శాస్త్రీయ దృక్పథం
శాస్త్రీయ దృక్పథం అనేది ఒక జీవన విధానం. సమాజం, సమాజంలోని వ్యక్తులు ఆలోచనలు, ఆచరణలు చేసే అత్యున్నత పద్ధతి ఇది. మన చుట్టూ ఉండే భౌతిక వాస్తవి కతను పరిశీలించి, ప్రశ్నించి, పరీక్షించి, విశ్లేషించి, ఒక అభిప్రాయానికి రావడం, దాన్ని కమ్యూనికేట్ చేయడమే శాస్త్రీయ దృక్పథం. తర్కం, చర్చ, వాదన, విశ్లేషణల ద్వారా నిర్ధారణలకు రావటం శాస్త్రీయ దృక్పథంలోని ప్రధాన అంశం. ఇందులో నమ్మకం ఉంటుంది, సమానత్వం ఉంటుంది, ప్రజాస్వామ్య బద్ధత ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భౌతిక వాస్తవికత మన ఆలోచనల్లో నుండి పుట్టదు, మన ఆలోచనలే భౌతిక వాస్తవికత నుండి పుడతాయి కాబట్టి మన ఆలోచనల ద్వారా వాస్తవికతను తెలుసుకోవడం కాకుండా ఆచరణల ద్వారా తెలుసుకోవడం శాస్త్రీయ దృక్పథం. దీనికి భిన్నమైంది అశాస్త్రీయ దృక్పథం.
ఈ నిర్వచనాన్ని పరిశీలించినప్పుడు శాస్త్రీయ దృక్పధం అనేది కేవలం సైన్సుకు సంబంధించిన విషయం మాత్రమే కాదనీ, అది వ్యక్తులకూ, సమాజానికంతటికీ సంబంధించిన విషయమని అర్ధమవుతుంది.
ఆధునిక సైన్సు శాస్త్రీయ పద్ధతిని మాత్రమే అంగీకరిస్తుంది. పరీక్షకు నిలవని దాన్ని అది అంగీకరించదు. తర్కం, విశ్లేషణ, చర్చ ఉన్న సమాజాల్లో శాస్త్రీయ దృక్పథం పరిఢవిల్లు తుంది. సమాజంలో అది కొరవడితే శాస్త్రీయ దృక్పథమూ కొరవడుతుంది. శాస్త్రీయ దృక్పథం లేని చోట సైన్సు కూడా నిలవదు.
పై అంశాలను దృష్టిలో పెట్టుకుని భారత దేశాన్ని ఒక సారి పరిశీలిద్దాం.1959లో ఢిల్లీలోని భారత ఖగోళ, సంస్కృత పరిశోధనా సంస్ధ డైరెక్టర్ రామ్ స్వరూప్ శర్మ జ్యోతిష్య శాస్త్రంపై రాసిన పుస్తకాన్ని నాటి ప్రధాని నెహ్రూకు అంకితమివ్వబోయాడు. నెహ్రూ దాన్ని తిరస్కరించినందుకు ఆక్షేపిస్తూ శర్మ ఆయనకు ఉత్తరం రాశారు. దానికి నెహ్రూ ఇలా సమాధా నం చెప్పారు: ''డియర్ శ్రీ శర్మ. జులై 13న మీరు రాసిన ఉత్తరం అందింది. కృతజ్ఞతలు. నాకు జ్యోతిష్యంపై నమ్మకం లేదని మీరు రాశారు. అది చాలా వరకు నిజం. నిజమైన శాస్త్ర పరిశోధనను స్వాగతించాల్సిందే, అయితే అది శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. భారత దేశంలో మన పూర్వీకులు ఖగోళ గణింపుల్లో చాలా పురోగమించారనేది నా అభిప్రాయం. ఈ విషయంలో మీరు చేసిన శాస్త్ర పరిశీలనను అభినందిస్తూనే ఈ పుస్తకాన్ని అంకితం పొందడానికి నేను సరిపోనని భావిస్తున్నాను. నా పాయింట్ మీరు అర్ధం చేసుకుంటారను కుంటాను....''
వాస్తవానికి ''శాస్త్రీయ దృక్పథం'' (సైంటిఫిక్ టెంపర్) అన్న పదాన్ని మొట్టమొదట నెహ్రూ 1946లో ప్రచురితమైన ''డిస్కవరీ ఆఫ్ ఇండియా'' పుస్తకంలో ప్రస్తావించారు. ఆనాడు ఆయన సైంటిస్టులతో ఒక ట్రేడ్‌యూనియన్ ఏర్పాటు చేశారు. దాని పేరు భారత సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ (ఎఎస్‌డబ్ల్యుఐ). ఒక ప్రధా నిగా ఉంటూ కూడా దానికి ఆయన అధ్యక్షుడిగా ఉండేవారు. 1940,50 దశకాల్లో చాలా చురుకుగా ఉండే ఈ సంస్థ 1960 దశకం వచ్చేసరికి క్రమంగా బలహీనపడుతూ ఉనికిలో లేకుండా పోయింది. కారణం, సైంటిస్టులు క్రమంగా దాన్ని వీడి వెళ్లిపోయారు. ఎందుకు వెళిపోయారు అంటే వారిలో శాస్త్రీయ దృక్పథం కొరవడుతూ వచ్చింది.
శాస్త్రజ్ఞుల్లో శాస్త్రీయ దృక్పథం కొరవడడమా? నిజానికి ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అదే. స్వాతంత్రానికి ముందు సర్ సి.వి రామన్ తరువాత భారత దేశం గత 85 ఏళ్లలో ఒక్క నోబుల్ బహుమతి కూడా పొందలేదంటే కారణం ఇదే.
తొలి ప్రధాని నెహ్రూ అశాస్త్రీయమైన జోతిష్యాన్ని నమ్మబోనని తిరస్కరిస్తే 1998లో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న మురళీ మనోహర్ జోషీ విశ్వ విద్యాలయ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి)కి ఒక సర్క్యులర్ ఇస్తూ జ్యోతిష్యంలో డిగ్రీ కోర్సులు ప్రారంభించాలని ఆదేశించారు. అలా కోర్సులు ప్రారంభించే కళాశాలలకు ప్రత్యేక గ్రాంట్లు ఇసామని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇటువంటి అశాస్త్రీయ కోర్సులు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ప్రఖ్యాత శాస్త్రవేత్త పి.ఎం. భార్గవ, ఆయన సహచరుడు సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రముఖ సుప్రీమ్ కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ దీనిపై వాదించారు. విశేషమేమంటే జ్యోతిష్యం వంటి అశాస్త్రీయ, అహేతుక అంశాన్ని శాస్త్ర విజ్ఞానం అంటూ కళాశాలల్లో ప్రవేశపెట్టడం తప్పు అని చెప్పాల్సిన కోర్టు శాస్త్రవేత్తలు వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. జ్యోతిషం శాస్త్రం కాదు అని అనేక సందర్భాల్లో నిర్ధారణ అయిన విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు లేదు. దీనికి కారణమేమిటి? న్యాయమూర్తులు కూడా మూఢనమ్మకాలకు అతీతులు కాలేదన్నమాట. ఈ తీర్పుకు వ్యతిరేకం గా ఇంతటి దేశంలో ఒక్కరంటే ఒక్క శాస్త్ర వేత్త వారికి మద్దతుగా ముందుకు రాలేదు. సామాన్యులు కొందరు భార్గవకు మద్దతుగా నిచారు, కోర్టు కేసులెదుర్కోడానికి విరాళాలు ఇచ్చారు గానీ శాస్త్రవేత్తలు ముందుకు రాకపో వడం మన శాస్త్రవేత్తల తీరును తెలియజేస్తోంది.
వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో వేద గణితం, జ్యోతిష్యం వంటి కుహనా శాస్త్రాలను (సూడో సైన్సెస్) పాఠ్యగ్రంధాల్లో చేరిస్తే ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చేసరికి పరిస్థితి మరింత దిగ జారింది. ఈ ప్రభుత్వం మన వేదాలు, పురాణా లనే ఏకంగా సైన్సుగా ప్రచారం చేయడం ప్రారంభించింది. దీనికి అఖిల భారద సైన్సు కాంగ్రెస్‌ను వేదిక చేసుకున్నారంటే మన దేశంలో శాస్త్రీయ దృష్టి ఎంత అధఃపాతాళానికి చేరుకుం దో అర్ధమవుతుంది. శాస్త్రీయ దృక్పథం లేని చోట సైన్సు అభివృద్ధి కాదు.
ఢిల్లీలో శాస్త్రవేత్తల బృందంతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ గణేశుడు సగం మనిషి, సగం ఏనుగు రూపంలో ఉన్నాడంటే పురాణ కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ మనవాళ్లకు తెలుసు అన్నదానికి నిదర్శనం అని శెలవిచ్చారు. ప్రధాని ఇంత అశాస్త్రీయ సంభా షణ చేస్తుంటే ఆయన ఎదురుగా ఉన్న ఒక్క శాస్త్రవేత్త కూడా ఖండించలేకపోయారంటే ఏమనాలి? ప్రధాని చెపింది ఒక నమ్మకం. ఒక ఊహాజనితమైన విషయాన్ని తీసుకొచ్చి అదే సైన్సు అంటుంటే శాస్త్రవేత్తలకు చీమకుట్టి నట్లయినా లేని దేశంలో సైన్సు ఎలా అభివృద్ధి చెందుతుంది?
