" చరిత్ర చదవని వాడు మరో చరిత్ర ను నిర్మించలేడు "
" చరిత్ర చదవని వాడు మరో చరిత్ర ను నిర్మించలేడు "
మన మూలాలను మర్చిపోయి వైదిక భావన ఇచ్చిన పండుగల , పబ్బాల వెంట పరుగులు తీస్తున్నాం . ఈ దేశపు ఆదిమ జాతులమై ఉండి కూడా అవిద్యా , అజ్ఞానాల తో ప"రాయిని" ఆశ్రయించి మన ఆలోచనలకు సమాధి కట్టేసుకుంటున్నాం .
ఈ రోజు వినాయక చవితి .పార్వతీ తనయుడు (నలుగుపిండి తో సృష్టించబడిన ) మన దేశపు సనాతన పశుపతి / శివుడి మీదా లేదా శైవం మీద జరిగిన వైదిక దాడే ఈ వినాయక సృష్టి . " శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు " అనే నానుడి ని ఒక వైపు ప్రచారం చేస్తూ ....
మరో వంక - తన భార్య స్నానాల గదిలో ఉన్నట్లు ఎవడో చెప్పాడని , అది నిజమో కాదో తెలుసు కునేందుకు శివుడు ఆదరా బాద రా వచ్చినట్లు , అక్కడ ఒక బాలుడు అడ్డుకున్నట్లు , కోపం తో బాలుడి తల నరికినట్లు , తరువాత పార్వతి జరిగిన విషయం చెప్పి ఏడవడం , ఏనుగు తలను ఏర్పాటు చేయడం .సర్వజ్ఞ ఐన శివునికి మానవ బలహీనతలను అంటగట్టటం దాడి కాక మరేమౌతుంది ❓
పురాణాల ప్రకారం చూచినా , అంబేడ్కర్ గారి రచనల్లో వివరణ లు చూచినా ....
దేవుళ్ళు అనే భావనను పుట్టించిన వారే కాలక్రమంలో అదే దేవుళ్ళ పై బూతు బురదను జల్లి కొత్త దేవుళ్ళకు రూపకల్పన చేశారు .
ఈ రోజు హిందూ దేవుళ్ళను విమర్శిస్తున్నారంటూ ఇతర మతాల వారిపై దాడులు జరుగుచున్నాయి .మరి ఉపనిషత్తుల్లో , పురాణాల్లో దేవుళ్ళ పై బురద జల్లిన ఆర్య ఋషులది ఏ మతం ❓
అన్ని మతాల్లో దేవుళ్ళ చుట్టూ మితిమీరిన శృంగార కథలు ప్రదక్షణ చేస్తూ ఉంటాయి . ఇవి అన్నీ కూడా మత పెద్దలు / ఆర్య ఋషుల బూతు దాహానికి చేరపలేని గుర్తులు .అందుకే మతాలు అనే భావన పుట్టాక పరస్పర వాగ్వివాదాలు పెరిగి మరణహోమానికి దారితీస్తున్నాయి .ఎందుకంటే , మనదైతే సంసారం . వేరే మతానిది ఐతే వ్యభిచారం కదా ❓
BC 6 వ శ ౹౹ నికి వెళితే వైదిక/ ఆర్య , బౌద్ధ, జైన మతాల తో పాటు దాదాపుగా 64 మతాలు ఉన్నట్లు తెలుస్తుంది .మన దేశంలో , చుట్టు ప్రక్కల దేశాల్లో BC కాలం నాటి వైదిక దేవుళ్ళ విగ్రహాలు , గుడులు త్రవ్వకాల్లో బయటపడుతున్నాయి . కానీ , " సింధూ నాగరికతా " కాలం కంటే ముందు వైదిక దేవుళ్ళ ఉనికి ( చరిత్ర ప్రకారం ) మరే ఇతర ప్రపంచ దేవుళ్ళ ఉనికి ఉన్నట్లు లేదు .
😫 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చరిత్రలను , దాని నాగరికత లను సమాధి చేయడానికే - మతాలు , మత గ్రంధాలు పుట్టుకొచ్చాయి .
ఇక సింధూ నాగరికతా కాలం లో - అమ్మ తల్లి , పశుపతి /శివుడు , లింగాలు మాత్రమే గౌరవించబడినట్లు / పూజించబడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి . అంతేగాని , శివుడి వారసులుగా చెప్పబడుచున్న " గణపతి , షణ్ముఖ ,అయ్యప్పలకు సింధూ కాలం లో చోటు లేదు .
నలుగుపిండి నుండి - గణపతి /వినాయకుడు .
2. విరహం తో తపిస్తున్న ఋషి భార్యలను చూచి శివుడు వీర్యం కార్చుకోవడం , అది ఒక రెల్లు పొదలో పడటం , ఆ పొదనుండి షణ్ముఖ జననం .
3. మోహినీ (విష్టు) ని చూచి శివుడు మోహించి కలవడం వల్ల అయ్యప్ప జనం అని పురాణాల ఉవాచ .
