మనిషికి మానవత్వం చాలా అవసరం

మనిషికి మానవత్వం చాలా అవసరం 

తోటి మానవులు పుట్టుకతో మంచివారనీ, చెడ్డవారనీ, అసత్యాలు పలికేవారనీ, నిజాలు మాట్లాడేవారనీ, దొంగలనీ, దొరలనీ, ధనవంతులవీ, పేదవారవీ ఉండబోరనీ, ఆ తర్వాత కాలంలో వయస్సు పెరిగే కొలదీ చుట్టూ వుండే వారి నుండి, వారి అలవాట్ల వల్ల మనం ప్రభవితమౌతూ నేర్చుకుంటూ వుంటామేగాని, వేరుగా ఉండరని అర్థం చేసుకోవాలి. సమాజం ఈనాడు అనేక లోపాలతో, నేరాలతో, ఘోరాలతో, అవాస్తవాల అల్లికతో నిండిపోయి వుండటానికి కారణాలు తరతరాలుగా వస్తున్న మతాల బోధనలు, వాటి నమ్మకాలు, మనలో జీర్ణించుకున్న ఎన్నో అవాస్తవాలు నమ్మకాల వల్ల అలవాటుగా వస్తున్నవేనని అర్థమౌతుంది. కొన్ని అవాస్తవాలను నమ్మి వాటిని తప్పుగా భావించకుండాపోవడం వల్ల అవి కాలక్రమంలో అలవాట్లుగా మారిపోతాయి. ఇలా మతాల ప్రభావంతో మనుష్యులు ప్రభావితులై లోపాలు చేయడానికి, లోను కాబడుతున్నారు. అంతేగానీ, సహజంగా మానవులు ఉత్తములు, ఉన్నతులనీ, లోపాలు చేసేవారు, చేయనివారంటూ ఎవరూ ఉండబోరని మార్క్సిజం బోధనల వల్ల నేను అర్థంచేసుకున్నాను.

ప్రపంచంలో ఏ యుగంలోనూ ఏ మానవుడూ దైవ ఆరాధనల వల్ల ఎప్పుడూ ఏ విధమైన ప్రయోజనం పొంది ఉండలేదు. స్వామీజీలు, బాబాలు తదితరుల్లాంటి మానవులవల్ల ఏ ప్రయోజనం పొందిన ఆధారాలు లేవు. మన జీవిత కాలంలో మత నమ్మకాలు, కుల నమ్మకాలు, ప్రాంతీయ నమ్మకాలు, జాతీయ విభేదాలకు లోనుకావడంవల్ల ఏ ఒక్కరూ ఏ ప్రయోజనం పొందిన ఉదాహరణలు లేకపోగ మానసికంగా తోటివారితో విభేదాలు పెంచుకోవటమే అవుతుంది. మన జీవితకాలమంత ఆధ్యాత్మిక మూఢనమ్మకాలు నమ్మి ఎంతో వ్యయప్రయాసలకు లోనవుతూ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటూ సంపదనంతా ఖర్చు పెడుతూ చివరకు కాలధర్మం చెందటం యుగాలుగా కోటాను కోట్ల మంది తమ కాలాన్ని సద్వినియోగ పరుచుకోలేక పోతున్నామేమోనని లోతుగా ఆలోచించ మనవి చేస్తున్నాను.

మానవత్వం అవసరం :

తోటి మానవులను గౌరవించటం, శ్రమకు తగ్గిన ప్రాధాన్యతనిస్తూఉండటం, మానవుల శ్రమ వల్లే సంపద సృష్టించబడుతున్నదనే వాస్తవాలను గుర్తించటం, తోటిమానవుల పేదరికాన్ని, ఎన్నో రకాల ఈతిబాధలను, రోజు లక్షలాదిమంది అనేక విధాలుగా మరణిస్తూ ఉండలం ఇలాంటివన్నీ మానవతా దృక్పథంతో ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తించటం మానవత్వం అవుతుంది.

_చుక్కపల్లి పిచ్చయ్య


Comments

Popular posts from this blog

Darwin theory

ప్రాచీన సాహిత్యంలో సృష్టి పరిణామవాదం