దేశాన్ని ఎదగనీయకుండా వెనక్కి లాగుతున్న పంచ భూతాలు

 దేశాన్ని ఎదగనీయకుండా వెనక్కి లాగుతున్న పంచ భూతాలు

1) *కులం* :
ఇది ఈ విశ్వంలో ఎక్కడా లేని, కనబడని
వింత డేంజర్ కాన్సెప్ట్. దీని బేసిక్ ప్రిన్సిపుల్ మనిషిని మనిషిగా చూడకూడదు. మనుషులను ఐదు జాతులుగా విడగొట్టి హింసించే నిచ్చెనమెట్ల వ్యవస్థ ఇది. మన దేశం ఎదగకపోడానికి, ఎదుగుదల ఆగిపోడానికి, వెనుకబాటు తనానికి 99 శాతం ప్రధాన కారణమిదే. దీన్నొక్క దాన్ని రూపుమాపితే, మిగతా రోగాలన్నీ వాటికవే నయమవుతాయి.

2) *వాస్తు* :
ఇదో కామెడీ కాన్సెఫ్టు కష్టపడి కట్టుకున్న
ఇంటిలో, ఆ మూలన ఇది పెట్టు, ఈ మూలన
అది పెట్టకు, ఈ దిక్కున ఇది కట్టు, ఆదిక్కున ఇది కట్టకని చెప్పి, ఒక వేళ అలా గాని చెయ్యకపోతే, కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలు,మన దేశంలోని మనుషుల్లో,  కొన్ని ప్రత్యేక మతస్తులను మాత్రమే పసిగట్టి, పగబట్టి వేధించి, వార్నింగ్ లిచ్చి, వాటి కిరణాలను పంపించి నష్టం చేస్తా యంటా. అక్కడితో ఆగదు ఈ శాస్త్రం. ఈ గ్రహాల రివెంజ్ కి విరుగుడు కూడా తగలబడింది. ఒక్క 2000-/ కొడితే, ఇక్కడ నుంచే మన వాస్తు విద్వాంసులు, ఆ గ్రహాల ఆగ్రహాన్ని చల్లార్చి పడేస్తారు. ఆ దెబ్బతో జీవితం మారి పోతుందంటారు.

3) *జ్యోతిష్యం* :
తమ జీవితాన్ని మార్చుకోలేని కొంత మంది, ఎదుటివారి జీవితాల్లో మాత్రం ఏమి జరుగుతాయో, ఏమి జరగవో, ఎవరు
PM కుర్చీ ఎక్కుతారో, ఎవరు CM కుర్చీ దిగుతారో, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు
చావొస్తుందో, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు రోగం వస్తుందోనని, 1000/- కొడితే, ఠకీ ఠకీ మని చెప్పేస్తారు.

4) *న్యూమరాలజీ* :
ఎంతో అల్లారు ముద్దుగా, కన్న బిడ్డలకి పేర్లు పెట్టుకుంటే,
ఒకరొచ్చి అది ఏ భాషలో పేరైనా సరే,
ఇంగ్లీష్ లోనే వ్రాయిస్తూ, అమ్మ నాన్న పెట్టిన
పేరుకి ఫలానా అక్షరం తీసేసి, ఫలానా అక్షరం జాయింట్ చేసి, 5000/- ఫీజు తీసుకొని,
కోటి సార్లు రాస్తే, కింగవుతావు అంటాడు.

5) *మూఢనమ్మకాలు* :
ఇక వీటి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. టైమ్ చాలదు. ఆల్రెడీ ఈ విషయంలో పాలపుంత రికార్డులు భారత్ బద్దలు గొట్టేసింది. ఒకటా రెండా ఈ మూఢనమ్మకాలు. గోవా బీచ్లో ఇసుక రేణువులన్ని తగలబడ్డాయి. పిల్లి ఎదురొచ్చినా అశుభమే. బల్లి బాడీ మీద పడ్డా అపచారమె. తుమ్ము తుమ్మినా ప్రళయమే. మంగళవారం మహా చెడ్డది. అమావాస్య రోజు కొత్త పని మొదలెడితే మొగుడు లాగి తన్నేస్తాడు. గ్రహణం రోజు బైట పాస్ కి పొతే ప్రాణాలకి ముప్పు, మొగుడు పోయిన ఆడ మనిషి ఎదురైతే అష్ట దరిద్రాచేతబడి చిల్లంగి, తిరుగుబడి బాణామతి, జోగిని మాతంగి లాంటి బంపరాఫర్లు ఎన్నెన్నో, చెప్పాలంటే చినిగి చాటవుతుంది...

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata