డా. పి.ఎం. భార్గవ
సైన్సు తెలిసిన శాస్త్రవేత్త డా. పి.ఎం. భార్గవ నాల్గవ వర్ధంతి నేడు
--------------------------------------------------------------------
(ఆత్మలనీ, పరమాత్మలనీ, దేవుళ్ళనీ, దెయ్యాలనీ, బాబాలనీ, స్వాముల్నీ, మంత్రాలనీ, తాయత్తుల్నీ, మహూర్తాలనీ, పూజల్నీ నమ్మే ఫేక్ సైంటిస్టులంతా ఈ నిజమైన సైంటిస్ట్ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.)
డా. పి.యం. భార్గవ
జననం: 22 ఫిబ్రవరి 1928
అస్తమయం: 01 ఆగస్టు 2017 (89 ఏళ్ళ వయస్సు)
జన్మస్థలం: అజ్మీరు (అజయ్ మేరు), రాజస్థాన్
తల్లిదండ్రులు: డా. రామచంద్ర భార్గవ (వైద్యుడు) గాయత్రీ భార్గవ
విద్య: బీసెంట్ థియోసాఫికల్ స్కూల్, వారణాసి, క్వీన్స్ కళాశాల, లక్నో యూనివర్సిటీ
వాక్చాతుర్యంతో మనుషులు అబద్దాలు ప్రచారం చేస్తారేమో గాని సైన్సు భౌతికంగా అనేక రుజువులతో సత్యాన్ని మనముందు నిలబెడుతుంది. సైన్సు వెలుగులో ప్రజలకు సత్యమార్గం చూపించడానికి అహర్నిశలు ప్రయత్నించిన హేతువాది పుష్ప మిత్ర భార్గవ. ఈనాడు పాఠశాలలో విశ్వవిద్యాలయాల్లోనే గాక మేధావుల గొంతుకలను నులమడానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఎండ గట్టిన వాడు భార్గవ.
1944 లో బి.ఎస్సి పట్టా పొంది, 1946 లో సేంద్రీయ రసాయనాల శాస్త్రాల్లో (Organic chemistry) పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 21 ఏళ్ళ చిరుప్రాయంలోనే పిహెచ్.డి పట్టాను లక్నో యూనివర్సిటీ నుండి స్వీకరించాడు. కొంతకాలం ఆయున లక్నో యూనివర్సిటీలో లెక్చరరుగా తర్వాతి కాలంలో ఉస్మానియా యూనిర్సిటీలో లెక్చరర్గా చేరి హైద్రాబాద్లో స్థిరపడ్డాడు. ఆ పైన CSIR లో పరిశోధక విద్యార్థిగా చేరి 23 ఏళ్ళ వయస్సులోనే 14 పరిశోధనా పత్రాలు సమర్పించాడు. 1953లో పోస్ట్ డాక్టోరల్ ఉపకారవేతనం మీద అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో ప్రయోగశాలల్లో కొంత కాలం పరిశోధనలు చేశాడు. కేన్సర్ ఔషధం 5-ప్లోరో యురాసిల్ కనుగొనడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. మూడేళ్ళ తర్వాత యునైటెడ్ క్రింగ్డమ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చిలో కాలం పనిచేసి 1958 లో ఆయన తిరిగి హైద్రాబాదు చేరుకున్నాడు. సైంటిస్తుగా ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (Regional Research Laboratary) లో చేరాడు. ఈ ప్రయోగశాలనే మనం ఈ రోజు భారత రసాయన సాంకేతిక సంస్థగా (Indian Institue of Chemical Technology -IICT) 5 eso62Nyo. 1971-72 లో ఆయన ఇన్స్టిట్యూట్ డూ రేడియం, పారిస్ (ఫాన్సు) లో కొంతకాలం కేన్సర్ పైన పరిశోధనలు చేశాడు.
ఆయనకు కేంద్రప్రభుత్వంలోని వరిసగా ప్రధానులందరితో సన్నిహిత పరిచయం వుంది. 1977లో ఆయన హైద్రాబాదులో కేంద్రీయ కణ మరియు అనుజీవన పరిశోధనాలయం (Center for Cellular and Molecular Biology - CCMB) ని స్థాపించి దానికి వ్యవస్థాపక సంచాలకునిగా పనిచేశాడు. (ఏప్రిల్ 1977 నుండి - ఫిబ్రవరి 1990 వరకు) P-32 న్యూక్లియోటైడ్ అనుమాత్రికలను (molecular segments) తయారు చేయడం కోసం హైద్రాబాదులోనే అణుశక్తి ప్రయోగశాల 'జోనకి’ విభాగాన్ని నెలకొల్పాడు. 'గుహా పరిశోధక మహాసభల” (Guha Research Conferance) ను నిర్వహించాడు. భారత ప్రభుత్వంలో జీవ సాంకేతిక శాస్త్ర (Biotechnology) విభాగాన్ని నెలకొల్పడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. దీనికోసం మాక్స్-ప్లాంక్ జీవ భౌతిక శాస్ర సంస్థ, గోటెన్జెన్ (జర్మనీ) తో కలసి పనిచేశాడు. 2005లో భారత వైద్యపరిశోధక సంస్థ (Indian Councel for Medical Research - ICMR) లో ప్రత్యుత్పత్తి సహాయక సాంకేతికత (Assissted Reproductive Technology – ART) ను వాడే వైద్య విధానాలకోసం మార్గదర్శకాలు రూపొందించాడు. National Knowledge Commission-NKC కి ఉపాధ్యక్షునిగా (2005-2007) పనిచేసిన ఆయన తన భావాలకు విరుద్ధంగా అభిప్రాయాలు వెలిబుచ్చిన ఆ సంస్థ అధ్యక్షుడు శామ్ పిట్రోడాతో విభేదించి రాజీనామా చేశాడు . DNA Finger Printing ఆవిష్కరించి నేర పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చిన వాడు పి.యం భార్గవ.
1975 లో జాతీయ విద్యా పరిశోధనా మరియు శిక్షణా సంస్థ (NCERT) సంచాలకుడైన రయిూస్ అహ్మద్ విద్యార్థుల్లో సైన్స్పట్ల ఆసక్తి రేకెత్తించే విధంగా ఒక సైన్సు ఎక్టిబిషన్ రూపొందించాల్సిందిగా పి యం భార్గవని కోరాడు. హైద్రాబాదులో ప్రస్తుత IICT 53 & Method of Science (శాస్త్రీయ పద్ధతి) అనే సైన్స్ ఎక్టిబిషన్ రూపుదిద్దుకుంది. బాల్ భవన్, ఢిల్లీలో జనవరి-మార్చి 1977లో ప్రారంభించిన ఈ ఎక్టిబిషన్ జనతా ప్రభుత్వంలోని మితవాదులకు కంటగింపుగా తోచింది. 1978లో ఈ ఎక్టిబిషన్ని చడీ చప్పడు లేకుండా కనపడకుండా చేశారు. దానితో రాజధానిలో గగోలు, ఆందోళనలు జరిగి, విషయం న్యాయ స్థానాల వరకు వెళ్ళింది. చివరకు ఈ పరికరాలన్నింటినీ కోర్డు సాయంతో కనుగొన్న తర్వాత ఆ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని కొనుగోలు చేసి హైద్రాబాదుకి తరలించింది. విద్యావిషయిక ఆకర్షణగా వెలుగొందిన ఈ ప్రదర్శన కేంద్ర గ్రంధాలయంలో లక్షలాది విద్యార్థులకు, ప్రజలకు ప్రాథమిక వైజ్ఞానిక అవగాహనను కల్పించింది. కాలక్రమేణా ప్రభుత్వ సాయం అందకపోవడంతో దీనిని బిర్గా సైన్స్ సెంటర్కి తరలించారు. కానీ, ఇది అక్కడ కూడా ఇప్పటి వరకు ప్రదర్శనకు నోచుకోలేదు. ఈ ప్రదర్శనకు సంబంధించిన కథ అంతటినీ బి. ప్రేమానంద్ రచించిన "ఒక కళాత్మక విజ్ఞాన శాస్త్ర నిర్మాణ విధ్వంసం" (Vandalization of a Work of Art and Science) అనే పుస్తకం వివరిస్తుంది.
