నమ్మకాలు వాస్తవాలు
భూమి చాప లాగా వుంటుందని దానిని చుట్ట వచ్చని బైబిల్ చెప్పింది.కాని భూమి బల్లపరుపు గా చాపలాగా కాకుండా గుండ్రంగా బంతి లాగా ఉందని పరిశోధనల వల్ల తేలింది.
భూమి,సూర్యచంద్రు లను గ్రహాలుగా లెక్కించారు మనదేశ ప్రాచీన శాస్త్రవేత్తలు.దానికి ఎల్లలు న్నాయని,వాస్తు శాస్త్రం చెబుతుంది. కానీ చంద్రుడు భూమి కి ఉపగ్రహమని తేలింది.
రాహువు , కేతువు భూమి ని మింగడానికి రావటం వల్ల గ్రహణాలు వస్తాయని మనదేశంలో ప్రాచీనులు చెప్పినారని నమ్ముతారు. కానీ భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డుగా రావడం వలన గ్రహణాలు వస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ ఈ రోజుకూ సూర్య చంద్ర గ్రహణాలగురించీ వాటి పట్ల అపోహల గురించి ప్రచారం చేస్తూనే ఉన్నారు.
సూర్యుడు తూర్పున ఉదయిండం,అస్తమించడం వాస్తవంలో జరగదు.మనకు అలా కనిపిస్తుందంతే. కనిపించేదంతా నిజం కాదంటే ఇదే. భూభ్రమణం కారణంగా అలా కనిపిస్తుంది. అంతే.
మనిషి పుట్టుక,మరణం గురించి తెలియని రోజుల్లో
భగవంతుడు మనుషులను, ప్రకృతిని సృష్టించాడని భావించాడు.అవన్నీ ఆయామతాల్లో రకరకాలుగా చెప్పుకున్నారు.కానీ వివిధ పరిశోధనల తరువాత మనిషి పరిణామక్రమంలో
ఒకానొక కోతి జాతి నుండి వచ్చాడని నిర్థారణ అయ్యింది.
భూమి పుట్టి ఇప్పటికీ వేల సంవత్సరా లే అయిందని కొన్ని మతాలు చెప్పాయి. బైబిల్ మరియు ఖురాన్ లోని కథలని బట్టి భూమి క్రీ.పూ. 4004 లో పుట్టిందని ఒకప్పుడు మత పెద్దలు చెప్పారు. కాని భూమి పుట్టి ఇప్పటికి 450 కోట్ల సంవత్సరాలవుతోందని తేలింది.
విశ్వాన్ని భగవంతుడు సృష్టించాడని భావించారు ప్రాచీన కాలంలో.మనిషి సృష్టించిన అద్భుతాలలో అంత్యంత అద్భుతమైనది
దేవుడని నోబుల్ బహుమతి గ్రహీత చంద్రశేఖర్ అన్నాడు. కాని విశ్వం అనంతం అని, అది ఒక సూక్ష్మ అణువు మహా విస్పోటనం ద్వారా విశ్వం ఏర్పడిందని ఊహించారు.అది వాస్తవమని తరువాత పరిశోధనల్లో కనుగొన్నారు.విశ్వం ఏర్పడి13.7 బిలియన్ల సంవత్సరా లైందని తేలింది.
నోవా కాలం లో ప్రళయం రావడంతో భూమి
మునిగిపోతుందని మతం చెబుతుంది. మన మృత్స్య పురాణం లో కూడా ఇలాంటి కథ వుంది. బైబిల్ కూడా ఇలాంటి కథనాలుచెప్పింది. అన్ని కాలాల శిలాజాలాలను పరిశీలిస్తున్నా అంత పెద్ద ప్రళయానికి సంబంధించిన ఒక్క శిలాజం(fosil) కూడా ఇప్పటికీ దొరకలేదు. భవిష్యత్తులో భూమి అంతమయ్యే సూచనలు ఏమీ లేవని తెలుసు కున్నారు. 2000లో అంతం భూమి అవుతుందని వేదవ్యాస (ఐఎఎస్),రాసింది వాస్తవం కాదని తేలిపోయింది.2012లో బైబిల్ విశ్వాసుల ప్రకారం భూమి అంతం కాలేదు.
పిల్లలు ఎలా పుడతారో నేడు అందరికీ తెలుసు.ప్రాచీనగాథల్లో కేవలం కుండ నుంచి,యజ్ఞం నుంచి పుట్టినట్లు కథలు రాశారు.
యజ్ఞం జరిపేటప్పుడు ఎవరి బిడ్డ నో తన బిడ్డ లాగా ప్రకటించుకున్నారు. దానిని యజ్ఞం నుంచి పుట్టినట్లు కవులు రాశారు. అలాగే కుండను గుర్తుగా గల గణం చెందిన పిల్లలను కుండ నుంచి పుట్టినట్లు కవులు రాశారు.
