దేవునికి నైవేద్యం ఎందుకు
కూడు తినని దేవునికి నైవేద్యం ఎందుకు??
చెమట పట్టని దేవునికి స్నానం ఎందుకు??
కాపురం చేయని దేవునికి కళ్యాణం ఎందుకు?
ఎండ, వాన, చలి స్పర్శ తెలియని దేవునికి నివాసం ఎందుకు??
పని చేయని దేవునికి పట్టు వస్త్రాలు, నగలు ఎందుకు...!!!
బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో
రాళ్లకు పాలిచ్చు కథ నశించునదెన్నడో ?
పేడకు బొట్టు పెట్టి దేవుడని పూజించువారు
పేదను గుర్తించగ మారబోవుదెన్నడో??
ఎప్పుడొచ్చునో దేశానికి చైతన్యం??
అది తెచ్చుట కదా మన కర్తవ్యం..!!!
--ముత్తువెల్ కరుణానిధి...!!
Comments
Post a Comment