ఇంకో ఉదాహరణ: గతేడాది ముంబయిలో జరిగిన 102వ సైన్సు కాంగ్రెస్‌లో ఒక సూడో సైంటిస్టు ఒక సూడో సైంటిఫిక్ పత్రం ప్రవేశపెట్టారు. 9000 సంవత్సరాల క్రితమే భారత్‌లో ఇప్పుటికన్నా పెద్ద జంబో విమానాలు ఉండేవని ఆ పత్రంలో పేర్నొన్నారు. ఒక్కో విమానం 60 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పూ ఉండేవనీ, కొన్ని విమానాలైతే 200 అడుగుల పొడవు కూడా ఉండేదని చెప్పారు. భారత దేశంలో హరప్పా, మొహం జదారో నాగరికతల కన్నా 4,500 సంవత్సరాల ముందే ఇవన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. అంతటితో ఆగలేదు, ప్రస్తుత రాడార్ వ్యవస్థకన్నా మెరుగైన వ్యవస్థలు ఆనాడుండేవని పేర్కొన్నారు. ప్రతి జీవ, నిర్జీవ పదార్ధం నుండి నిరంతరం శక్తి విడుదలవుతుందన్న సూత్రం ఆధారంగా ఈ రాడార్ పనిచేస్తుందని చెప్పారు. 'లా ఆఫ్ ఇంటర్-పెనిట్రేషన్' అనే కొత్త సూత్రం ప్రకారం సైన్సు-ఆధ్యాత్మికతలు కలగలిసిపోతాయని పత్రంలో పేర్కొన్నారు.
నిరూపణకు నిలిచేదే సైన్సు. నరేంద్ర మోడీ సైంటిస్టులకు చెప్పిందిగానీ, సైన్సు కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టబడిన పత్రంలో పేర్కొన్నది గానీ నిరూపితమైన విషయాలు కావు. కేవలం నమ్మకాలు. అశాస్త్రీయమైన విషయాలు. మరి అంతమంది శాస్త్రవేత్తల ఎదుట అంతగా మూఢ నమ్మకాల ప్రచారం జరుగుతున్నా వారు కిమ్మనకున్నారంటే మన శాస్త్రవేత్తల్లో శాస్త్రీయ దృక్పధం ఉన్నట్లు ఎలా అనుకుంటాం?
ఇంకా ఘోరం ఏమంటే: మన శాస్త్రవేత్తలే మూఢనమ్మకాలను పాటించడం. భాతర దేశ మంగళయాన్ ప్రాజెక్టు మనందరికీ ఎంతో గర్వకారణమైంది. రాకెట్ సైన్సు, అత్యంత ఖచ్చితమైన రాకెట్ టెక్నాలజీ అభివృద్ధి వల్ల ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. కానీ మన ఇస్రో ఛైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ మంగళ్‌యాన్ ప్రారంభానికి ఒక రోజు ముందు తిరుపతి వెళ్లి రాకెట్ నమూనాకు పూజలు చేయించి వచ్చారు. ఏమిటిది అని అడిగితే ఏమో 'ఛాన్స్'కు ఎందుకు వదిలేయడం అన్నారు. మన ఉపగ్రహాన్ని అంగారకునిపైకి తీసుకుపోయింది సైన్సా, ఛాన్సా? పూజలు చేస్తే ఉపగ్రహం అంగారకుని చేరుతుందంటే ఈ పరిశోధనలు ఎందుకు? శాస్త్రవేత్తల కృషి ఎందుకు? ఇంత ప్రయాస ఎందుకు? ఒకవేళ శాస్త్ర-సాంకేతిక విజ్ఞానం వల్లే ఉపగ్రహం అంగారకుని చేరుతుందంటే ఈ పూజలు ఎందుకు?
ద్వైదీ భావం. శాస్త్రీయ దృక్పధం స్థానంలో మన సమాజంలో ఈ ద్వైదీ భావం రాజ్యమేలుతోంది. శాస్త్రం శాస్త్రమే నమ్మకాలు నమ్మకాలే అనేది అశాస్త్రీయమైన వైఖరి. శాస్త్రం మానవ కృషికి సంబంధించింది. నమ్మకం మనవాతీతమైంది.
మనిషి తత్వంలోనే ఈ ద్వైదీ భావం ఉంది. 'నారుపోసినవాడు నీరుపోయడా'' అన్నది మానవాతీతమైన భావనను ప్రోత్సహించే తత్వం. ''గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు'' అంటే ఆగుతుందా అనేది మానవ కృషిని ప్రోత్సహించే తత్వం. మనిషి జ్యోతిషం చూసు కుని ఇంట్లో కూర్చోడు. పని చేసి జ్యోతిష్యం పరీక్షిస్తాడు. పనికి వెళుతూ శకునాలు చూస్తాడు. కష్టపడుతూ యంత్రాలు, తంత్రాలను ఆశ్రయి స్తాడు. ఆసుపత్రికి వెళుతూ కొబ్బరికాయ కొడతాడు. పరీక్షకు సిద్ధమై భగవంతుని ప్రార్ధిస్తా డు. ఇంకా చాలా ఉదాహరణలు చెప్పొచ్చు.