# మనం ఆలోచించని విషయం ఏమిటంటే ....
ప్రపంచ వ్యాప్తంగా అన్ని మత గ్రంధాల ప్రకారం - వాళ్ళ దేవుళ్ళే ఈ సృష్టి/ ప్రకృతి ని సృష్టించాడని నమ్ముతూ , నమ్మిస్తూ ఉంటారు . కానీ , వాళ్ళ దేవుడు మాత్రం సృష్టి ధర్మం ప్రకారం పుట్టడు . అక్రమంగా పుడతాడు . కొందరిని అక్రమంగా పుట్టిస్తాడు .
BC 6 వ శ౹౹ నాటి 16 మహాజనపదాలు మనకు తెలుసు .వాటిల్లో 1.వజ్జి , 2. మల్ల అనే జనపదాలు పూర్తిగా గణరాజ్యాలు లేదా గణతంత్ర రాజ్యాలు .
వజ్జి అనేది 8 తెగల సమూహపు గణరాజ్యం .
మల్ల అనేది 9 తెగల సమూహపు గణరాజ్యం .
అంటే ఈ 8 / 9 తెగల మధ్య అధికార మార్పిడి జరుగుచు పరస్పరం సహకరించుకుంటు పాలన జరిగేది .అలాగే నాయకత్వం మారినప్పుడల్లా పాలనా రాజధాని మారి అన్ని ప్రాంతాల , తెగల అభివృద్ధి జరుగుచుండేది .
ఆదిమ సమాజాలలో మొదటిగా ఉన్నది మాతృస్వామ్య వ్యవస్థ మాత్రమే .ఈ మాతృ స్వామ్య పునాధుల పై గణరాజ్యాలు ఏర్పడ్డాయి . ఈ గణ రాజ్యాల్లో " నాయక్ ' తనానికి అందరికీ పోటీ పడే అవకాశం ఉంటుంది . మనమైతే నిసిగ్గుగా ప్రజాస్వామ్యం/ గణతంత్రం అని చెప్పుకుంటు ఆర్థికంగా బలిసిన వారికే ప్రతిసారి అవకాశం ఇస్తున్నాం .పాలిత కులాలు గౌరవాన్ని కోల్పోయి అనేక దాడులకు , అత్యాచారాలకు బలౌతున్నాం .అదే , గణ రాజ్యాల్లో ఐతే ఎప్పుడు ఏ తెగ అధికారానికి వస్తుందో తెలియదు కాబట్టి తెగల మధ్య పరస్పర గౌరవం , సహాయ సహకారాలు ఉండేవి .
గణానికి పెద్దే - నాయకుడు / వి"నాయకుడు"
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
గణాలకు పెద్దే - గణపతి/ గణనాథుడు
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
అనగా , నాయక్ లైనా , గణపతులైనా మనదేశపు మూలవాసులను పాలించిన వారని అర్ధం .
గుంపు నాయకత్వాన్ని సమర్ధవంతంగా నిర్వహించే జంతువు " ఏనుగు "
బౌద్ధం లో విరివిగా కనిపించే జంతువు " ఏనుగు "
మొత్తంగా , గణరాజ్యాలకు - బౌద్ధానికి నలుగుపిండి రాసి ఈనాటి గణపతి ని సృష్టించి గణరాజ్యాలకు , బౌద్ధాని కి చీడ పట్టించి మన దేశ చరిత్రను సర్వనాశనం చేశారు .
కాల క్రమంలో గణరాజ్యాలు , మహాజనపదాలు సిద్ధ సైనిక ( Standing Army State s ) రాజ్యాలుగా రూపాంతరం చెందాయి . పరాన్నభుక్కుల కుతంత్రాలతో , కట్టుకధల తో వారసత్వ రాచరిక మరియు నిరంకుశ వారసత్వ అరాచక రాజ్యాలుగా మారాయి . గణతంత్రాల నాటి పాలక తెగలు - కులాలగా , ఉప కులాలగా విభజించబడి , నిరాయుధులు గా చేయబడి , శాశ్విత పాలితులు గా మార్చబడి గత వైభవాన్ని మనమూ, మన దేశం కోల్పోయింది .
ఒక్కప్పటి దేశ పాలకులం అనే స్పృహ ను కోల్పోవడానికి అందమైన దేవుళ్ళు , వాళ్ళ మహాత్మ్యాలు , వాళ్ళు కు పూజలు , వ్రతాలు , చెక్క భజనలు తెరమీదకు వచ్చాయి .
అలాగే , మూషిక ( ఎలుక )
మహిష ---( దున్నపోతు )
నాగ ----(నాగు పాము ) మొదలగు గుర్తులన్నీ ఒకప్పటి ఈ దేశ పాలకులకు చారిత్రిక ఆనవాళ్లు . వీళ్ళు తమ ఉనికిని కోల్పోయి , మర్చిపోయి , మారిపోయి దేవుళ్ళకు వాహనాలుగా , అభరణాలుగా పురాణికరింప బడ్డారు .
" చరిత్ర తెలియని వాడు మరో చరిత్రను సృష్టించ లేడు " అని అంబేద్కర్ గారు చెప్పిన విషయం మనకు తెలిసిందే .అందుకే మన తెగల చరిత్రలను నిర్మిద్దాం , చదువుదాం , మరో చరిత్రను సృష్టిద్దాం .
Comments
Post a Comment