క్రీస్తు జన్మ కూడా ఇలాంటి పుక్కిటి పురాణమే. క్రీస్తు తల్లి మేరీకీ, జోసెఫ్ కు పెళ్లి నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాతే మేరీ గర్భం దాలుస్తుంది. అలా వారిద్దరూ క్రీస్తు తల్లి దండ్రులయ్యారు. దీన్ని ఆనాటి రచయిత క్రీస్తు ను దేవుని ద్వారా పుట్టాడని చెప్పాడు.కర్ణుడు, హనుమంతులపుట్టుక కథలన్నీ ఇలాంటివాస్తవ దూర కథలే. అలాగే ఖురాన్ లో మనిషిని అల్లా సృష్టించాడని,ఆమనిషి పక్కటెముక నుంచి స్త్రీ ని సృష్టించాడని ఖురాన్ రచయిత రాశాడు. ఇవన్నీ వాస్తవం కాదని తేలింది.కానీ వాటినీ ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు.కాని అవన్నీ తప్పని అండం,వీర్యం ఫలదీకరణంచెందడం ద్వారా జీవం ఏర్పడుతుందని నిర్థారించారు.
భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని , భూమి తర్వాతే సూర్యుడు పుట్టాడని ఖురాన్ చెపుతుంది. కాని ఇది తప్పని నేడు స్పష్టంగా తెలుసు. భూమి పైన సప్త ఆకాశాలు ఉన్నాయని(ఖురాన్ 23:17) , భూమి కింద కూడా ఏడు లోకాలున్నాయని (హిందూ పురాణాలూ) మతాలు చెపుతున్నాయి. కాని ఆకాశమంటూ ప్రత్యేకంగా ఏది లేదని అది శూన్యమని, సూర్యకిరణాల వక్రీభవనం వల్లనే అది నీలం రంగులో కనిపిస్తుందని నోబుల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ కనుగొన్నారు.
భూమి కి ఆధారంగా స్తంబా లున్నాయని మతవిశ్వాసాలు చెప్పాయి. కానీ భూమి, విశ్వం లో గురుత్వాకర్షణ శక్తితో ఏ ఆధారం లేకుండా భ్రమణం చెందుతోందని కనుగొన్నారు.
అయినప్పటికీ భూమి నిలకడగా ఉంటుందని, భూమి ఒకప్పుడు సముద్రం లో తేలియాడేదని , ఇంకా,ఇలా ఎన్నో కల్పనలను , కథలను మతగ్రంథాలు చెబుతున్నాయి. వీటిని విశ్వాసం పేరుతో కొంతమంది ఈనాడు కూడా నమ్ముతున్నారు.
పిళ్లా కుమారస్వామి,9490122229
పాము పాలు తాగుతుందా ?
ఈ విషయం గురించి మనం చర్చిస్తే
చాలా మంది హిందువులు
హిందువుల పండుగలు గురించి మాత్రమే ఎందుకు చర్చిస్తారు అనే వాదన వస్తుంది .
ఇక్కడ చర్చ
పాము పాలు తాగుతుందా? లేదా ? అనేది
అంతేగాని ఇది ఓ మతానికి సంబంధించినది గా చూడకూడదు .
మన దేశంలో అనేక శతాబ్దాలుగా
వివిధ సంప్రదాయాలు కొనసాగుతున్నాయి.
ఈ సంప్రదాయాలలో ప్రజలు పాములకు పాలు తాగించే సంప్రదాయం కూడా ఉంది.
అయితే నిజంగానే పాములు పాలు తాగుతాయా..
ఇది తప్పు అని చాలా కొద్ది మందికి తెలుసు.
చాలామంది పాముకు పాలు పోయడం ధర్మంగా భావిస్తారు
కానీ ఇది సరైన పద్దతి కాదు.
పాలు తాగడం వల్ల పాములు చనిపోతాయి . దాని వెనుక శాస్త్రీయ కారణం ఉంది.
పాములు మాంసాహారులు..
పాములు మాంసాహార జీవులు.
అవి ఆహారంగా కప్పలు, ఎలుకలు, పక్షులు, బల్లులు, ఇతర చిన్న పాములు మొదలైనవి తింటాయి.
పాములు పాలు తాగడం పూర్తిగా తప్పు.
నిజం ఏమిటంటే పాములు పాలు తాగవు. తాగడానికి ఇష్టపడవు కూడా.
అదేవిధంగా క్రైస్తవుల మత గ్రంథమైన బైబిల్ లో
వారి దేవుడైన యెహోవా
పాముని శపిస్తాడు .
ఏమని శాపం ఇస్తాడు అంటే
నువ్వు బ్రతుకు దినములు అంతా పొట్టతో పాకుతూ
మన్ను తిందువు అని.
ఇది పూర్తిగా శాస్త్ర విరుద్ధం .
కాబట్టి బైబిల్లో రాయబడిన మాట అబద్ధం .
పాము మన్ను ఒక్కటే తినదు
పాము మాంసాహారి .
పాలు అరిగించుకునే జీర్ణశక్తి పాముకి లేదు .
మనుషులలో కూడా 10 సంవత్సరాల వయసు వరకు మాత్రమే
పాలను అరిగించుకునే ఎంజైములు రిలీజ్ అవుతాయి .
ఆ తర్వాత అవి రిలీజ్ కావు
కాబట్టి పెద్ద వయసున్న మనుషులు కూడా పాలను అరిగించుకోలేరు .
పాము పాలను అరిగించుకోలేదు
కాబట్టి
ఆ పాల యొక్క ప్రభావం
దాని ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది .
తద్వారా పాము మరణిస్తుంది .
భూమిపై మానవుడు నడయాడటం ప్రారంభించిన నాటి నుండి "రేపు" అనే భవిష్యత్తులోకి తొంగిచూడక తప్పలేదు. ప్రకృతిని గూర్చిన అజ్ఞానం, భయం, మానవుణ్ణి అతీత భావాలకు గురిచేసిన మాట వాస్తవం. అవన్నీ కేవలం నమ్మకాలే తప్ప నిజాలు కావు.
మనిషి భవిష్యత్తును - భావిజీవితాన్ని నిర్దేశించేది జ్యోతిషం ఒక్కటే కాదు, ఇంకా చాలా వున్నాయి. హస్త సాముద్రికం - చేతిలోని గీతల బట్టి మానవుడి భావిజీవితం నిర్ణయం అవుతుందట.
వాస్తు - మనిషి తానుకట్టుకొన్న యింటిని బట్టి తన మనుగడ వుంటుందంటూ ప్రచారం చేస్తారు.
పూర్వ - తాను పూర్వజన్మలో చేసిన కార్యాల్ని బట్టి మనిషి భావి జీవితం ఆధారపడి వుంటుందట.
లలాటరేఖ "నుదుటన్ వ్రాసిన వ్రాతకన్న కలదే వేయేండ్లు చింతించినన్" అని అన్నాడు. ఒక కవి. "లలాటరేఖన పునఃప్రయాతి" నుదుట బ్రహ్మరాసిన రాతకు తిరుగులేదంటారు. మనిషి భవిష్యత్తు విధివ్రాతపైనే ఆధారపడి వుంటుందంటారు.
మానవుడు భూమి మీద ఆవిర్భవించి 2 లక్షల
సంవత్సరాలు మాత్రమేనని శిలాజ ఆధారాలు
తెలుపుతున్నాయి.
భాష నేర్చి 50 వేల సంవత్సరాలే.
వ్యవసాయం చేయడం మొదలు పెట్టి 10000
సంవత్సరాలే
అందువల్ల, కృత, త్రేత, ద్వాపర, కలి
యుగాల
కాలమానాలు కల్పితాలే.
తలమీదుగా తీతువుపిట్ట అరుస్తూ పోతే బెదిరిపోతూ ఉంటారు, కొందరు. గ్రహణంపడితే ఆత్మబంధువు లెవరో పోయినట్లు స్నానాలు చేస్తూ ఉంటారు, మురి కొందరు ఆకాశాన తోకచుక్క కనబడితే పెద్ద ఘటాలకు ఋణం తీరిపోయిందని గాభరాపడుతూ ఉంటారు, ఇంకా కొందరు ఇటువంటి నమ్మకాలతో కూడుకున్న భయాలూ, వాటిచుట్టూ సాలెగూళ్ళల్లాంటి కథలూ ఇంచుమించు అన్ని జాతులలోనూ కనిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒకరోజున ప్రళయం విరుచుకు వచ్చి జీవరాసులన్నీ తుడిచి పెట్టుకుపోతాయనే నమ్మిక మానవజాతి చరిత్రలో తఱుచు కానవస్తూనే ఉంది. ఆ ప్రళయం ఏ స్వరూపంలో ఎప్పుడు వస్తుందనే విషయం మీద వాళ్ళ వాళ్ళ ఊహాశక్తులను బట్టి చిత్ర విచిత్రమైన ఊహాగానాలు చేశారు. సామాన్య ప్రజల మనస్సుల మీద వాటి ప్రభావం అంతా ఇంతా కాదు వాటిని అక్షరళ:నమ్మేవారు ప్రాణభయంతో గజగజలాడేవారు.





Comments
Post a Comment