మనిషిలో ఈ ద్వైదీభావం అంటే ఒకవైపు విజ్ఞానశాస్త్రంపై నమ్మకం, రెండో వైపు అతీత శక్తి లేక దేవుడు అనేదానిపై నమ్మకం రెండూ కలిసి నడవడం అనేది శాస్త్ర విజ్ఞానాభి వృద్ధి క్రమంలోనే ఏర్పడింది.
సైన్సు ఆవిర్భావం గురించి ప్రఖ్యాత శాస్త్రవేత్త, ''చరిత్రలో సైన్సు'' గ్రంథ రచయిత జె.డి. బెర్నాల్ ఇలా అన్నారు: ''మానవజాతి చరిత్ర మొత్తం పరిశీలిస్తే సైన్సు స్వరూపం ఎంతగానో మారిపోతూ వచ్చింది. అందుకే సైన్సుకు ఒక నిర్దిష్టమయిన నిర్వచనం చెప్పుకో వడం కష్టం. మానవ సమాజం శైశవప్రా యంలో ఉన్నప్పుడు సైన్సు మనుషుల ఆచారాలు, మతక్రతువుల్లో అంతర్లీనంగా దాగి ఉండేది. ఆ తర్వాత ప్రకృతి శాస్త్ర ప్రభావం వల్ల, దాని రూపంలో అది నిర్ధిష్టంగా ఏర్పడింది. మానవ నైపుణ్యం, సైన్సు, తాత్విక చింతనల మధ్య నిరం తరం అవినాభావ సంబంధం ఉంటూవచ్చింది.
ఒకరకంగా చెప్పాలంటే సైన్సు క్రమబద్దం చేయబడిన నైపుణ్యం, మరోరకంగా అది హేతుబద్దం గావించబడిన పురాణం. ఎందుకంటే సైన్సు ఆదిమానవుని చేతివృత్తులు, మతాచారుల మంత్రపఠనాలలో నిగూఢమైన అంశం నుండి ప్రారంభమయింది. మానవుని జీవనయాత్రలో స్థిరపడుతూ, మారుతూ వచ్చిన కార్యకలాపాలు, సమాజం అవిచ్ఛిన్నంగా సాగడా నికి దోహదపడిన భావాలూ, ఆచారాలు సామాజంలో ఏర్పడిన వివిధ వర్గాల హక్కులు వాటి మధ్యలో సైన్సు అభివృద్ధి చెందుతూ వచ్చింది.''
అందువల్ల సైన్సు, శాస్త్రీయ దృక్పధం అనేవి శాస్త్రజ్ఞుల లేబరేటరీల్లో పుట్టలేదు. సమాజంలో పుట్టాయి. కాబట్టి వాటి స్థితిగతులను సమాజమే నిర్ణయిస్తుంది. చరిత్రలో అన్ని స్థలాలలోనూ, అన్ని కాలాల లోనూ సైన్సు ఒకేలాగా వెలుగొందలేదు. కొంతకాలం ఒక్కో చోట దేదీప్యమానంగా వెలిగిన విజ్ఞాన జ్యోతి మరికొంత కాలానికి అణగారిపోయి మిణుకు మిణుకు మన్నది. వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలలోనే సైన్సు అభివృద్ధి చెందింది. ప్రాచీన వ్యాపార కేంద్రాలైన బాబిలోనియా, ఈజిప్టు, భారతదేశాలలో సైన్సు వికసించింది. ఆ తరువాత గ్రీసు దేశం వీటన్నిటి వారసత్వాన్ని పుచ్చుకున్నది. గ్రీసులోనే సైన్సుకు ఈనాడు మనం చూస్తున్న హేతుబద్ధ విధానం తొలిసారి అబ్బింది. అయితే గ్రీసులో నగర రాజ్యాల పతనంతో శాస్త్రీయ ఆలోచనా విధానం మంద గించింది. తరువాత రోమను సామ్రాజ్యంలో సైన్సుకు స్థానం లేకుండా పోయింది. పశ్చిమ ఐరోపాలో ఏర్పడిన బర్బర రాజ్యాలలో విజ్ఞానజ్యోతి పూర్తిగా మట్టుపెట్ట బడింది. అయితే విజ్ఞానం ఈ ప్రపంచం నుండి పూర్తిగా తుడుచుకుపోలేదు. తూర్పుదేశాల నుండి గ్రీసు చేరిన విజ్ఞానం తిరిగి తూర్పుదేశాలకు చేరుకు న్నది. సిరియా, పర్షియా, భారత్, చైనాలలో నూతనంగా ఆభిర్భవించిన ఇస్లాం మత ప్రభా వం కింద సైన్సు ఊపిరి పోసుకుంది. అక్కడ నుండి మళ్ళీ మధ్యయుగాలలో అది యూరప్‌లో ప్రవేశించింది. అక్కడ సైన్సు మళ్ళీ అభివృద్ధి చెందింది. తొలిదశలో చాలా నెమ్మదిగా అడుగులు వేసిన విజ్ఞాన శాస్త్రం తరువాత ఒక్కసారిగా ఉరుకులు పరుగులు అందుకున్నది. సృజనాత్మక కార్యకలాపాలు పెరిగి, ఆధునిక శాస్త్రవిజ్ఞానానికి అంకురార్పణ అక్కడే జరిగింది.
ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో విజ్ఞాన శాస్త్ర రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆ తరువాత సైన్సు ఊహించని వేగంతో పురోగమించింది. అయితే ఈ పురోగమనంలో కూడా మనకు నాలుగు దశలు కనిపిస్తాయి.
మొదటిదశ ఇటలీలో ప్రారంభమ యింది. లియోనార్డో డావిన్సీ, వెసేవియస్, కోపర్నికస్ మొదలైన శాస్త్రవేత్తలతో యాంత్రిక విజ్ఞానం, శరీర ధర్మశాస్త్రం, ఖగోళశాస్త్రాలు పునరుజ్జీవనం పొందాయి. మనిషి ప్రపంచానికి సంబంధించిన అభిప్రాయాలపై ప్రాచీన విజ్ఞాను ల పట్టును వీరు పంటాపంచాలు చేశారు. రెండవ దశ ఫ్రాన్స్, బ్రిటన్‌లలో ప్రారంభమైంది. బెకన్, గెలీలియో, డిన్‌కార్టెస్‌లతో ప్రారంభమై మహాశాస్త్ర వేత్త న్యూటన్ వరకు ఈ దశ సాగింది. ప్రపంచాన్ని వారు నూతన గణిత యాంత్రిక నమూనాలో ఆవిష్కరించారు. తరువాత కొంత విరామానంతరం పారిశ్రామిక బ్రిటన్‌లోనూ, విప్లవ ఫ్రాన్స్‌లోనూ సైన్సు మూడవ దశ మార్పుకు గురయింది. గ్రీకుల కాలంలో ఏ మాత్రం పరిచయం లేని విద్యుత్ వంటి నూతన శాస్త్ర రంగాలకు తలుపులు తెరుచు కున్నాయి. విద్యుత్, యంత్రాలు, రసాయనాలు వీటిద్వారా విజ్ఞానశాస్త్రం ఉత్పత్తి, రవాణా రంగాలలో మార్పులకు దోహడపడింది. ఇక నాల్గవది, చివరి దశ మనకాలంలో కనిపిస్తున్న విజ్ఞానశాస్త్ర విప్లవం. సైన్సు ఇప్పుడు ప్రపంచ వ్యాపితరూపం సంతరించుకున్నది. పాత పరిశ్రమలు పోయి నూతన పరిశ్రమలు అనేకం వచ్చాయి. మానవ జీవనంలోని అన్ని రంగా లకూ సైన్సు విస్తరించింది.
విజ్ఞానశాస్త్ర అభివృద్ధిలోని ఈ దశలన్నీ సామాజిక, ఆర్థిక మార్పులతో ముడిపడి ముందుకుసాగాయి. గ్రీకుసైన్సు ధన ప్రాబల్యం గల ఇనుపయుగపు బానిస సమాజ అభివృద్ధి, పతనాలను ప్రతిబింబిస్తోంది. గ్రీసులో తొలి ప్రజాస్వామ్యంతో పాటే సైన్సూ, శాస్త్రీయ ఆలోచనలూ అభివృద్ధి చెందాయి. అయితే అది బానిస యజమానుల ప్రజాస్వామ్యమే కానీ ప్రజలందరి ప్రజాస్వామ్యం కాదు. అందుకే ఈ కాలంలో సైన్సు అభివృద్ధికి పరిమితులు ఏర్పడ్డాయి. మధ్యయుగాలలో విజ్ఞాన శాస్త్రం, శాస్త్రీయ ఆలోచనలు తిరోగమించాయి. కారణం ఫ్యూడల్ ఆర్ధిక వ్యవస్థలోని అస్థిరత. ఈ సమాజంలో సైన్సు ఉపయోగం చాలా తక్కువ. అందువల్ల ఈ కాలంలో చర్చి, దాని ఆలోచనా విధానం ప్రజలపై పెత్తనం సాగించింది. పెట్టుబడిదారీ వర్గం ఆవిర్భవించి, అభివృద్ధి చెంది ఫ్యూడల్ శృంఖలాలను ఛేదించినప్పుడు మాత్రమే మళ్ళీ సైన్సు అభివృద్ధి చెందింది. ఈ కాలంలో సైన్సుకూ మతానికీ మధ్య పెద్ద యుద్ధం జరిగింది. చివరికి మతంపై సైన్సు విజయం సాధించింది. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ, ఆధునిక సైన్స్ రెండూ ఒకేసారి ప్రారంభమయ్యాయి.
పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించి నాలుగు శతాబ్దాలు అయింది. ఈ కాలంలో సైన్సు విపరీతంగా పెరిగింది. సైన్సు-సాంకేతిక శాస్త్రాలు మానవ జీవిత విధానాన్నే మార్చేశాయి. మానవుని జ్ఞాన నేత్రం పదార్ధపు చిట్టచివరి లోతుల నుండి విశ్వపు చిట్టచివరి అంచుల వరకు చూడగలుగుతోంది. మానవ జీవితపు ప్రతి క్షణం, ప్రతి అడుగు, ప్రతి వస్తువు సైన్సుతో ముడిపడి సాగుతోంది.
సైన్సు ఇంతగా పెరిగినప్పుడు శాస్త్రీ య దృక్పధం అంతే మోతాదులో పెరగాలి కదా! కానీ విచిత్రం...! ఆధునిక సమాజంలో శాస్త్రీయ దృక్పధం పెరగకపోగా క్రమంగా తగ్గుతోంది. బాబాలు, సాధువులు, అమ్మలను కొలవడం, మూఢనమ్మకాలు, టివీలో మత బోధనలు, అశాస్త్రీయ యాడ్స్, దెయ్యాలు మూఢ నమ్మకాలను సమర్ధించే సినిమాలు, టివి కార్యక్రమాలు, అశాస్త్రీయ వైద్యం, వాస్తు.... అన్ని రకాల మూఢవిశ్వాసాలు పెరుగుతున్నాయి. మామూలు ప్రజలే కాదు, సైన్సు చదువుకున్న వారు, శాస్త్రవేత్తలు కూడా ఎందుకు ఈ అశాస్త్రీయ భావాలను ప్రశ్నించకుండా అమోదిస్తు న్నారు? ఆచరిస్తున్నారు?
తెలుగునాట భక్తిరసం
తెప్పలుగా పారుతోంది
డ్రైనేజీ స్కీములేక
డేంజరుగా మారుతోంది
అని గజ్జెల మల్లారెడ్డి కవిత్వం చెప్పారు. కానీ అభ్యుదయ కవే కాలం గడిచే సరికి మూఢనమ్మకాల బారిన పడ్డారు. కుల,మత నమ్మకాలు, మూఢనమ్మకాలకు దూరంగా ఉన్న కుటుంబాల్లో తరాలు మారుతున్న కొద్దీ అశాస్త్రీయ నమ్మకాలు పెరుగుతున్న వైనాన్ని వారి పెళ్లిళ్లు, క్రతువులు, ఇతర జీవన ఆచారాల్లో చూస్తున్నాం. ఎందుకిలా జరుగుతోంది?
హేతువాదం, లౌకికవాదం, శాస్త్రీయ ధృక్పథం అనేవి సమాజాన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచనా ధోరణులు. ఒకనాడు ఫ్యూడల్ సమాజంపై తిరుగుబాటుకు ఈ ఆలోచనలనే ఆధునిక బూర్జువావర్గం సాధ నాలుగా చేసుకుంది. ఫ్రెంచ్ విప్లవ కాలంలో క్యాథలిక్కు మతాచారాలను ఫ్రీ రాడికల్స్ దునుమాడారు. దైవ భావాన్నే తిరస్కరించారు. నిజానికి విశ్వాన్ని వర్ణించడానికి ఆదిమానవులకు దేవుడు అవసరమైనాడు. కాని అభివృద్ధి చెందిన సైన్సు, విశ్వసృష్టిలో దేవుని ప్రమేయం లేదని తేల్చేసింది. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త లాప్లాస్ తను ఖగోళాన్ని గురించి చేసిన అధ్యయనంలో దేవుని ప్రమేయం ఎక్కడా రాలేదని చెప్పాడు. ఖగోళశాస్త్రమే కాదు, నేడు జన్యుశాస్త్రం, మానవ విజ్ఞాన శాస్త్రం, మెదడుకు సంబంధించిన పరిశోధనలు ఇవేవీ కూడా దేవుని ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి. కాబట్టి శాస్త్రవేత్త లకు తెలుసు దేవునితో వారికీ, వారి పరిశోధ నలకూ సంబంధం లేదని. అయినా వారు దేవుని నమ్ముతున్నారు. సమాజం నడవడానికీ, ప్రజల్లో నీతినియమాలు స్థాపించడానికీ దేవుడు అవసరం అంటారు. అందువల్ల ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా, ఎంత విజ్ఞానవంతుడైనా అతని మెదడులో నుండి దేవుడు అనే భావం చెరిగిపోక పోవడమే కాదు అనేక రకాల మూఢనమ్మకాలతో కలగలిసి మరింత వికారంగా తయారవుతోంది. పామరులు, చదువు లేనివారైతే సరే... బాగా నాగరీకులమనుకున్న వారే బాబాలు, స్వాములకు సాష్టాంగపడు తున్నారు. సత్యసాయిబాబా చనిపోయిన తరువాత బాగా చదువుకున్న వారే బాబాగారు మూడో రోజు లేస్తారు చూడండి, ఆయన సమాధిలో నుండే మాట్లాడతాడు, అద్భుతాలు చేస్తాడు అన్నారు. కానీ అలా ఏం జరగలేదు. శకునాలు, అదృష్టాలు, దిష్టులు, జ్యోతిష్యాలు, వాస్తులు వగైరావగైరా మూఢ నమ్మకాలు ఈ 'విజ్ఞానుల్లోనే' ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నిత్యజీవన సమరంలో సతమతమ వుతున్న శ్రామికునికన్నా 'విజ్ఞానులైన' ఈ ఉన్నతవర్గాల్లోనే ఈ నమ్మకాలూ, మూఢాచారాలు ఎక్కువగా ఉన్నాయి, పెరుగుతున్నాయి ఎందుకన్నది ప్రశ్న.
