అబ్రహామ్ టి. కోవూర్


అబ్రహామ్ టి. కోవూర్
       _ సుజరె.

మహిషులు మంత్ర తంత్రాలు దోపిడికి ప్రత్యక్ష సంకేతాలు, మూఢ నమ్మకాలు, మానవుని మానసిక బలహీనతలకు చిహ్నాలు. మూఢనమ్మకాలకు లోనై మెదడు మొద్దుబారి పోతుంది. జీవితమంతా అధోగతి పాలవుతుంది. మారి దు: మహిమలు సర్వ సాధారణంగా మనిషిని బలహీనవరిచే విషయాలు.

అసలు మహిమలు, మహత్యాలు అనే విషయాలు కల్పితాలు విషయాలు, యుక్తులు మన పంచేంద్రియాలను భ్రమింపజేసే సమ్మోహన విద్యలు మాత్రమే. హస్త లాఘవానికి, సమ్మోహన (హిప్పోటిజం) విద్యకు సంబంధించినవే మహిమలు

పి.సి. సర్కార్ (బెంగాల్), (ప్రేమానంద్ (తమిళనాడు) కేస్బురాం ( ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బంద్రజాలికులు, మహిమలు, అతీంద్రీయ శక్తులు ఉన్నాయని చాటుకొనే వాళ్ళని సవాల్ చేసి ఎండగట్టుతున్నారు.

అలాంటి వారిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ హేతువాది, పరిశోధకుడు,

బహుముఖ ప్రజ్ఞాశాలి క్రీ.శే. డా. అబ్రహామ్, టీ కాపూర్ మహిములు, మహత్యా

అద్భుతాలు, దివ్య శక్తులు, అతీంద్రియ శక్తులు అనేవి ఏవీ లేవని 1963 సంవత్సరంలో

"లక్షరూపాయల" తో ప్రపంచానికి ఒక సవాల్ ప్రకటించాడు. ఇక పరిశీలించగలరు.

"నేను అబ్రహామ్ టి. కొపూర్ని కొలంబోలోని తిరువెళ్ళి వీధికి చెందిన వాళ్లు ఇందుమూలంగా చెప్పేదేమిటంటే గతంలో గానీ, ఇప్పుడు గానీ, ఎప్పుడు గానీ ప్రపంచంలో అద్భుత శక్తులు, మహిమలు అనేవి లేవని నేను ఎన్నెన్నో వ్యాసాలు రాశాను. ప్రపంచంలో ఏ భాగం నుంచి అయినా సరే, ఎవ్వరైనా సరే, అద్భుత శక్తులూ, మహిమలూ, అతీత శక్తులూ మోసం లేకుండా ప్రదర్శించగలిగితే వాళ్ళకు శ్రీలంక రూపాయల్లో ఒక లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తాను. ఈ బహుమతి ప్రకటన నేను చనిపోయే వరకుగాలి. మొదటి ఎవరైనా బహుమతి గెలుచుకొనేవరకు గాని అమలులో వుంటుంది. ' పురుషులూ, బాబాలు, సన్యాసులూ, యోగులూ, సిద్ధులూ, స్వామీజీలు, అమ్మలూ, భగవానులూ ఎవ్వరైతే ఆధ్యాత్మిక సాధన ద్వారా, దైవ వర్గాల ద్వారా, అద్భుత శక్తు పొందామని గొప్పలు చెప్పుకొంటారో వాళ్ళంతా ఇప్పుడు నేను అడిగే మహిమల్లో ఏ ఒక్కటి చేసినా (ఎనీ వన్) నా బహుమతి గెలుచుకోవచ్చు.

1. ఒక కవరులో దాచి పెట్టిన రూపాయి నోటు నెంబరు ఎంతో చెప్పండి.

2.ఒక కరెన్సీ నోటు లాంటిదాన్ని ఇంకోదాన్ని సృష్టించండి
3.మండుతున్న నిప్పుమీద కాలు కదల్చకుండానూ, కాలు కాలకుండానూ ఒక నిమువం

4. నేనే వస్తువదిగితే దాన్ని శూన్యంలోంచి తీసి ఇవ్వడం

5. ఒక ఘన వస్తువును మానసిక శక్తితో కదల్చడం లేదా వంచడం. 
6. పరేంగిత జ్ఞానం (టెలిపతిక్ పవర్) ఉపయోగించి ఇంకో మనిషి వేషం ఆలోచిస్తున్నాడో చెప్పడం
7.ప్రార్ధనతో గానీ, ఆధ్యాత్మిక శక్తితో గానీ, ఒక విరిగిన అవయవాన్ని ఒక్క అంగుళం 
పెంచడం
8.యోగశక్తితో గాలిలో తేలడం లేక ఎగరటం 
9.యోగ శక్తితో అయిదు నిమిషాలపాటు హృదయ స్పందన ఆపడం 
10.యోగ శక్తితో 30 నిమిషాలు శ్వాస క్రియను ఆపడం 
11. ఏ శక్తితోనైనా సరే నీటిమీద నడవడం.