1963 లో ఆయన సతీష్ ధావన్, అబుర్ రహమాన్తో కలసి శాస్త్రీయ దృక్పథం పెంపుదలకు జాతీయ సంఘాన్ని నెలకొల్పాడు. 1980 రాజారామన్న పి.ఎన్ హక్సర్తో కలసి భార్గవ “శాస్త్రీయ దృక్పథ ప్రకటన” (A Statement on Scientific Temper) తయారు చేశాడు. ఈ నివేదిక భారత సామాజిక వ్యవస్థలో రావలసిన మార్పులను చర్చించింది.
భార్గవ పొందిన దేశ విదేశ అవారులకు లెక్కలేదు. ఫ్రాన్స్ దేశపు ప్రెసిడెంట్ యిచ్చే లీజియన్ డి ఆనర్(1998) అవారు పొందిన ఘనత పియం భార్గవది. భారత ప్రభుత్వం ఆయనను 1986 లో 'పద్మభూషణ్ సత్కరించింది. ఈ మధ్యకాలంలో మతఛాందసత్వం దేశంలో వ్యాపిస్తున్న అసహనంపట్ల ధాబోల్కర్, పన్సారే, కల్బురీ ల హత్యల పట్ల కలత జెందిన భార్గవ ఆ సత్కారాన్ని 2015లో తృణపాయంగా భావించి వాపసు చేసూ తన నిరసనను ప్రకటించాడు. ఆయన ప్రజాపక్షపాతి. ప్రజలను చైతన్యపర్చడంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన సేవాతత్పరుడు. Medically Aware and Responsible Citizens of Hyderabad - MARCH ని స్థాపించి అల్లోపతి మందుల ప్రామాణికత మీద ప్రతినెలా అవగాహన కలిగించేవాడు. జన విజ్ఞాన వేదికకు ఆయన ఆలంబనగా నిలిచి సైన్సు ప్రచార కార్యక్రమంలో 89 సంస్థను ముందుకు నడిపించాడు. చేపమందు అశాస్త్రీయతను ప్రశ్నించి న్యాయస్థానం వరకూ వెళ్ళి అది 'మందు కాదనీ కేవలం "ప్రసాదం" అని ఆ చేపమందు పంపిణీదారులు పలాయనం కావడానికి కారణమయ్యాడు. పాలకులు విశ్వవిద్యాలయాల్లో జ్యోతిశాస్రాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసించాడు. వాస్తు ప్రామాణికతను ప్రశ్నించాడు. సమగ్రమైన చర్చలేకుండా జీవసాంకేతిక మార్పులతో కూరగాయలను మార్కెట్లోకి ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాడు. శ్రీమతి చందనా చక్రబర్తి సహ రచయిత్రిగా ఆయన రచించిన పుస్తకాలు ‘An agenda for The Nation’, ‘Two Faces of Beauty, Science and Art’, ‘Angels, Devils and Science’, ‘The Saga of Indian Science Since Independence in a Nutshell’, ‘Proteins of Seminal Plasma’ (శివాజీ, కార్ల్ హైండా ఫైట్ సహకారంతో) ప్రజా సైన్స్ ఉద్యమానికి బలమైన ఊతమిచ్చాయి.
లౌకికవాద సమాజం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో ప్రజా సైన్సు ప్రచార సంస్థలకు, హేతువాదులకు ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన నుండి నిర్భీతిగా సత్యాన్ని ప్రేమించి దాని కోసం పోరాడే స్పూర్తిని అందరం పొంది శాస్త్రీయ దృక్పథ ప్రచారంలో నిరంతరం పాల్గొనాలి.
( మిత్రులు బెందాలం కృష్ణారావుకు కృతజ్ఞతలతో )
Comments
Post a Comment