సమాజంలో శాస్త్రీయ దృక్పధానికి లేక కొరవడడానికి రెండు ప్రాతిపదికలున్నాయి. 1. మన విజ్ఞానానికి ఉన్న పరిమితులు 2. సమాజిక పరిస్థితులు.
మన విజ్ఞానానికి ఉన్న పరిమితు లేమిటి? ఆదిమానవుడు ప్రకృతిపై పనిచేయడం ద్వారా దానిలోని సూత్రాలను కనిపెట్టగలిగాడు. ఆ విధంగా అతను విజ్ఞానాన్ని విస్తరించు కుంటూ పోతున్నాడు. విజ్ఞానం ఎంత విస్తరిం చినా అతని మెదడుకు అందని చీకటి ప్రాంతం చాలా ఉంది. విశ్వంలో 94 శాతం డార్క్ మేటర్ ఉంది. దాని గురించి మనకేం తెలియ దు. 'తెలిసిన' విశ్వంలో కూడా మనకు తెలియ ని విషయాలు చాలా చాలా ఉన్నాయి. అందువల్ల ఈ తెలియని చీకటి ప్రాంతం ''విశ్వాసాలు'' పెరగడానికి ఒక ప్రాతిపదిక.
రెరడవది సామాజిక ఆర్థిక చంట్రంలో నెలకొన్న పరిస్థితులు అశాస్త్రీయ భావాలు పెరగడానికి మరో ప్రాతిపదికను సృష్టిస్తున్నాయి. మానవుల ''సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక జీవితాలపై వారి భౌతిక జీవితావసరాసాల ఉత్పత్తి విధానం విధిగా ఆధిపత్యం వహిస్తుంది'' అని కారల్ మార్క్స్ చెప్పాడు. అంటే నేటి మన ప్రజల వైజ్ఞానిక జీవితంలో వస్తున్న మార్పులకు ప్రాతిపదిక మన సమాజపు ఆర్థిక జీవనంలో అంటే ఆస్తి, సంపదల సృష్టి, పంపిణీ విధానంలో ఉందన్నమాట.
మన సమాజంలో కొందరు ఎంత కష్ట పడినా వారి వద్ద పేదరికం పోగుపడు తోంది, మరికొందరు కష్టపడకపోయినా వారివద్ద సంపద పోగుపడుతోంది. పోగుపడిన సంపద కొందరివద్ద నుండి మళ్లీ ఇంతలోనే మాయమైపోతోంది. తెలియకుండానే వస్తున్న సంపద తెలియకుండానే వెళ్లిపోవడానికి కారణ మేమిటి? తాము ఏ తప్పూ చేయకపోయినా కొన్నిసార్లు సంపద కోల్పోతున్నారు. ఏ ఘన కార్యం చేయకపోయినా సంపద అకస్మాత్తుగా రావడం చూస్తున్నారు. అందువల్ల ఏదో తెలియని శక్తి దీన్ని నడిపిస్తోందన్న భావనకు ఆధునిక మానవుడు గురవుతున్నాడు. దాన్ని అదృష్ణమనో, మరొకటనో అనుకుంటున్నాడు.
యాంత్రీకరణ పెరిగి ఉత్పత్తి బాగా అభివృద్ధి చెందినాక సంపద ఎలా పోగవు తోంది, ఎలా పంపిణీ జరుగుతోందో వ్యక్తులకు తెలిసే అవకాశాలు మరింత తగ్గిపోతున్నాయి. ఆస్తి కార్పొరేట్ సంస్థల్లో సమిష్టి, నైరూప్య గుణాలు సంతరించుకుంటోంది. స్టాక్స్, బాండ్లు, టైటిల్ డీడ్‌లుగా మారి స్టాక్ ఎక్సేంజ్ సుడిగుండంలోకి విసిరివేయబడుతోంది. అక్కడ ఆస్తిని కొనుగోలు, అమ్మకాలు ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండానే జరిగిపోతున్నాయి. చివరికి అది తనదగ్గరికి ఎక్కడి నుండి వచ్చిందో ఎక్కడికి పోతోందో కూడా తెలియదు. చేతులు మారుతోంది. స్టాక్ ఎక్సేంజిలో కొందరికి నష్టం వస్తోంది. కొందరికి లాభాల్తొన్నాయి. స్టాక్‌లు ఎందుకు నష్టపోతున్నాయో, ఎందుకు లాభ పడుతున్నాయో తెలియదు. అంతా ఒక జూదం లాగా సాగిపోతోంది. దీని గురించి పాల్ లాఫార్గ్ ఇలా అంటాడు: ''ఆధునిక ఆర్థికాభివృద్ధి మొత్తం పెట్టుబడిదారీ సమాజాన్ని ఒక పెద్ద అంతర్జాతీయ జూద గృహంగా మార్చేసింది. ఇక్కడ పెట్టుబడిదారుడు నిత్యం పెట్టుబడిని గెలుచుకుంటుంటాడు, ఓడిపోతుంటాడు. ఇదంతా కూడా ఎవరూ ఊహించని అదృశ్య ఘటనల వల్ల సంభవిస్తుంటాయి. ఇదంతా కూడా అదృష్టం మీద ఆధారపడి నడుస్తుందని వారు భావిస్తుంటారు. ఒక జూద గృహంలో మాదిరిగానే అదృశ్యశక్తి పెట్టుబడిదారీ సమాజంలో తచ్చాడుతుంటుంది.''
పేకాడేవాడు ప్రతి ముక్కకూ అదృ ష్టాన్ని పరీక్షించుకుంటుంటాడు. సెంటిమెంట్లు, నమ్మకాలు, శకునాలు అతన్ని ముక్కముక్కకీ నడుపుతుంటాయి. మన స్టాక్ మార్కెట్లో పెట్టు బడి పెట్టిన వారు కూడా ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయంలో పేకట రాయుళ్ల మాదిరి సెంటిమెంట్లు, నమ్మకాలు, శకునాలకు లోనవుతారు. అటువంటి వారు హేతుదృక్ప థాన్ని పూర్తిగా వదిలేసి సంపూర్ణ మూఢనమ్మ కాల మనుషులుగా మారతారు.
ఆదిమానవుడు ప్రకృతి శక్తుల గమనం గురించి తెలియక వాటిముందు ఎంత అయోమయంగా నిలబడ్డాడో నేటి సమాజంలో సంపదను నడిపించే ఈ అదృశ్యశక్తి ముందు మనిషి అంతే అయోమయంగా నిలబడ్డాడు. తను సృష్టించుకున్న విలువలేని, లేక అత్యంత విలువ తక్కువ కాగితం ముక్క (రూపాయి) నాగరిక సమాజాన్ని నడుపుతోంది. తిండి, ఇల్లు, గుడ్డ, వినోదం అన్నిటినీ ఇస్తోంది. దాని గమనం అదృశ్య శక్తులతో నడుస్తోంది. ఇదంతా మనిషిలో ఒక రకమైన మార్మికతను పెంచి పోషిస్తోంది. అందునా ఆర్థిక సంక్షోభ కాలాల్లో అయితే తమ చేతుల్లో లేని అదృశ్య శక్తులు విచ్చలవిడిగా వ్యవహరిస్తాయి. మొత్తం మీద ఆధునిక జీవనంలో మనిషి అంతులేని వైచిత్రుల అగాథంలో కూరుకుపోతాడు. శాస్త్రవేత్తల కృషి వల్ల ప్రకృతి శక్తులపై అదుపు సాధించిన మానవుడు సామాజిక శక్తులమీద అదుపు సాధించలేకపోతున్నాడు. ఇక్కడ ఆర్థిక శక్తులే సమాజాన్ని, రాజకీయాలను అన్నిటినీ నడుపుతాయి. అవి అతన్ని ఎంతగా భయ పెడతాయంటే ఆదిమానవుడు ప్రకృతి శక్తులను ప్రసన్నం చేసుకోడానికి చెట్టూ పుట్టా ముందు మోకరిల్లినట్లు ఆధునిక మానవుడు ఈ సామాజిక అగోచర శక్తిని ప్రసన్నం చేసుకోడానికి దేవుళ్లూ, దెయ్యాలు, బాబాలు, స్వాములు అందరినీ మొక్కుతాడు. ఆదిమానవుడు ప్రకృతిని ప్రసన్నం చేసుకోడానికి రకరకాల క్ర
Comments
Post a Comment