పరిణామ వాద సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్
పరిణామ వాద సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్
బ్రిటీష్ జీవపరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ రాబర్ట్ డార్విన్ (ఫిబ్రవరి 12, 1809 – ఏప్రిల్ 19, 1882) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది.
ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందింది అనే విషయముపై పరిశోధనలు చేసి, జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
అతని పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది జీవ పరిణామ సిద్ధాంతం. ప్రకృతిలో జీవజాతులు వేటికవే ఏక కాలంలో రూపొందినట్లు ఎంతో కాలం నుండి నమ్ముతూ వస్తున్న ప్రజానీకానికి - అదంతా వాస్తవం కాదని ఒక మాతృక నుంచి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెంది ఏర్పడతాయని, ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుందని మొట్టమొదటి సారిగా వివరించినవాడు చార్లెస్ డార్విన్ మాత్రమే.
నరవానర పూర్వజీవి నుంచి నరవానరుడు, నరవానరుడి నుంచి నరుడు పరిణామ పరంగా ఉద్భవించాడని తెలిపి సంచలనం రేపిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్.
#విద్యాభ్యాసం
----------------------------
డార్విన్ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో జన్మించాడు. వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా చదువులో రాణించలేదు. అతడొక మందబుద్ధిగా ఉపాధ్యాయులు భావించేవారు.
అతను చిన్ననాటి నుండి కీటకాలను, ఖనిజాలను సేకరిస్తూ రసాయనిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ ఉండేవాడు. 16 యేండ్ల వయస్సులో వైద్య విద్యను చదవటం కోసం ఈయనను ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయంలో చేర్పించారు.
కాని మత్తుమందులు లేకుండా చేస్తున్న ఆపరేషన్లను చూచి, ఆ చిత్రహింసకు ఆయన కలత చెంది వైద్యవిద్యపై మనసు పెట్టి చదవలేక పోయాడు.
ఏదో ఒక డిగ్రీ సంపాదించాలనే తండ్రి కోరికపై కేంబ్రిడ్జ్‌లో తత్త్వశాస్త్ర అధ్యయనంలో చేరినా అక్కడా అంతే.
అక్కడి ప్రొఫెసర్ ఓసారి అతడికి 'బీగల్' అనే ఓ నౌక కెప్టెన్‌కి పరిచయం చేశాడు.
వివిధ దేశాల్లో, దీవుల్లో ఉండే జీవుల పరిశీలనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో డార్విన్ తన తండ్రి వద్దంటున్నా వినకుండా ఆ ఓడ ఎక్కేశాడు.
ఆ నౌకాయానంలో డార్విన్ అనేక ప్రాంతాల్లో మొక్కలు, రాళ్లు, శిలాజాలు, కీటకాలు, జంతువులను పరిశీలించి చాలా నమూనాలను సేకరించి ఇంటికి పంపుతూ వచ్చాడు.
ఆ పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామ క్రమంపై "జాతుల ఉత్పత్తి " అనే పుస్తకాన్ని 1959 లో రాశాడు.
160 సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉంది. జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో సృష్టించలేదని, అవి వివిధ దశల్లో ప్రకృతి వరణం(natural selection) ద్వారా పరిణామం చెందాయని డార్విన్ సిద్ధాంతం చెబుతుంది. ఇది ఇప్పటి మైక్రోబయాలజీ, జెనిటిక్స్, మాలిక్యులర్ బయాలజీలను, శిలాజ శాస్త్రం,పిండోత్పత్తి శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, కణశాస్త్రం,శరీర నిర్మాణ, ధర్మ శాస్త్రాలను సమన్వయ పరచడంలోనూ, డీఎన్‌ఏ పరీక్షల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తోంది.
#డార్వినిజం
--------------
చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం (Darwin's theory of evolution) భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది.
ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది.
మూఢ నమ్మకాలని విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది.
మనిషి కోతిలాంటి పూర్వ జీవి నుంచి వచ్చాడు, మనిషిని దేవుడు సృష్ఠించలేదన్న సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చింది.
ఇప్పుడు కూడా సృష్ఠివాదం పేరుతో డార్వినిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. డార్విన్ జీవ పరిణామ మలేషియా నుంచి రసెల్ వాలేస్ (1823- 1913) అనే వ్యక్తి పంపిన సిద్ధాంత వ్యాసం డార్విన్ వ్యాసం ఒకే విధంగా ఉన్నాయి.
డార్విన్1844లో తన రచనను, వాలేస్ పంపిన వ్యాసాన్ని లియన్ సొసైటీ జర్నల్‌కు అందచేశాడు.
1858 జూలై 15న శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. ఇరువురి వ్యాసాలు పరిశీలించారు. 1844లో డార్విన్ మొదలు పెట్టగా, వాలేస్ 1858లో రాశాడు. కనుక డార్విన్ ముందు రాసినట్టు నిర్ధారించారు.
#ప్రకృతివరణవాదం
-----------------------------
1831 లో విజ్ఞాన శాస్త్ర పరిశోధనల నిమిత్తం యురోపియన్ దేశాలను చుట్టిరావటానికి బయలు దేరిన బీగల్ సముద్ర నౌకలో నేచురలిస్ట్ గా ప్రయాణం చేసే అవకాశం డార్విన్ కి లభించింది. ఈ అవకాశం ఆయన పాలిట సువర్ణావకాశమై గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణకు ఆధారభూతమైనది. అయిదేళ్ళపాటు కొనసాగిన యీ సముద్ర యానంలో డార్విన్ ఎన్నో రకాల ప్రదేశాలను, జంతువులను దర్శించాడు. ప్రకృతికి, జీవరాశికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి తీవ్రంగా ఆలోచించాడు.
ఈ ఆలోచన ఫలితమే ప్రకృతి వరణ ద్వారా నూతన జీవజాతులు వచ్చాయనే జీవపరిణామ వాదంగా (నేచురల్ సెలక్షన్ థీరీ) గా పరిణమించింది.
#వివరణ
-----------
ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటినుంచీ లేవనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రధానమైన వాదన.
కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివనీ, పిల్లులూ, చిరతపులులూ, పెద్ద పులులూ, సింహాలూ మరొక జాతికి చెందినవనీ, గుర్రాలూ, గాడిదలూ, జీబ్రాలూ ఒకలాంటివే.
గతంలో వీటికి తలొక "పూర్వీకుడూ" ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ "ఆదిమ" శునకానికీ, మార్జాలానికీ, అశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది.
ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలూ, పక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది.
వీటిలో కొన్ని శాకాహారులుగానూ, మరికొన్ని మాంసాహారులుగానూ రూపొందడానికి భౌతిక ప్రేరణలూ, పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఇన్నిరకాల ప్రాణులు "వాటంతట అవే" ఎలా ఉద్భవిస్తాయని వీరి వాదన సాగిపోతుంది.
ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవజాతి క్రమంగా ఉత్తరదిశగానూ, తక్కిన ప్రాంతాలకీ విస్తరించిందని శాస్త్రవేత్తలు జన్యుపరిశోధనల ద్వారా రుజువులు చూపుతున్నారు. ఉష్ణోగ్రత దృష్య్టా తొలిమానవులు నల్లని రంగులో ఉండి ఉంటారని అనుకోవచ్చు. ఉత్తరాన ఎండపొడ తక్కువగా పడే ప్రాంతాలకు వెళ్ళినవారి చర్మం తెల్లగా మారక తప్పలేదు. పూర్తిగా నల్లరంగులో ఉన్న ఒక మానవసమూహం తెల్లగా మారిపోవడానికి 20 వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా.
తక్కిన జంతువుల సంగతి ఎలా ఉన్నా, ఒక్క మనిషిజాతినే తీసుకుంటే, చర్మం రంగూ, ముఖకవళికలూ అన్నీ కాస్తకాస్తగా మారడానికి జీవపరిణామ ప్రక్రియలే కారణమని రుజువు అవుతోం ది.
#పరిశోధనలు
-----------------
సరిగ్గా ఈ సమయంలోనే ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ అనే మరో శాస్త్రవేత్త కూడా డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్నే వెలువరించాడు. డార్విన్ కు ఉత్తరం కూడా రాసాడు. 1858 లో వీరిద్దరూ సంయుక్తంగా ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు కూడా! 1859 లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన "ది ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ ఆఫ్ నేచురల్ సెలక్షన్" పుస్తకాన్ని చార్లెస్ డార్విన్ వెలువరించాడు. ఈ పుస్తకం విడుదలైన రోజునే ఆన్ని ప్రతులూ అమ్ముడు పోయి సరికొత్త రికార్డును సృష్టించింది.
#పరిణామసిద్ధాంతం
-------------------------
జీవజాతుల మధ్య సంఘర్షణ ఉంటుంది. సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణ, ప్రకృతిలో సంఘర్షణ. ఈ సంఘర్షణలో నెగ్గినవే ప్రకృతి ఎన్నిక చేసిన సార్థకమ జీవులు. ఇవే మనుగడను సాగిస్తాయి. ఈ జీవులలోని వైవిధ్యాలే తరాలు మారుతూ పోగా కొత్త జాతుల ఉత్పన్నానికి మూలాధారాలు అవుతాయి.
ఇది సంక్షిప్తంగా డార్విన్ పరిణామ వాదం.
అయితే సృష్టి సిద్ధాంత వాదులు ఈయన వాదనను సమర్థించరు. అయితే బైబిల్ లో చెప్పినట్లు ఏడు రోజుల లోనే సమస్త సృష్టి, సకల జీవ జలాలు రూపొందించబడినాయని చెబితే మాత్రం నమ్మడం కష్టం.
#ప్రశంసలు
-------------
చార్లెస్ డార్విన్ స్వంత దేశమైన బ్రిటన్ లో డార్వినిజం ఎన్నో ప్రశంశలు అందుకుంది. డార్వినిజం ప్రపంచంలో ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలని, జీవ శాస్త్రవేత్తలని ప్రభావితం చేసి అధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది.
#రచనలు
------------
1868 లో డార్విన్ "ది వారియేషన్ ఆఫ్ ఆనిమల్స్ అండ్ ప్లాంట్స్ అండర్ డొమెస్టికేషన్" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. "ఇంసెక్టివోరస్ ప్లాంట్స్" "డీసెంట్ ఆఫ్ మ్యాన్", "ది ఫార్మేషన్ ఆఫ్ గజిటబుల్ మౌల్డ్ థ్రూ ది ఏక్షన్ ఆఫ్ వర్మ్స్" వంటి వి ఈయన రాసిన మరికొన్ని పుస్తకాలు.
#అస్తమయం
----------------
ఈయన 74 యేండ్ల వయస్సులో చనిపోయారు.
సర్ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గరే ఈయన కూడా సమాధి చేయబడటం కాకతాళీయం. డార్విన్ ఈనాడు లేకపోయినా ఆయన ప్రతిపాదించిన ప్రకృతి వరణసిద్దాంతం నిలిచే ఉంటుంది.
.
Comments
Post a Comment