలియం ఉత్పత్తి అయినది. సూర్యుని నందు, హీలియం, హైడ్రోజన్ లు ఉన్నవి. 97 శాతం వరకు ఉన్నవి, మిగతా మూడు శాతం, వాయువులు ఉన్నవి.  హీలియం మండే మూల కం. సూర్యుడు, అమిత వేడి తో ఉంటాడు.
సూర్యుని గురుత్వాకర్షణ ల, వల్ల, గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యుని చుట్టూ, తిరుగుతున్న వి.

మహా విస్పోటనం, వల్ల, ఏర్పడిన, పాలపుంతల, లోని గ్రహాలు,  కదలికలవల్ల , గుండ్రంగా తయారవుతున్నవి. 
1642 లో జన్మించిన ఐజాక్ న్యూటన్,  విశ్వము లోని, ప్రతి వస్తువు మరో వస్తువును, గురుత్వాకర్షణ వల్ల ఆకర్షిస్తుందని  తెలిపాడు.

ఈ సూత్రము, ఆధారంగా రాకెట్లు తయారు చేశారు. విశ్వ పదార్థంలో,  ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు,  ప్రోటాన్లు, శకలాలు ,మూలకాలు,  200పైగా, యు నటుల శాస్త్రవేత్తలు, గుర్తించారు. మరణం అనివార్యం, మన పూర్వీకులు మరణించాక పోతే, మనం లేము, అని అర్థం. కణాలతో నిర్మించబడిన దేహం, కణాల  నశింపు  వలన, ముసలితనం , ఆ కటమరణం, సంభవిస్తుంది. మెదడు పని చేయని తత్వమే మరణం. ఆకట, ఆత్మలు ఉండవు. స్వర్గం నరకం లు ఊహలె,  పునర్జన్మలసలే ,ఉండవు. అన్ని ఊహలే.

హబుల్ శాస్త్రవేత్త, పెద్ద టెలిస్కోపును తయారు చేసి, ఆ టెలిస్కోప్ సహాయంతో, ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు కనుగొనడం, అయినది. ఏడున్నర కోట్ల సంవత్సరాల క్రితం, వానరాలు, అవతరణతో మానవ కథ ,మొదలై, ఆ తర్వాత, పరిణామంలో, పారాపితికస్,  అనబడే 32 ఏళ్లు కలిగిన జంతువుగా, ఆ తర్వాత,  అవిగో పిదికస్,  అనే నాలుగు కాళ్ల, పైనడిచే కోతి జాతి,జంతువుగా, దాని తర్వాత, ప్రాప్లియోపితికస్,  అనే జాతి, మరికొంత ,మానవ రూపాని కి ,దగ్గరగా, రెండు కాళ్ళ పైనే, నడవగలిగే విధంగా, ఆ తర్వాత, ప్లియోపితికస్, ముఖం చదునుగా ఉండి,  వెనుక దంతాలకు, 5మొనలు  చెట్లపై ఊగే, అనువైన చేతులతో, నిటారైన దేహ నిర్మాణం తో, ఏర్పడిన జంతువు.

ఆ తర్వాతకోటి 30 లక్షల సంవత్సరాలకు, ramapithecus, మొదటిసారిగా, కాళ్లతో నడక ప్రారంభించిందని, తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆస్ట్రలో పితెకస్, లు బ్రతికాయి. అవి భూమిమీదనే బ్రతకాల్సి వచ్చినవి. ఆకాలంలో, పరిస్థితులకనుగుణంగా,  చెట్లునశించి పోవడం వల్ల, భూమి నందే ప్రాకు కుంటూ,  నడుసుకుంటూ, బ్రతికాయి.  అవే రాతి యుగం అయినది అదే  రాతి యుగం అయినది. ఆ తర్వాత పితి కాంత్రోఫస్, గా ఆ తర్వాత నిప్పును కనుగొని, వాడిన హోమో, ఎర్రెక్టిkasulu, ఆ తరువాత వేటాడే, నియాండర్తల్ మానవులు, క్రీస్తుపూర్వం 35 వేల సంవత్సరాలలో జీవించారు. క్రో మాన్యం మానవులు, పాత రాతి యుగానికి చెందిన వారు. వారు వలస వెళ్ళడం ,ప్రారంభించారు. ఆసియా నుండి  ఉత్తరఅమెరికాకు, దక్షిణ అమెరికా కు, వలస వెళ్లి జీవనం ప్రారంభించారు. ఆ తర్వాత,  క్రొత్తరాతి యుగంలో, ప్రకృతిలో దొరికే ఆహారాన్ని, సేకరించి, జీవించారు. ఆ తర్వాత నాగరికంగా జీవించే , పద్ధతులు నేర్చుకుని , జీవించడం ప్రారంభించాడు

ఇవంతా సైంటిస్టులు, సేకరించి, చెప్పిన విధానాలు. మత మౌఢ్యులు, ఏవి కనిపెట్టలేరు, ఊహలు వ్యాప్తం చేస్తారు. ప్రతి దేవుడి మీద ముడిపెడతారు. అందరూ శాస్త్రీయ దృక్పధాన్ని, అలవాటు చేసుకోవాలి. భౌతికమైన వాటిని నిజమైన, వాటినే నమ్మాలి. అబద్ధాలను ఊహలను, భావ వాదాన్ని నమ్మ రాదు. 

-- వినుకొండ మాధవ రాజు, రాయచోటి

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata