రాముని జన్మ


రాముని జన్మ

దశరథుడి తాత ముత్తాతలలో ఒకడైన సుదాసుడనే పేరుగల కల్మాషపాదుడు రుతుమతి అయిన తన భార్య దమయంతిని తన కులగురువైన వసిష్ఠుడికి అప్పగించి, పుత్రభిక్ష పెట్టి తన రాజ్యాన్ని నిలుపమని ప్రార్ధించడం జరిగింది. ( వాల్మీకి రామాయణం ఉత్తరకాండ 78 సర్గ, విష్ణుపురాణ వదనం.. 162 పేజీ) ఆ వసిష్ఠుడు వర ప్రభావంతో గాని, మంత్ర మహిమతోగాని, పాలతోగాని, పాయసంతో గాని పుత్రుల్ని పుట్టించకుండా ఏకాఎకిని దమయంతికి మదన క్రీడతో కడుపు చేశాడని భాగవతం తెలుపుతుంది. అందుకు నిదర్శనం...

"అదికారణముగ బుత్రా
భ్యుదయములే నా సుదాసు భూపాలునకుం 
దదనుమతి నవ్వసిష్ఠుడు మదయంతికి గడుపుచేసె మదన క్రీడన్ "

- ( భాగవతం, నవమ స్కందం)

 ఆనాటి ఆచారం ప్రకారం రామాయణం కథనం ప్రకారం   రాముడు దశరధునికి క్షేత్ర పుత్రుడవుతాడు. భర్త అంగీకారంతో భార్యపర పురుషుడితో రంకు చేయడం వల్ల పుట్టిన పుత్రుణ్ణి క్షేత్ర పుత్రుడంటారు.

ఆనాటి సమాజంలో క్షేత్రజ పుత్రుల్నేగాక, భర్తకు తెలియకుండా పరాయిమగాడి ద్వారా పుట్టిన పుత్రుణ్ణి కూడా " గూఢోత్పన్నుడు' అనే పేరుతోనూ, పెళ్ళికాకముందు వేరేమగాడి ద్వారా 
పుట్టిన పుత్రుణ్ణి " కానీనుడు' అనే పేరుతోనూ, వివాహానికి పూర్వమే మరొకడితో కడుపు చేయించుకుని ఉన్న స్త్రీని పెళ్ళాడిన వాడికి పుట్టిన పుత్రుణ్ణి ' సహోఢజుడు' అనే పేరుతోనూ, వితంతువును వివాహం చేసుకున్న వ్యక్తికి ఆమె మొదటి భర్తవల్ల పుట్టిన పుత్రుణ్ణి " పౌనర్భవుడు" అనే పేరుతోనూ ఉత్తమ సంతానంగా పరిగణించారు.

కాని, నేటి సమాజంలో ఆ సంతానం ఉత్తమ సంతానం కాకపోగా, అధమ సంతానంగాను, నీచ సంతానంగాను, రంకు సంతానంగాను, తుచ్చ సంతానం గాను భావిస్తారు.  ఇలాంటి ఈ రోజుల్లో రంకుతనానికి పుట్టిన రాముణ్ణి " కౌసల్యా సుప్రజా రామ" అంటూ కీర్తించడం నేటి సమాజానికి అవమానం, నేటి ఉత్తమ సంతానానికి కళంకం. నేటి భార్యభర్తల వ్యవస్థకే మచ్చ అనక తప్పదు. నాటి చెడు సంతానాన్ని దేవునిగా అవతారపురుషునిగా ఆరాధిస్తున్నప్పుడు నేటి దంపతులకు కలిగిన ఉత్తమ సంతానాన్ని ఏ రకంగా భావించాలో పాఠకులు ఆలోచించాలి.

      __ సుజరె( రామాయణం, బైబిల్, ఖురాన్- హేతుబద్ధ విశ్లేషణలు)

Comments

Popular posts from this blog

Darwin theory

Indian Astronomy and Mathematics In The Classical Era Of Aryabhata