12. శరీరాన్ని ఒకచోట విడిచిపెట్టి, ఆ వ్యక్తే ఇంకోచోట కనపడడం.
13.భవిష్యత్తులో జరుగబోయే ఒక సంఘటనను అతీంద్రియ శక్తుల ద్వారా చెప్పడం 
14.గత జన్మ తెలియడం వల్ల గానీ, ఆత్మ ప్రేరణవల్ల గానీ, దెయ్యం పట్టడం వల్ల గానీ, ఎన్నడూ తెలియని భాషను చదవడం, మాట్లాడటం లేదా అర్ధం చేసుకోవడం. 
15. ఫొటో తీయడానికి వీలుగా దెయ్యాన్ని చూపించడం.

16. ఫోటో తీస్తూ వుండగా ఫొటోలో పడకుండా (నెగటివ్ లోనికి రాకుండా) వుండ
గలగడం. 
17. తాళం వేయబడిన గది నుండి ఆధ్యాత్మిక శక్తుల ద్వారా బయటికిరావడం

18. దైవ మహిమ (ఆధ్యాత్మిక శక్తి) వల్ల ఒక వస్తువు యొక్క బరువునీ కొలతల్ని పెంచడం.

19. దాచబడిన ఒక వస్తువుని గానీ, జంతువుని గానీ, మనిషిని గానీ కనిపెట్టడం.

20. నీటిని పెట్రోలుగా గానీ, ద్రాక్ష సారాయిగా గానీ మార్చడం

21. యోగ మహిమల ద్వారా శవాలను బ్రతికించడం

22. జ్యోతిష్యం, హస్త సాముద్రికల ద్వారా పదిహస్త ముద్రికలలో లేక జనన పట్టికలలోస్త్రీ పురుషులు ఎందరో వారిలో ఎందరు బ్రతికి ఉన్నారో, ఎందరు చనిపోయారో, పుట్టిన స్థలం, సమయాల సహాయంతో చెప్పడం.

వారి

23. జ్యోతిష్యానికి సంబంధించిన వివరాలు తీసుకొని వాటిని బట్టి, ఆ మనిషి సరిగ్గా ఏరోజున ఏ నిముషానికి పుట్టాడో, ఆ స్థలం వివరాలేమిటో, దాని ఎత్తుపల్లాలేమిటో చెప్పడం

నేనీ విధంగా 1963లో సవాలు చేసినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆ విషయాన్ని పేపర్లలో ప్రచురించారు. అతీత శక్తులు చూపుతామంటూ చాలా మంది వచ్చారు. కానీ సి ఒక్కరూ వాటిని ఋజువు చేయలేకపోయారు. ఇలా కాలం వృధా అవుతున్నందున, అప్పుడు నేనొక నిబంధన పెట్టాను. ఎవరైతే నా సవాలుని ఎదుర్కొనడానికి వస్తారో వాళ్ళు ముందు వెయ్యి రూపాయలు డిపాజిట్ కట్టాలనీ, ఆ పరీక్షలో గెల్చినపుడు నేను ఇవ్వవలసిన లక్ష రూపాయలతో పాటు ఆ వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చేస్తానని. కానీ చాలా ఏళ్ళదాకా ఎవ్వరు నా సవాలు ఎదుర్కొలేదు.

డా. కోపూర్ 18-9-1978లో చనిపోయాడు. ఆయన మరణానంతరం భారత హేతువాద సంఘం మద్రాస్, ఉపాధ్యక్షులు శ్రీ ఎ. సూర్యనారాయణ, (28/18. పాంతియన్ రోడ్డు, మద్రాస్ - 8) ఈ లక్ష రూపాయలు సవాలును కొనసాగిస్తున్నారు..

మహిమలు, మహత్యాలు, అద్భుతాలు, అతీత శక్తులు, ఆధ్యాత్మిక శక్తులు. యోగ శక్తులూ, ప్రార్థనా శక్తి, మంత్ర జాలం, పరేంగిత జ్ఞానం, పరకాయ ప్రవేశం, జ్యోతిష్యం, హస్త సాముద్రికం వగైరాలన్నింటిపై డా. కోపూర్ దాదాపు 50 సంవత్సరాలు నిరంతర పరిశోధన జరిపి వాటి బూటకత్వాన్ని బట్ట బయలు చేసిన విష్ణాతుడు.. అబ్రహాంటి కోవూర్ కేరళలోని 'తిరివెళ్ళి" లో 10-4-1898లో ఒక క్రైస్తవ మత గురువు కుటుంబంలో జన్మించినవాడు.

మహిమలు, మహత్యాలు, దివ్య శక్తులు వగైరాలేవీ లేవని శాస్త్రీయంగా నిరూపించి, ప్రపంచానికే సవాల్ విసిరిన విశ్వవిఖ్యాత హేతువాది, మానవతావాది డా. కోవూర్.

Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం