కొత్త ఎక్సోప్లానెట్ను కనుగొన్న శాస్త్రవేత్తలు


అక్కడ ఏడాదంటే 8 గంటలే



కీల్(యూకే): కొత్త ఎక్సో ప్లానెట్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని పేరు జీజే 367బి. ఇది ఇప్పటివరకు కనిపెట్టిన 5000 ఎక్సో ప్లానెట్లలో తేలికైంది. సౌర కుటుంబాలు ఆవల ఉండే గ్రహాలను ఎక్సో ప్లానెట్స్ అని పిలుస్తారు. ఇవి నక్షత్రాల చుట్టూ పరిభ్రమి స్తాయి. సాధారణంగా సూర్యుడి చుట్టూ తిరగడానికి భూమికి 365 రోజులు పడుతుంది. కొత్తగా కనిపె ట్టిన ఈ గ్రహం మాత్రం తన మాతృ నక్షత్రం చుట్టూ 8 గంటల్లోనే పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది. ఈ లెక్కన అక్కడ సంవత్సరమంటే.. మనకు 8 గంటలేనన్న మాట! అంగారకుడి కంటే ఇది కాస్త పెద్దది. ఉష్ణోగ్రత 1500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ వాతావరణంలో కఠినమైన లోహాలు కూడా ఇట్టే కరిగిపోతాయి. భూమి నుంచి 31 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఈ గ్రహాన్ని క్రిస్టిన్ లామ్ నేతృత్వంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానెటరీ రీసెర్చ్ సెంటర్కు చెందిన 72 మంది శాస్త్రవేత్తల బృందం కనుగొంది. వీరి పరిశోధన పత్రాన్ని 'జర్నల్ సైన్స్' ప్రచురించింది.*

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata